వరంగల్

ప్రతి రోజు తల్లిదండ్రుల పాదాలకు దండం పెట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరకాల, డిసెంబర్ 10: ముఖ్యమంత్రి కేసీఆర్ కోట కింద పరకాల మండలం నర్సక్కపల్లి గ్రామానికి 150 డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరు చేయించి తీసుక వచ్చినట్టు తెలంగాణ రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ లింగంపెల్లి కిషన్‌రావు తెలిపారు. ఆదివారం పరకాల మండలం నర్సక్కపల్లి గ్రామంలో వృద్ధులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వరంగల్ నగర పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా లింగంపెల్లి కిషన్‌రావు మాట్లాడుతూ నర్సక్కపల్లి గ్రామం కేసీఆర్ గుండెలో ఉన్న గ్రామమని తెలిపారు. తల్లిదండ్రులు దైవంతో సమానమన్నారు. ప్రతిరోజు తల్లిదండ్రుల పాదాలు మొక్కి వెళ్లాలని తెలిపారు. నర్సక్కపల్లి గ్రామానికి సబ్‌స్టేషన్ మంజూరు చేయించినట్టు తెలిపారు. గ్రామంలో గుడి కట్టవలసి ఉందని గుడికి 5 గుంటల భూమి కూడా ఇచ్చారన్నారు. వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేయాలనే సంకల్పంతో తాను దీక్షా దీవస్ కార్యక్రమం నర్సక్కపల్లి గ్రామం నుండి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి రోజు ఒక గంట తండ్రితో మరో గంట తల్లితో మాట్లాడి సేవ చేయాలని కోరారు. వాటప్స్, ల్యాప్‌టాప్‌లు వద్దని తల్లిదండ్రుల సేవ ముఖ్యమని భావించాలని కోరారు.
నర్సక్కపల్లి గ్రామానికి చెందిన శివాజీకి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన సిఎం రిలీఫ్ చెక్కును ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, సిపి సుధీర్‌బాబు చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ లింగంపెల్లి కిషన్‌రావు శివాజీకి అందచేశారు. అనంతరం వృద్ధులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరకాల జడ్పీటీసీ పాడి కల్పనాదేవి, డీసీపీ వెంకటేశ్వర్లు, ఏసీపీ సుధీంద్ర, మాజీ జడ్పీటీసీ లింగంపెల్లి లక్ష్మీబాయి తదితరులు పాల్గొన్నారు.