వరంగల్

పచ్చిపులుసుతో కూడా తినలేమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, డిసెంబర్ 10: కూరగాయలకు డబ్బులు లేకుంటే కనీసం పచ్చిపులుసు చేసుకునైనా తినొచ్చనేది పేదల ధీమా.. కానీ చింతపండు ధరకు అమాంతం రెక్కలు రావటంతో పచ్చిపులుసుకు కూడా పేద, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులుపడే రోజులు వచ్చాయి. రిటైల్ మార్కెట్‌లో నెలరోజుల కిందట వంద రూపాయల నుంచి 120రూపాయలకు కేజీ చింతపండు లభించగా వారం రోజుల నుంచి అమాంతంగా 260రూపాయలకు పెరిగింది. ఇదేమిటని అడిగితే సరుకు లేదని వ్యాపారుల సమాధానం, ఫలితంగా ఉన్నోళ్లు చింతపండును పరిమితంగా వాడుకుంటే, లేనోళ్లు ప్రత్యామ్నాయ మార్గాలు వెదుకుతున్నారు. సాధారణంగా ఈ రోజుల్లో చింతపండు ధర కేజీ ఎప్పుడుకూడా వంద రూపాయలు దాటలేదు. కొన్ని సందర్నాల్లో 50, 60రూపాయలకు లభించిన దాఖలాలు కూడా ఉన్నాయి. కానీ ప్రస్తుతం వారం రోజుల నుంచి చింతపండు ధర ఆకాశాన్ని అంటింది. హోల్‌సేల్ మార్కెట్‌లో ప్రతిరోజు 20, 30రూపాయలు చొప్పున పెరుగుతు 200రూపాయలు దాటింది. డి-మార్ట్, స్పెన్సర్, బిగ్‌బజార్ తదితర మాల్స్‌లో 260రూపాయలకు కేజీ చింతపండు విక్రయిస్తున్నారు. కిరాణా దుకాణాల్లో కూడా ఇదే ధర పలుకుతోంది. కిరాణా సామాగ్రి కొనుగోలుకు వెళ్లిన జనాలు ఇతర వస్తువులతోపాటు చింతపండు తీసుకుని బిల్లింగ్ చేసే సమయంలో అడ్డగోలు ధర చూసి కంగారు పడుతున్నారు. కొందరు చింతపండు కొనటం తాత్కాలికంగా నిలిపివేయగా, మరికొందరు ప్రతిసారికన్నా కొంత తక్కువగా కొంటున్నారు. చింతపండు ధర భారీగా పెరగటాన్ని వ్యాపారులను ప్రశ్నిస్తే రాష్ట్రంలో ఈ సీజన్‌లో చింతపండు తక్కువగా పండటం, ప్రకృతి వైపరీత్యాలతో పంట దెబ్బతిన్న కారణంగా ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి తక్కువగా ఉండటంతో స్టాకు తక్కువగా ఉండటం, వినియోగం ఎక్కువ కావటంతో ధర పెరిగిపోయిందని చెబుతున్నారు. ఇదే అవకాశంగా కొందరు వ్యాపారులు తమ వద్ద ఉన్న స్టాకును ఒకేసారి బయటకు తీయకుండా ధర పెరిగినపుడల్లా కొద్దికొద్దిగా బయటకు తీస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. చింతపండు ధర పెరిగిపోవటంతో ఇళ్లల్లో వినియోగం భారీగా తగ్గిపోయింది. పచ్చిపులుసు, సాంబారు స్థానంలో నీళ్లచారుతో సరిపెట్టుకుంటున్నామని గృహిణులు చెబుతున్నారు. హోటళ్లలో, పానీపూరీ, చాట్, పావ్‌బాజీ తదితర తినుబండారాలు అమ్మే బండ్లవద్ద చింతపండు వాడటం బాగా తగ్గించారు. ఇప్పటికే పెరిగిన ధరతో ఉల్లిగడ్డ జనాల కంటనీరు తెప్పిస్తుండగా తాజాగా చింతపండు జనాలకు చేదును మిగులుస్తోంది.