వరంగల్

నిరంకుశ ప్రభుత్వం** నిస్పృహలో విద్యార్థులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వడ్డేపల్లి, డిసెంబర్ 14: తెలంగాణ రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతోందని, ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి విద్యార్థులకు రావలసిన రాయితీలను కూడా ఇవ్వకుండా వారిని నిరాశ, నిస్పృహలకు గురి చేస్తున్నారని, విద్యార్థి వ్యతిరేక విధానాలను అవలంబిస్త్తున్న ప్రభుత్వం పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి విజయ్‌ఖన్నా అన్నారు. గురువారం కాకతీయ విశ్వవిద్యాలయం దూరవిద్యా కేంద్రంలో జాఫర్ నిజాం సెమినార్ హాల్‌లో పిడిఎస్‌యు సర్వసభ్య సమావేశం జరిగింది. జిల్లా నాయకులు అనిత అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన విజయ్‌ఖన్నా మాట్లాడుతూ రాష్ట్రంలో విద్య, ఉపాధి అవకాశాల కోసం విద్యార్థులు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. విశ్వవిద్యాలయాలలో వౌలిక సదుపాయాలు కల్పించడంలో పాలక వర్గాలు ఘోరంగా విఫలమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెల్ప్ ఫైనాన్స్ కోర్సుల పేరుతో విద్యార్థుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, అయినప్పటికి వారికి వసతితో కూడిన విద్యను అందించకపోవడం శోచనీయమని అన్నారు. అమెరికా అధ్యక్షుని కూతురు ఇవాంక పర్యటనకు 100 కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం, విద్యార్థుల బోధనా రుసుంలు, ఉపకారవేతనాలను చెల్లించడంలో జాప్యం ఎందుకని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే బకాయిలను చెల్లించాలని, విశ్వవిద్యాలయాలలోని సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు విద్యార్థులకు వసతి కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు మొగిలి, వెంకట్‌రెడ్డి, ఉపేందర్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.

మరుగుదొడ్లు నిర్మించుకోని
ఇంటికి కరెంట్ కట్
సంగెం, డిసెంబర్ 14: మరుగుదొడ్లు నిర్మించుకోని ఇంటికి కరెంట్ కట్ చేయడంతోపాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిలిపివేస్తామని ఎంపీడీఓ భద్రునాయక్ అన్నారు. మరుగుదొడ్ల నిర్మాణం పూర్తిచేసి ఓడిఎఫ్ గ్రామాలుగా ప్రకటించడానికి అవసరమైన సలహాలు, సూచనలు తెలిపేందుకు గురువారం మండల పరిషత్ కార్యాలయంలో సాక్షరభారత్ కో-ఆర్డినేటర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు పంచాయితీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా భద్రునాయక్ మాట్లాడతూ గ్రామాలలో బహిరంగ మల, మూత్రవిసర్జనను నిర్మూలించడానికి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ప్రతి ఇంటా మరుగుదొడ్డి నిర్మించుకునేలా నిధులు మంజూరు చేస్తున్నాయని అన్నారు. గ్రామంలో ప్రజలకు అవగాహన లేక మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టడం లేదని, ప్రజలలో చైతన్యం కలిగించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. బహిరంగ ప్రదేశాలలో మలమూత్రవిసర్జన చేయడం ద్వారా వ్యాధులు సంక్రమిస్తున్నాయని, ఈ వ్యాధులను అరికట్టేందుకే ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఆవరణలో మరుగుదొడ్లను తప్పనిసరిగా నిర్మించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శారద, సంతోష్, కిషన్ తదితరులు పాల్గొన్నారు.