వరంగల్

భూ తగాదాలో గాయపడ్డ వీఆర్యే లక్ష్మణ్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాటారం, జనవరి 17: కాటారం మండల కేంద్రంలో భూ తగాదాలో గాయపడి కోమా స్థితిలో కొట్టుమిట్టాడుతూ హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వీఆర్యే బొడ్డు లక్ష్మణ్ బుధవారం సాయంత్రం తుది శ్వాస విడిచాడు. ఇటీవల కాటారం మండల కేంద్రం 501 సర్వే నెంబరులో జరిగిన భూ తగాదాలో కాటారం దుబ్బగూడెం గ్రామానికి చెందిన సొదారి శ్రీనివాస్ అనే యువకుడు గొడ్డలి కర్రతో దాడి చేసిన ఘటనలో కాటారానికి చెందిన ఇద్దరు వీఆర్యేలుగా పనిచేస్తున్న బొడ్డు రాములు, బొడ్డు లక్ష్మణ్‌లపై దాడి చేయగా రాములు అక్కడికక్కడే మృతి చెందిన విషయం విదితమే. కాగా, లక్ష్మణ్‌ను మహాదేవపూర్, వరంగల్ ఆసుపత్రుల నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడి అసుపత్రిలో వెంటిలేటర్లపై చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం తుది శ్వాస విడిచాడు. లక్ష్మణ్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇదిలా ఉండగా, ఘటన జరిగిన నాటి నుంచి నిందితుడు సొదారి శ్రీనివాస్ ఇంటి వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు. లక్ష్మణ్ మృతి విషయం తెలుసుకున్న బంధువులు, మిత్రులు కన్నీటి పర్యంతం అయ్యారు. కాటారంలో పోలీసులు భారీ ఎత్తున సీఆర్‌పీఎఫ్ బలగాలతో పహారా, బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
నిందితుడిని కఠినంగా శిక్షించాలి
భూ తగాదా విషయంలో ఇద్దరు వీఆర్యేలుగా పనిచేస్తున్న బొడ్డు రాములు, బొడ్డు లక్ష్మణ్‌లపై దాడి చేసి హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఎమ్మార్పీఎస్, అంబేద్కర్ సంఘం డివిజన్, మండల నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం వారు మండల కేంద్రంలో విలేఖరులతో మాట్లాడారు. మాజీ ఎంపీపీ బొడ్డు మల్లయ్య, నాయకులు పొట్ల పోచయ్య, బొడ్డు ఆశయ్య, బొడ్డు రాజబాపు, బొబ్బిలి వెంకటయ్య, ఆత్యూరి బాలరాజు, మంత్రి మధు, లింగయ్యలు ఉన్నారు.