వరంగల్

టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సంపేట, డిసెంబర్ 14: తెలంగాణ రాష్ట్రం వస్తే తమ సమస్యలు పరిష్కారమవుతాయని, తమ ఆకాంక్షలు నేరవేరతాయని భావించిన తెలంగాణ సమాజంపై టీఆర్‌ఎస్ ప్రభుత్వం నీళ్లు చల్లిందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం పరిపాలన కొనసాగించడం లేదని మండిపడ్డారు. చెన్నారావుపేట మండలంలోని ఉప్పరపల్లి నుండి చెన్నారావుపేట మండల కేంద్రం వరకు వేసిన నాసీరకం బీటీ రోడ్ నిర్మాణాలకు సంబంధించిన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం రేవూరి ప్రకాశ్‌రెడ్డి పాదయాత్ర నిర్వహించారు. పదకొండు కిలోమీటర్ల మేర రేవూరి పాదయాత్ర కొనసాగింది. గురువారం రాత్రి చెన్నారావుపేట మండల కేంద్రానికి రేవూరి పాదయాత్ర చేరుకుంది. ఈసందర్భంగా రేవూరి మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం చెబుతున్న మాటలకు చేతలకు పొంతన లేకుండా పోయిందని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల ప్రాతిపదికపై తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం జరిగిందని, అయితే అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఆమూడు అంశాలను పట్టించుకోవడం లేదన్నారు. తెలంగాణ ఫలాలను కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే అనుభవిస్తోందని వాపోయారు. ఇదే సమయంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మిగులు బడ్జెట్‌తో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం నేడు అప్పుల ఊబిలో కూరుకపోయిందని, ప్రజలంతా గమనించాల్సిందిగా కోరారు. ప్రధానంగా డబుల్ బెడ్ రూంలు, దళితులకు మూడు ఎకరాల సాగు భూమి, ఇంటికో ఉద్యోగం తదితర ఎన్నికల హామీలు అమలుకు నోచుకోలేదన్నారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ప్రజలంతా బుద్ధి చెప్పాల్సిందిగా పిలుపునిచ్చారు.
అభివృద్ధిని విస్మరించిన
ఎమ్మెల్యే దొంతి
నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధిని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పూర్తిగా విస్మరించారని రేవూరి మండిపడ్డారు. తనకు చెందిన శ్రీమాతా కన్‌స్ట్రక్షన్ పేరుతో టెండర్‌లో అనేక పనులను దక్కించుకున్న ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నాసిరకం పనులు చేస్తూ కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెనుకేసుకుంటున్నాడని ఆరోపించారు. నర్సంపేట నియోజకవర్గంలో పలు పంచాయతీ బీటీ రోడ్ల పనులను తూతూ మంత్రంగా ఎమ్మెల్యే దొంతి చేశారని వాపోయారు.
బీటీ వేసిన మూణ్నాళ్లకే కొట్టుకుపోయిందన్నారు. సంబంధిత కాంట్రాక్టర్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, నిధులను రికవరీ చేయాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే దొంతి దొంతికి కాంట్రాక్టు పనులపై ఉన్న యావ ప్రజల సంక్షేమంపై ఏమాత్రం లేదన్నారు. టీడీపీ హయాంలోనే నర్సంపేట నియోజకవర్గం అభివృద్ధి చెందిందే తప్ప ఆ తర్వాత జరిగిన అభివృద్ధి ఏమాత్రం లేదన్నారు. అధికార పార్టీకి చెందిన పెద్ది సైతం నియోజవకర్గ అభివృద్ధిని పట్టించుకోవడం లేదన్నారు. పెద్ది, దొంతిలిద్దరూ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు ఎర్ర యాకూబ్‌రెడ్డి, టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జాటోతు సంతోష్‌నాయక్, అజ్మీరా శ్రీనివాస్, మామిండ్ల మోహన్‌రెడ్డి, నరేందర్ రెడ్డి, కొయ్యడి సంపత్, రమేష్ పాల్గొన్నారు.

పేదలకు వరం కల్యాణలక్ష్మీ
* స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి
శాయంపేట, డిసెంబర్ 14: నిరుపేద కుటుంబలకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకం వరంగా నిలుస్తున్నాయని అసెంబ్లీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకం కింద మంజూరయిన చెక్కులను లబ్ధిదారులకు స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అందచేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం కల్యాణలక్ష్మీ పథకం కింద పేద కుటుంబాల జీవితాలలో వెలుగు నింపుతోందని అన్నారు. అంతరించి పోతున్న కులవృత్తులకు పూర్వవైభవం తీసుకొస్తున్న ఘనత సిఎం కేసిఆర్‌కే దక్కుతుందని అన్నారు. రాష్ట్రప్రజల సంక్షేమానికి కోట్లాది రూపాయలు కేటాయించి ఖర్చుచేస్తోందని చెప్పారు. భూపాలపల్లి నియోజకవర్గంలో కళ్యాణలక్ష్మీ పథకం కింద లబ్ధిదారులకు అధికసంఖ్యలో మేలు జరగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాసాని రమాదేవి, జెడ్సీటీసీ వంగాల రమాదేవి, తహశీల్దార్ వెంకటభాస్కర్, ఎంపీటీసీ రవి, సర్పంచ్ చంద్రవౌళి, టీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రవీందర్ తదితరులు పాల్గొన్నారు.