వరంగల్

కేసముద్రం నుంచి అక్రమంగా బియ్యం రవాణా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేసముద్రం, డిసెంబర్ 17: కేసముద్రం నుంచి అక్రమంగా మహారాష్టల్రోని చంద్రాపూర్‌కు బియ్యం రవాణా జరుగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఆంధ్రాబ్యాంక్ సమీపంలో ప్రధాన రహదారిపై లారీని ఆపి తనిఖీ చేయగా కేసముద్రం నుంచి మహారాష్టక్రు బియ్యం రవాణా చేస్తున్నట్టు లారీ డ్రైవర్ చెప్పాడని, కేసముద్రం నుంచి బియ్యం లోడు తరలిస్తున్న లారీలో కేసముద్రం నుంచి బియ్యం రవాణా చేస్తున్నట్టు మార్కెట్ నుంచి ఎగుమతి పత్రం, వాణిజ్యపన్నుల శాఖకు చెందిన రవాణా బిల్లు లేకపోవడం, వరంగల్ వే బిల్లు, ఎగుమతి పత్రం ఉండటంతో స్థానిక మార్కెట్ సూపర్‌వైజర్‌కు సమాచారం ఇచ్చినట్టు ఎస్‌ఐ తెలిపారు. అనంతరం మార్కెట్ సూపర్‌వైజర్ సూచన మేరకు ఎస్‌ఐ బియ్యం లారీని మార్కెట్ సిబ్బందికి అప్పగించారు.
ఆదివారం సెలవు కావడంతో బియ్యం లారీ వ్యవహారంపై విచారణ జరపడానికి ఆటంకంగా మారింది. వరంగల్ మార్కెట్ నుంచి జారీ చేసిన ఎగుమతి పత్రం, వేబిల్లుతో కేసముద్రం మార్కెట్ పరిధిలోని రెండు రైసు మిల్లుల నుంచి బియ్యం ఎగుమతి చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. కాగా ఇదే తరహాలో ఈ ధాన్యం సీజన్ ఆరంభం నుంచి అక్రమంగా పలు రైస్ మిల్లుల నుంచి ధాన్యం అక్రమంగా తరలుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కాగా ఈ విషయంపై స్థానిక మార్కెట్ కార్యదర్శి అంజిత్‌రావు వివరణ కోరగా ఆదివారం కావడంతో విచారణ చేయలేకపోయామని, సోమవారం విచారణ జరుపుతామన్నారు.
ఈ విషయంపై పూర్తిస్ధాయిలో విచారణ జరిపితే అసలు నిజాలు వెలుగుచూసే అవకాశాలున్నాయంటున్నారు.

లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి
తొలగించే వరకు పోరాటం ఆగదు
* బంద్‌ను విజయవంతం చేయాలి * ఆదివాసీ ఏజెన్సీ
కొత్తగూడ, డిసెంబర్ 17: అక్రమంగా ఎస్టీ హోదాలో రిజర్వేషన్‌లను అనుభవిస్తున్న లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించే వరకు మా పోరాటం ఆగదని నేడు తలపెట్టిన ఆదివాసీ ఏజెన్సీ బంద్‌ను విజయవంతం చేయాలని ఆదివాసి జేఏసీ పిలుపునిచ్చింది. ఆదివారం ఈసందర్భంగా ఆ సంఘం నాయకులు ఇరుప రవి కుమార్ మాట్లాడుతూ.. అక్రమ వలసవాదులు చొరబాటు దారులైనా లంబాడీల కారణంగా ఆదివాసీలు తీవ్రంగా దోపిడికి గురతున్నారని ఆదివాసీలు ముక్తకంఠంతో ఎస్టీలు కాని లంబాడీలు ఎస్టీలు కాదంటూ నినదిస్తుంటే లంబాడీలు మాత్రం మేము ఇంకా దోపిడీకి పాల్పడుతాము తప్ప ఆదివాసీలు చేస్తున్న డిమాండ్‌ను పట్టించకోమని బుకాయించడం వారి దోపిడీ విధానానికి నిదర్శనమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలోని ఆదివాసీల ప్రాంతంలో ఉండబడిన వనరుల దోపిడీకి వలస లంబాడీలను పావులుగా వాడుకుంటూ ఆదివాసీ చట్టాలను ఉల్లంఘించి విలువైన సంపదను కొల్లగొట్టడానికి ప్రయత్నం చేస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధింపునకు కుమురంభీం ఆశయ సాధనలో ఉద్యమాలు చేశామని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ వీరయోధుడి వారసులైన ఆదివాసీల గిరిజనులకు ఎక్కడ స్థానం కల్పించక పోవడానికి ఆంతర్యమేమి అన్నారు. లంబాడీలను ఎస్టీ జాబితానుండి తొలగించాని మేడారం ట్రస్టు బోర్డులో నియమించిన వలస లంబాడిలను తొలగించి ఆదివాసీలు సాగు చేసుకుంటున్న భూములను పట్టాలివ్వాలని కోరారు. ఆదివాసీలు తమ ఆత్మరక్షణ కోసం సమాయత్తం కావల్సిన సమయం ఆసన్నమైందని కుటిల తెలంగాణ ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా హక్కులు సాధించుకునేంత వరకు ఉద్యమాన్ని సాగిస్తూ నేడు జరగబోయే ఆదివాసీ ఏజెన్సీ బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మల్లెల కృష్ణ, సిద్దబోయిన భాస్కర్, కొప్పుల సోమయ్య, చింత నరేష్, తోలెం బాబురావు, మల్లెల రాము, సందు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.