వరంగల్

గ్రంథాలయాలు ఆధునిక దేవాలయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లింగాలఘణపురం, నవంబర్ 20: గ్రంధాలయాలు ఆధునిక దేవాలయాలని వాటిని చిన్నా, పెద్ద తేడాలేకుండా ప్రతీ ఒక్కరూసద్వినియోగం చేసుకోవాలని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డా. తాటికొండ రాజయ్య, గ్రంథాలయ జిల్లా చైర్మన్ ఎడవెళ్లి కృష్ణారెడ్డి అన్నారు. స్థానిక గ్రంథాయలంలో 50వ వార్షికోత్సవ ముగింపు కార్యక్రమానికి జిల్లా చైర్మన్ కృష్ణారెడ్డి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రాజయ్య హాజరై మాట్లాడుతూ గ్రంథాలయ పితామహుడు ఎస్‌ఆర్ రంగనాథం అని, అంబేద్కర్ గ్రంథాలయాల్లోని పుస్తకాలను చదువి అధ్యయనం చేసి రాజ్యాంగ నిర్మాతగా ఎదిగాడని ఆయన కొనియాడారు. అతనే కాకుండా ఎంతో మంది మేధావులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకొని గొప్పవారయ్యారని ఆయన తెలిపారు. గ్రంథాలయ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. అనంతరం జిల్లా చైర్మన్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం వలన గ్రంధాలయాలు అభివృద్ధి కాలేదని టీఆర్‌ఎస్ ప్రభుత్వం గ్రంథాలయాలను అభివృద్ధి పర్చేందుకు కృషి చేస్తుందని ఆయన అన్నారు. అలాగే స్థానిక జెడ్పీఎస్‌ఎస్ పాఠశాలలో బాలల హక్కుల దినోత్సవం కార్యక్రమానికి ఎమ్మెల్యే రాజయ్య హాజరై మాట్లాడుతూ బాలల హక్కులను విద్యార్థులకు గుర్తు చేయాలని, బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించి రేపటి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంటుందన్నారు. తల్లి దండ్రులు తమ పిల్లలను పనులకు తోలకుండ పాఠశాలల్లో చేర్పించాలని, విద్యతోనే కుటుంబాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు ఏకనాదం, తహశీల్దార్ డా. నారాయణ, ఎంపీడీవో రవినాయక్, గ్రంథాలయ ఇన్‌చార్జి బొడ్డు వెంకన్న, జెడ్పీటీసీ గంగసాని రంజిత్‌రెడ్డి పాఠశాల చైర్మన్ కుంటి బీములు, మండల అధ్యక్షుడు నాగేందర్, జేరిపోతుల పరశురాములు, వివిధ గ్రామాల సర్పంచ్‌ల ఎంపీటీసీలు పాల్గొన్నారు.

కేసీఆర్.. ఉక్క్ఫ్యుక్టరీ సాధించు

మహబూబాబాద్, నవంబర్ 20: తెలంగాణ రాష్ట్రాన్ని తానే తెచ్చానని నేను లేకుంటే ఈ రాష్టమ్రే వచ్చేది కాదని ప్రగల్భాలు పలికే ముఖ్యమంత్రి కేసీఆర్ నువ్వు అంత వీరుడివే అయితే బయ్యారం ఉక్క్ఫ్యుక్టరీ సాధించి నీసత్తా చాటిచెప్పాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సవాలు విసిరారు. మానుకోటలో సోమవారం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. అనేక మంది త్యాగాల ఫలితంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆశీస్సులతో కాంగ్రెస్‌పార్టీ చొరవతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాకారం అయిందని కాని కేసీఆర్ మాత్రం అదంతా తన వ్యక్తిగత సత్తాగానే ప్రచారం చేసుకుంటున్నాడన్నారు. రాష్ట్రాన్ని సాధించే శక్తి ఉన్న కేసీఆర్ ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి వనరులు పెంచడంతోపాటు ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతగానే ఉపయోగపడే ఉక్క్ఫ్యుక్టరీ విషయంలో ఎందుకు పెదవి విప్పడంలేదని ప్రశ్నించారు. మాటల గారడీతో ప్రజలను మరెంతో కాలం మోసం చేయలేరని, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పప్పులు ఇంకా ఉడకవని తెలిపారు. బంగారు తెలంగాణ అనడమే తప్పా ఎవ్వరికీ ఒరిగింది ఏమీ లేదని ఆయన కుటుంబం మాత్రం తరతరాలకు సరిపోయే ఆస్తులను కూడబెట్టుకుంటుందన్నారు.
ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామిల్లో ఒక్కటీ కార్యరూపం దాల్చలేదని ప్రజావ్యతిరేకత ముందు నియంతనని విర్రవీగుతున్న కేసీఆర్ నిలువునా మునిగిపోక తప్పదన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే సంకల్పంతో తెలంగాణ ప్రజలను ఇబ్బందుల నుండి బయటకు తీసుకరావాలనే ఆలోచనతో అనేక మంది నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారన్నారు.కలసివచ్చే శక్తులన్నింటినీ కలుపుకొని పోయి కచ్చితంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ జెండా ఎగురవేసి తీరుతామని బలరాంనాయక్‌ను కేంద్రమంత్రిగా చేసుకుంటామని కార్యకర్తల హర్షధ్వానాల మద్య దొంతిమాధవ రెడ్డి ప్రకటించారు. ఈ బహిరంగసభలో డోర్నకల్, మహబూబాబాద్ నియోజకవర్గాల నుండి తరలివచ్చిన అనేకమంది టిడిపి, టిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆయా పార్టీలకు రాజీనామ చేసి కాంగ్రెస్‌లో చేరారు. ఈ రెండు నియోజకవర్గాల పరిధిలోని అనేక మంది ప్రజాప్రతినిధులతోపాటు కాంగ్రెస్ నాయకులు జెన్నారెడ్డి భరత్‌చందర్‌రెడ్డి, వేంనరేందర్‌రెడ్డి, దనసరి అనసూయ, బెల్లయ్యనాయక్, రాంచందర్‌నాయక్, ఉమామురళీనాయక్, సుచిత్రాబాలునాయక్, హరిప్రియ, నునావత్ రాధ, చుక్కల ఉదయ్‌చందర్, బాలుచౌహన్, దస్రునాయక్, రవిచందర్‌రెడ్డి, మూలగుండ్ల వెంకన్న, ముల్లంగి ప్రతాప్‌రెడ్డి, హరుణ్, వేణుమాధవ్, వెన్నం లక్ష్మారెడ్డి, సత్యనారాయణరెడ్డి, బండి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.