వరంగల్

రాష్ట్ర నెట్‌బాల్ జట్టుకు క్రీడాకారుల ఎంపిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేసముద్రం, డిసెంబర్ 17: కేసముద్రం (స్టే) జిల్లా పరిషత్ పాఠశాలలో ఆదివారం 23వ రాష్టస్థ్రాయి నెట్ బాల్ సబ్ జూనియర్స్ రాష్ట్ర జట్టుకు క్రీడాకారుల ఎంపిక పోటీలు జరిగాయి. ఈ సందర్భంగా తెలంగాణ నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులకు పోటీలు నిర్వహించారు. ఈ మేరకు ఇక్కడ జరిగిన పోటీల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులతో రాష్ట్ర జట్టు ఏర్పాటు చేసి జనవరి 28 నుంచి ఫిబ్రవరి 2 వరకు బిహార్‌లో నిర్వహించే జాతీయ స్థాయి పోటీలకు పంపనున్నట్టు నెట్‌బాల్ ఆసోసియేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు కోమటిరెడ్డి సాంబరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ ఓలం చంద్రమోహన్ మాట్లాడుతూ నెట్‌బాల్ పోటీల్లో క్రీడాకారులు మంచి ప్రతిభ చూపి రాష్ట్రానికి పేరుతేవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ అల్లం నాగేశ్వర్‌రావు, ఎస్‌ఎంసీ చైర్మెన్ శంకర్‌నాయక్, నెల్లికుదురు మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాస్, నెట్‌బాల్ ఆసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఎండీ ఖాజాఖాన్, జిల్లా కార్యదర్శి సూర్యారావు, ఉపాధ్యక్షుడు తుమ్మ సూర్యారావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామ్మోహన్‌గౌడ్ పాల్గొన్నారు.

కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలి

గంగారం,డిసెంబర్ 17: విద్యార్థినులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని మహబూబాబాద్ డీఎస్పీ ఎ.నరేష్‌కుమార్ అన్నారు. జిల్లా డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారిగా గంగారం మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థినులతో మాట్లాడుతూ.. తాను కూడా ఆ రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల్లోనే కష్టపడి కాకుండా ఇష్టపడి చదివి ఈ రోజు ఇంతటి వాడిని అయ్యానన్నారు. ప్రస్తుత సమాజంలో విద్యార్థినులు సెల్‌ఫొన్‌ల వాడకం తగ్గించి తమ అమూల్యమైన సమయాన్ని చదువుకు కేటాయించినట్టయతే మీరు కూడా ఒక ఐఏఎస్, ఐపిఎస్, డాక్టర్, ఇంజనీర్‌లు కావొచ్చన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రీతిమీనా హాస్టల్‌ను దత్తత తీసుకున్నారని ఆమెను ప్రేరణగా తీసుకొని మీరుకూడా అంతటివారు కావాలని ఆశించారు. హంస పాలను, నీళ్లను వేరుచేసినట్టుగా మీరు కూడా చెడును వదిలి మంచిని స్వీకరించాలని తల్లిదండ్రుల ఆశలను, ఆశయాలను నెరవేర్చాలని కోరారు. ఈ సంవత్సరం 10వ తరగతిలో మొదటి మూడు ర్యాంకులు సంపాదించుకున్నవారికి రూ.1016, 750, 516 తాను వ్యక్తిగత పారితోషికంగా ఇస్తామని తెలిపారు.
అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ.. కొందరు సంఘ విద్రోహ శక్తులు సోషల్ మీడియాలో లేనివి ఉన్నట్టు సృష్టిస్తున్నారని వదంతులను ఎవరూ నమ్మవద్దని వదంతులను సృష్టించేవారిని వదిలిపెట్టేది లేదన్నారు. ప్రస్తుతం ఆదివాసీ, గిరిజనుల మద్య వివాదాలు నెలకొన్న నేపథ్యంలో జిల్లాలో 144సెక్షన్ అమల్లో ఉందని ఎవరైనా అల్లర్లు సృష్టించాలని చూస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గూడూరు సీఐ రమేష్‌నాయక్ మాట్లాడుతూ.. విద్యార్థినులకు క్రమశిక్షణ అవసరం అని క్రమశిక్షణతో చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో గంగారం ఎస్సై శీలం బాలకృష్ణ, స్థానిక సర్పంచ్ వసంత, డిప్యూటీ వార్డెన్ కవిత, ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

కనుల పండువగా కొమురవెళ్ళి మల్లన్న కల్యాణం

చేర్యాల, డిసెంబర్ 17: ప్రముఖ శైవక్షేత్రమైన కొమురవెళ్ళి మల్లన్న కల్యాణం ఆదివారం కనుల పండువగా నిర్వహించారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ప్రభుత్వం తరుపున స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించగా డిప్యూటీ స్పీకర్ పద్మదేవేందర్‌రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్‌రావు, ప్రభుత్వ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు నియోజక వర్గం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిలతో పాటు మరికొందరు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ప్రతి ఏటా మార్గశిర మాసం మొదటి ఆదివారాన్ని పురస్కరించుకొని వీరశైవ ఆగమశాస్త్రం ప్రకారం స్వామివారి కల్యాణాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. గొల్ల కేతమ్మ, బలిజ మేడలమ్మలను ముక్కోటి దేవతలు, పంచభూతాల సాక్షిగా కొమురవెళ్ళి మల్లన్న కళ్యాణం చేసుకున్నారు. కళ్యాణాన్ని పురస్కరించుకొని ఆదివారం ఉదయం స్వామివారి మూలవిరాట్‌కు అలంకరణ చేసి గర్భాలయం ముఖమంటపంలోని బైరవ విగ్రహం వద్ద బలిహరణ జరిపి స్వామివారికి బద్రకన్ను అమర్చి దర్శనాన్ని ప్రారంభించారు. అనంతరం కల్యాణం జరిపే తోటబావి వద్దకు ఆలయ అర్చకులు మల్లన్నతో పాటు కేతమ్మ, బలిజ మేడలమ్మ ఉత్సవ విగ్రహాలను తీసుకువచ్చారు. కన్యాదాతలుగా మహాదేవుని వంశస్థులైన మహదేవుని మల్లిఖార్జున్-మానస దంపతులు, కన్యా గ్రహితలుగా పడిగన్నవారి వంశస్థులైన అంజనేయులు-అర్చన దంపతులు పీటలపై కూర్చోని కోరికలు తీర్చే కొమురవెళ్ళి మల్లన్న కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం 10:45గంటలకు స్వామి వారి కల్యాణం జరగగా వేలాది మంది భక్తులు హాజరై కళ్యాణాన్ని తిలకించారు. భక్తులకు ఆలయ ఈవో రామకృష్ణారావు, చైర్మన్ బద్దిపడిగ కృష్ణారెడ్డిసౌకర్యాలు కల్పించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హుస్నాబాద్ ఏసీపీ మహేందర్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఈ కళ్యాణోత్సవంలో ఎంపీపీ మేడిశెట్టి శ్రీ్ధర్‌తో పాటు వివిధ గ్రామాల ప్రజాప్రతినిథులు పాల్గొన్నారు.

విద్యర్థులు తక్కువ ఉన్నా స్కూళ్లు మూసివేయం

వరంగల్, డిసెంబర్ 17: విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న కారణంతో ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలని ప్రభుత్వం భావించటం లేదని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. విద్యార్థులు అసలే లేని 460 పాఠశాలలను గుర్తించి అందుకు కారణాలను తెలుసుకున్నామని, అందులో కొన్నింటిలో ఇంగ్లీష్ మీడియం తరగతులు ప్రవేశపెట్టిన కారణంగా 270 పాఠశాలలు పూర్తిస్థాయి విద్యార్థులతో విజయవంతంగా నడుస్తున్నాయని చెప్పారు. విద్యావ్యవస్థ విషయంలో ప్రభుత్వానికి ఎంత బాధ్యత, జవాబుదారీ ఉందో ఉపాధ్యాయులకు అందే బాధ్యత ఉందని అన్నారు. ఉపాధ్యాయ ఉద్యోగాన్ని సామాజిక బాధ్యతగా ఉపాధ్యాయులు భావించాలని సూచించారు. రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నగరంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియంటలో ఆదివారం నిర్వహించిన రాష్టస్థ్రాయి విద్యాసదస్సుకు ఉపముఖ్యమంత్రి కడియం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయులను ఉద్ధేశించి మాట్లాడుతు ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యాసంస్థలను కాపాడుకోవలసిన బాధ్యత ప్రభుత్వం, ఉపాధ్యాయులు, పిల్లల తల్లిదండ్రులపై ఉందని, వీరంతా సమష్టిగా, మంచి సంకల్పంతో పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. ప్రభుత్వ విద్యావ్యవస్థలో ఉన్న లోపాలను గుర్తించి వాటిని సరిచేయటానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని, లోపాల విషయంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటే ప్రజల్లో వ్యవస్థపై నమ్మకం పోతుందని చెప్పారు. కొన్ని పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు చూపిన చొరవ కారణంగా ఆ పాఠశాలలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని, ఈ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఏటేటా పెరగటం అందుకు ఉదాహరణ అని తెలిపారు. జిల్లాలోని ఒక పాఠశాలలో గతంలో కేవలం 80మంది విద్యార్థులు మాత్రమే ఉండగా, ప్రధానోపాద్యాయులు, ఉపాధ్యాయులు తీసుకున్న ప్రత్యేకశ్రద్ధ కారణంగా విద్యార్థుల సంఖ్య ఇప్పుడు భారీగా పెరిగిందని చెప్పారు. విద్యారంగంలో మానవవనరులను సక్రమంగా వినియోగించుకునేలా ప్రణాళికబద్ధమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. బి.ఎడ్, డైట్ కళాశాలలో ఖాళీగా ఉన్న పోస్టులు నేరుగా నియమించకుండా పదోన్నతులపై నియమించవలసి ఉందని, కేంద్రం నుంచి యూనిఫైడ్ సర్వీసులకు అనుమతి లభించినా, భాషాపండితుల సమస్యల పరిష్కారం జరిపినా ఈ విషయంలో కొందరు కోర్టులను ఆశ్రయించటంతో ప్రమోషన్లు, నియామకాలు జరుగని కారణంగా సమస్యలు అలాగే ఉండిపోయాయని అన్నారు. సర్వీస్‌రూల్స్‌పై ఉపాధ్యాయుల నుంచి లిఖిత పూర్వకంగా ప్రతిపాదనలు తీసుకుని వాటి ఆధారంగా ప్రమోషన్లపై తుది నిబంధనలు తయారుచేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని చెప్పారు. టీచర్ల రిక్రూట్‌మెంట్ పరీక్ష జరిగే నాటికి కొత్త నిబంధనలు తయారుచేయాలనే ఆలోచన ఉందని అన్నారు. కేంద్రప్రభుత్వం సర్వశిక్ష అభియాన్ తదితర ప్రాయోజిత పథకాలకు నిధుల కేటాయింపు తగ్గించటంతో సమస్యలు ఎదురవుతున్నా రాష్ట్రప్రభుత్వం మాత్రం తన సొంత నిధులతో మోడల్ స్కూళ్లను కొనసాగిస్తోందని తెలిపారు. ప్రభుత్వం అన్ని సౌకర్యాలతో ఏర్పాటుచేసిన గురుకుల పాఠశాలల కారణంగా ఈ విద్యాసంవత్సరంలో ప్రైవేటు పాఠశాలలకు చెందిన 50వేలమంది విద్యార్థులు గురుకుల పాఠశాలల్లో చేరారని తెలిపారు. రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అధ్యక్షుడు నర్సిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు రాజీవ్, ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్‌రాజు తదితరులు పాల్గొన్నారు.