వరంగల్

సమస్యల పరిష్కరానికి కార్మికులు ఐక్యంగా ఉద్యమించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగెం,డిసెంబర్ 16: భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారానికి కార్మికులు ఐక్యంగా ఉద్యమించాలని తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి అనంతగిరి రవి అన్నారు. సిఐటియు అనుబంధ సంఘం భవన నిర్మాణ సంఘం మండల మూడవ మహాసభ శనివారం మండల కేంద్రంలో సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా అనంతగిరి రవి మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు చెల్లించే పెడింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని, కార్మిక సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జీఎస్‌టీ ప్రభావంతో స్టీల్, సిమెంట్, గ్రానైట్ తదితర గృహనిర్మాణ సామాగ్రిపై పన్నులు పెరగటంతో కార్మికులు ఉపాధి కోల్పుతున్నారని అన్నారు. ఇళ్ల నిర్మాణాలకు ఉపయోగించే సామాగ్రిపై జీఎస్టీని ఎత్తివేయాలని డిమాండ్ జేశారు. భవన నిర్మాణ సంక్షేమ బోర్డులో 1200 కోట్లరూపాయలు ఉన్నా కూడా కార్మికులకు చెల్లించవలసిన బిల్లులను మూడు సంవత్సరాల నుండి చెల్లించడం లేదని తెలిపారు. రాష్ట్రప్రభుత్వం కాంట్రాక్టర్ల ద్వారా డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మించడం ద్వారా స్థానిక కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బ్రహ్మచారి, భిక్షపతి, యాకయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.

దొంతిని విమర్శించే హక్కు టీడీపీ నాయకులకు లేదు
* కాంగ్రెస్ నాయకుల స్పష్టీకరణ
నర్సంపేట, డిసెంబర్ 16: నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని విమర్శించే నైతిక హక్కు టీడీపీ నాయకులకు ఎంత మాత్రం లేదని యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు కోల చరణ్, ప్రధాన కార్యదర్శి తుమ్మలపల్లి సందీప్, కాంగ్రెస్ నాయకుడు కొల్లూరి మధుకర్‌లు అన్నారు.
పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి రోజురోజుకు పెరుగుతున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక అక్కసుతో అనవసరమైన విమర్శలు చేస్తున్నారని అన్నారు. కనీసం వార్డు మెంబర్ కానీ ఎర్ర యాకూబ్‌రెడ్డి తన గత చరిత్రను మరిచారని, ఇకనైనా మాట్లాడే విధానాన్ని మార్చుకోని పక్షంలో ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని స్పష్టం చేశారు.
2009 సంవత్సరంలో ఎమ్మెల్యేగా గెలిచిన రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఆ తర్వాత నియోజకవర్గానికి అందుబాటులో లేకుండా వెళ్లిపోయారని అన్నారు.
ఆసమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, దొంతి మాధవరెడ్డి ఎమ్మెల్యే కాకున్నా నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పెద్ద ఎత్తున నిధులు తీసుకువచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ది చేశారని చెప్పారు.
ఆంధ్రా సీఎం భజన చేస్తున్న రేవూరి ఆంధ్రా బినామీ కాంట్రాక్టర్‌గా కాంట్రాక్టు పనులు చేసుకుంటున్నారని విమర్శించారు. 2014 సంవత్సరంలో ఓడిపోయిన రేవూరి మూడేళ్ల పాటు కనిపించకుండా పోయి పాదయాత్రల పేరుతో వస్తున్నా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. ఈ సమావేశంలో ఆపార్టీ నాయకులు వేముల నవీన్, వైనాల అశోక్, మోడెం రామక్రిష్ణ, తమ్మినేని మహేశ్‌రెడ్డి, నీరటి రంజిత్, రహీంపాష, పున్నం చందర్ తదితరులు పాల్గొన్నారు.