వరంగల్

క్షణికావేశంలో యువకుడి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిట్యాల, డిసెంబర్ 10: చిట్యాల మండలం నవాబుపేట శివారు శాంతినగర్ గ్రామానికి చెందిన నానవేన నరేష్(22) అనే యువకుడు ఆదివారం క్షణికావేశంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామస్తులు పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నరేష్ తనకు గల ఎకరన్నర భూమితో పాటు మరో మూడు ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. దీనికి తోడు ఇటీవల టాటా ఏస్ వాహనాన్ని నరేష్ కొనుగోలు చేశాడని దీంతో 2 లక్షల మేరకు అప్పుల పాలు అయ్యాడని తెలిపారు. ఆర్ధిక ఇబ్బందుల మూలంగా భార్య భర్తల మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయని దీంతో ఆదివారం క్షణికావేశానికి లోనైన నరేష్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు వారు తెలిపారు. మృతినికి భార్య మమత, ఒక కుమార్తె ఉన్నారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
రామప్పలో ఇటలీ దేశస్తుల సందడి
వెంకటాపురం(రామప్ప), డిసెంబర్ 10: మండలంలోని సుప్రసిద్ధి గాంచిన రామప్ప దేవాలయాన్ని ఆదివారం ఉమ్మడి జిల్లాలతో పాటు ఇటలీ దేశస్తులు సందర్శిచడంతో ఆలయంలో సందడి నెలకొంది, ఈ సందర్భంగా వచ్చిన భక్తులు రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇటలీ దేశానికి చెందిన 10 మంది సభ్యులు ఆలయానికి వచ్చారు. ఇటలీ దేశాస్తులు రామప్ప అందచందాలను చూసి సంతోషించారు. అంతే కాకుండా తమతో తెచ్చుకున్న కెమెరాలలో రామప్ప పరిసార ప్రాంతాలను బంధించుకుంటూ ముగ్దులు అయ్యారు. ఆదివారం కావడంతో రాష్ట్ర నలుమూలల నుండి పర్యాటకులు అధిక సంఖ్యలో రావడంతో అ ప్రాంతం అంతా సందడిగా కనిపించింది. ఆలయంలోని పూజారులు వచ్చిన భక్తులకు తీర్ధ ప్రసాదాలు ఇచ్చారు. ఆలయ గైడ్లు రామప్ప కాకతీయుల కట్టడాల గురించి విదేశీయులకు ఆంగ్ల భాషలో వివరించారు.

ధాన్యం డబ్బులు
వెంటనే చెల్లించాలి
మంగపేట, డిసెంబర్ 10: ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో ధాన్యం విక్రయించిన రైతులకు డబ్బులను వెంటనే చెల్లించాలని సీపీఎం భూపాలపల్లి జిల్లాకమిటీ సభ్యుడు తుమ్మల వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం మండలంలోని కమలాపురంలో సీపీఎం మంగపేట మండల సమావేశం పార్టీ మంగపేట మండల ప్రధాన కార్యదర్శి ముత్యాలు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిధిగా హాజరైన తుమ్మల వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో ధాన్యం విక్రయించి నెలరోజులు కావస్తున్నా నేటికీ డబ్బులు రాకపోవడంతో రైతులు తీవ్రఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. మండల ప్రధాన కార్యదర్శి ముత్యాలు మాట్లాడుతూ బిల్ట్ కర్మాగారంలో పునరుత్పత్తి ప్రారంభించాలని, కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. దళిత కుటుంబానికి మూడెకరాల భూమిని పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు తుమ్మల వెంకట రెడ్డి, ఎల్పీ.ముత్యాలు, పూనెం నాగేష్, కబ్బాక బాబు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ అసమర్ధతతో పెరిగిన నిరుద్యోగం

నక్కలగుట్ట, డిసెంబర్ 10: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయనే ఆశతో ఎదురుచూసిన నిరుద్యోగులకు నిరాశే ఎదురైందని, రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత వల్లే నిరుద్యోగం పెరిగిపోయిందని తెలుగునాడు విద్యార్ధి ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జాటోత్ సంతోష్‌నాయక్ ఆరోపించారు. ఆదివారం బాలసముద్రంలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఉమ్మడి వరంగల్ జిల్లా టిఎన్‌ఎస్‌ఎఫ్ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సంతోష్‌నాయక్ మాట్లాడుతూ లోటు బడ్జెట్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 42 నెలల కాలంలో రెండు సార్లు ఉపాధ్యాయ నియామకాలను భర్తీచేసిందని, ధనిక రాష్టమ్రైన తెలంగాణలో ముఖ్యమంత్రి అసమర్థ పాలన వలన ఒక్క ఉపాధ్యాయ నియామకాన్ని రెండు సార్లు ప్రకటించి ఇంతవరకు భర్తీ చేయకపోవడం సిగ్గుచేటని అన్నారు. ప్రభుత్వం చేతకానితనం వల్లనే తెలంగాణలో నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని, కడుపుమంట, ఆకలి మంటలతో ఉన్న లక్షలాది మంది నిరుద్యోగులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేయాల్సిన పరిస్థితులను ప్రభుత్వమే కల్పించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఏర్పాటు కోసం ఎన్నో త్యాగాలు చేసిన నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించకపోగా, ముఖ్యమంత్రి కుటుంబానికి మాత్రం నాలుగు ఉద్యోగాలు దక్కాయని ఎద్దేవా చేశారు.
తెలంగాణ ఉద్యమమే నీళ్లు, నియామకాలు, నిధులనే వౌలిక సూత్రాలపై జరిగిందని, ఎన్నికలకు ముందు ఎన్నో మాటలు చెప్పి, అధికారంలోకి వచ్చాక వౌలిక సూత్రాలనే ముఖ్యమంత్రి మరచిపోయారని అన్నారు. ఉద్యమాలు చేసినపుడల్లా విద్యాశాఖ మంత్రితో ఉద్యోగాలు ఇస్తామని ప్రకటనలు చేయిస్తూ, కాలం గడుపుతున్నారని తెలిపారు. దాదాపు ఉపాధ్యాయ నియామకాలు చేపడుతామని దేశంలో ఏ విద్యాశాఖ మంత్రి చెప్పనన్ని సార్లు కడియం చెప్పారని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి, మంత్రుల మాటలు నమ్మే పరిస్థితులు తెలంగాణలో లేవని, మూడున్నర ఏళ్లలో ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వం అని తేలిపోయిందని స్పష్టం చేశారు.
పక్కరాష్ట్రంలో ఒక ప్రాజెక్టు, ఉపాధ్యాయ నియామకాలు, విశ్వవిద్యాలయాలకు నిధులు సమకూర్చుకుంటుంటే, తెలంగాణ రాష్ట్రంలో ప్రణాళికలు, ప్రాజెక్టులు పత్రికలకే పరిమితమవుతున్నాయని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో నాయకులు వరంగల్ అర్బన్, రూరల్, భూపాల్‌పల్లి జిల్లాల విద్యార్థి నాయకులు దిలీప్, రాజేష్, సంతోష్‌రావు, సందీప్‌గౌడ్, శ్రీనాథ్, వేణు తదితరులు పాల్గొన్నారు.