వరంగల్

ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, నవంబర్ 20: ప్రభుత్వంచే అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు అర్హులకు అందేలా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రీతిమీనా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి సందర్భంగా వివిధ సమస్యలపై జిల్లా నలుమూలల నుండి వచ్చిన అభ్యర్థుల వినతులను కలెక్టర్ స్వయంగా స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అంకితభావంతో అలసత్వం వీడి సమయపాలన పాటిస్తూ మానవీయ కోణంతో సమస్యలు పరిష్కరించాలని కోరారు. అధికారులు ప్రభుత్వ పథకాలపై అవగాహన కలిగి ఉండి జిల్లా అభివృద్ధికి తోడ్పాటును అందించాలని అన్నారు. ప్రతి దరఖాస్తు మండలస్థాయిలో సమస్యకు పరిష్కారం అయ్యేలా చూడాలని అన్నారు.
నేటి ప్రజావాణిలో మొత్తం 145్ధరకాస్తులు అందజేయగా పింఛన్ల మంజూరు, మూడు ఎకరాల భూమి, భూతగాదాలు, మరుగుదొడ్ల అర్జీదారులు పిర్యాదులు అందజేశారు. మండల ప్రత్యేక అధికారులు ప్రతి బుధవారం మండలాలకు వెళ్లి ప్రభుత్వ వసతిగృహాలు, పాఠశాలలు ఇతర ప్రభుత్వ కార్యాలయాలు ఆకస్మికంగా తనిఖీ చేసి నివేదిక సమర్పించాలని పలుమార్లు ఆదేశించినా సక్రమంగా నిర్వహించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూప్రక్షాళన నిర్వహించే తీరును గ్రామ, మండలస్థాయిలో ప్రభుత్వ పరిపాలన పటిష్ట ఏర్పాటుకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ దామోదర్‌రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి రాంబాబు, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి వెంకటనారాయణ సంబందిత జిల్లా అధికారులు పాల్గొన్నారు.

చైల్డ్‌లైన్ సే దోస్తీ వారోత్సవాలలో భాగంగా విద్యార్థుల ర్యాలీ
నర్సంపేట, నవంబర్ 20: చైల్డ్‌లైన్ సే దోస్తీ వారోత్సవాలలో భాగంగా చివరి రోజు అయిన సోమవారం నర్సంపేటలో బాలల హక్కుల పరిరక్షణ ర్యాలీ జరిగింది. పట్టణంలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహం వద్ద విద్యార్థుల ర్యాలీని ఎస్సై రాజువర్మ జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా ఎస్సై మాట్లాడుతూ బాలల హక్కులకు ఎవరూ భంగం కలిగించినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాలల అభివృద్ధికి అందరూ తోడ్పడాలని కోరారు. బాలలకు ఏ ఆపద, సమస్య వచ్చినా ధైర్యంగా చైల్డ్‌లైన్ 1098 టోల్ ఫ్రీ నంబర్ లేదా 100 పోలీసు హెల్ప్‌లైన్ నంబర్లకు తెలియజేయాల్సిందిగా సూచించారు. బస్టాండ్ మీదుగా నెహ్రూ పార్కు వరకు విద్యార్థుల ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో లయన్స్‌క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ భరత్‌రెడ్డి, చైల్డ్‌లైన్ డివిజన్ వాలంటీర్ బెజ్జంకి ప్రభాకర్, సోషల్ వర్కర్ కొమ్ముల సతీష్, కేఎస్‌ఆర్ కళాశాల కరస్పాండెంట్ నరహరి రాజేందర్ రెడ్డి, విష్ణు, సయ్యద్ జావీద్ తదితరులు పాల్గొన్నారు.