వరంగల్

మీ పనితీరేం బాగా లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కమలాపుర్, నవంబర్ 20: స్థానిక రెవెన్యూ అధికారులపై వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి మండిపడ్డారు. రెవెన్యూ రికార్డుల శుద్ధీకరణపై అధికారుల పనితీరు బాగాలేదని రెండు వారాలలో శుద్ధీకరణలో మార్పు కనిపించేలా చూడాలని ఆదేశించారు. సొమవారం కమలాపుర్ తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో రికార్డుల శుద్ధీకరణ సమీక్షా సమావేశం చేపట్టి పనుల వివరాలను అడిగారు. శుద్ధీకరణలో స్థానిక విఆర్‌వోలు సక్రమంగా పనిచేయడం లేదంటూ ఇలా చేస్తే ఎలా పనులు పూర్తి అవుతాయని అమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తాత్కాలికమైన పనులకు స్వస్తి చెప్పి పూర్తిస్థ్ధాయిలో సమస్యలను పరిష్కరించాలని సూచించారు. సుమారు గంటన్నర పాటు సాగిన సమావేశంలో కలెక్టర్ అధికారలపై గరం గరంగానే ఉన్నారు. మండలంలో ప్రభుత్వ భూముల్లో ఎక్కడక్కడ సమస్యలు ఉన్నాయో తెలుసుకొని సర్వే నెంబర్ 895 లో వెంటనే ఎంజాయ్ మెంట్ సర్వేను చేపట్టి వారం రోజులలో సమాచారం అందజేయాలన్నారు. ఈ నెల రోజులలో చేసిన శుద్ధీకరణ పనులపై అసంతృప్తిని వ్యక్తం చేసిన కలెక్టర్ మరో వారం రోజుల తర్వాత మళ్ళీ సమావేశం ఏర్పాటు చేస్తానని తెలపారు. కలెక్టర్‌తో పాటు దయానంద్ కూడా రెవెన్యూ అధికారుల పనులపై అసహనం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సత్యనారాయణ యాదవ్ సిబ్బంది పాల్గొన్నారు.
పదిశాతం గ్రేడ్‌తో ఉత్తీర్ణులవ్వాలి
కమలాపుర్:విద్యార్థులు పదో తరగతి పరీక్షలలో పదికి పది శాతం గ్రేడ్ సాధించాలని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి పేర్కొన్నారు. సొమవారం కమలాపురం లోని కస్తూరీభా గాంధీ బాలికల విద్యాలయంలో నిర్మాన్ ఆర్గనేషన్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. మొదట విద్యాలయంలోని ఆట స్థలాన్ని పరిశీలించి అనంతరం విద్యార్థులతో ముచ్చటించి అన్ని తరగతులు తిరుగుతూ విద్యార్థులపై పాఠాలు అడుగుతూ పశ్నలు వేస్తూ వారికి ఉత్సాహాన్ని నింపారు. అనంతరం నిర్మాణ్ కార్యక్రమంలో భాగంగా వంట మనుషులకు దుస్తులను నిర్మాణ్‌అర్గనేజేషన్ సమాచార దీపిక పుస్త్తకాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి నారయణరెడ్డి, ఎమ్‌ఇవో రమ్‌కిషన్ తదితరులు పాల్గొన్నారు.

క్షణికావేశంలో ప్రాణాలు తీసుకున్న యువతి
వెంకటాపురం(నూగూరు), నవంబర్ 20: కూలీ పనులకు వెళ్లకుండా ఇంటి వద్ద ఎందుకు ఉన్నావని, ఖాళీగా కూర్చుంటే సంసారాన్ని ఎలా నెట్టుకురావాలని తండ్రి మందలించినందుకు క్షణికావేశంలో పురుగుమందు తాగి యువతి ప్రాణాలు తీసుకున్న ఘటన అబ్బాయిగూడెంలో జరిగింది. బంధువుల కథనం ప్రకారం మెర్రవాణిగూడెం పంచాయితీ అబ్బాయిగూడెం గ్రామానికి చెందిన బోల్ల సుహాసిని (19) పురుగుమందు తాగి సోమవారం ఉదయం అత్మహత్య చేసుకుంది. ఇంటివద్ద ఉన్న కూతురు సుహాసినిని తండ్రీ శ్రీను పనులకు వెళ్లామని మందలించడంతో పురుగుమందు తాగి అపస్మారక స్థితిలోకి చేరుకుంది. ఆమెను హుటాహుటిన వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ ఏడాది పెళ్లిచేద్దామనుకునే తరుణంలో కళ్లముందే తిరిగే కన్నకూతురు కానరాని లోకానికి వెళ్లిపోయిందని మృతదేహం వద్ద తల్లిదండ్రులు బోరున విలపించారు.

26న డిగ్రీ ప్రవేశ అర్హత పరీక్ష
మొగ్గుళ్ళపల్లి, నవంబర్ 20: అచార్య నాగర్జున యూనివర్సటి అధికారిక స్టడీ సెంటర్ ఎస్వీ డిగ్రీ కళాశాల పరకాల ద్వారా అందిస్తున్న డిగ్రీ, బిఏ, బికాం, బిఎస్‌స్సీ కోర్సులలో చేరేందుకు ఈ నెల 26 ప్రవేశ అర్హత పరీక్ష నిర్వహిస్తున్నట్టు ప్రిన్సిపాల్ సిరికొండ శ్రీనివాసచారి తెలిపారు. విద్యార్హత లేకున్నా ప్రవేశ అర్హత పరీక్ష ద్వారా అడ్మిషన్ పొందవచ్చునని ఆయన చెప్పారు. 18 సంవత్సరాలు నిండిన వారు ఈనెల 22వరకు అర్హత పరీక్షకు దరఖాస్తు చేసుకొవాలని అన్నారు.