వరంగల్

ఐనవోలు అభివృద్ధికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వర్థన్నపేట, ఏప్రిల్ 12: ఐనవోలు మల్లికార్జున స్వామి దేవస్థానం అభివృద్ధి కోసం కృషి చేస్తానని వర్ధన్నపేట శాసన సభ్యుడు అరూరి రమేష్ అన్నారు. మంగళవారం రోజు మల్లికార్జున స్వామి దేవస్థాన ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం జాతర ప్రాంగణాన్ని పరిశీలించారు. తన చిన్నతనంలో ఉప్పుగల్లు గ్రామం నుంచి ప్రతి జాతరకు హాజరయ్యేవాడినని జాతరలో లభించే చిలుకల పేర్లను కొనుగోలు చేసి మేడలో వేసికొని ఆనందించే వాడినని, అలానే ఈ రోజు మల్లి వాటిని మెడలో ధరించి తన్మయం పొందారు. చిన్న వయసులో రాత్రంతా జాతరలో తిరిగి ఉదయం గ్రామానికి వెళ్లేవారమని ఆ మల్లికార్జునస్వామి ఆశీస్సులతోటే తాను శాసనసభ్యునిగా నేడు ఐనవోలు రాగలిగాను అన్నారు. దేవస్థాన ప్రాంగణం అభివృద్ధితో పాటు జాతర జరిగే ప్రాంతాన్ని పరిగణలోకి తీసుకొని అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ జన జాతర పేరొందిన ఐనవోలు జాతరను గతంలో ముఖ్యమంత్రి కెసిఆర్ దర్శించుకొని జాతర అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చాడన్నారు. ఇటివల ముఖ్యమంత్రితో ఈ విషయం మాట్లాడగా అభివృద్ధికి కావలసిన ప్రణాళికలు సిద్దంచేసుకొని రావాలని ప్రత్యేక నిధులు మంజూరీ చేస్తానని హామీ ఇచ్చాడన్నారు.