వరంగల్

ఆదివాసీ హక్కులను కాలరాస్తున్న పాలకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోవిందరావుపేట, జనవరి 17: ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను విచ్ఛిన్నం చేసేందుకు పాలకులు కుట్ర చేస్తున్నారని, తమ హక్కులను కాలరాస్తున్నారని ఆదివాసీ సంఘాల సమన్వయ కమిటీ జాక్ నేతలు దుయ్యబట్టారు. మేడారంలో బుధవారం ఆదివాసీ తెగల సమ్మేళన కార్యక్రమం జాక్ అధ్యక్షులు దాట్ల నాగేశ్వర్‌రావు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అశ్వారావుపేట, ఇల్లందు, పినపాక శాసనసభ్యులు తాటి వెంకటేశ్వర్లు, కొరం కన్నయ్య, పాయం వెంకటేశ్వర్లతోపాటు మాజీ శాసనసభ్యులు, జాక్ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ పాలకుల విధానాలు ఆదివాసీ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కాకతీయ రాజుల పాలనకు వ్యతిరేకంగా ఆదివాసీల ప్రతిపత్తి కోసం పోరాడి అసువులు బాసిన వీరుల పోరాట స్పూర్తితో ఏజెన్సీలోని ఆదివాసీలు సంస్కృతి, సాంప్రదాయాల ప్రకారం పండుగలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. తమజాతి పరిరక్షణ కోసం గొట్టు (గోత్రాల ప్రకారం) ఇలవేల్పులను కొల్చుకోవడం జరుగుతుందని, అయితే తమ సంస్కృతిని విచ్ఛిన్నం చేయుటకు పాలకులు కుట్ర చేస్తున్నారని విమర్శించారు.

అగ్రంపహాడ్ జాతరపై చిన్నచూపు?

ఆత్మకూరు, జనవరి 17: రెండో మేడారంగా ప్రసిద్ధి గాంచిన అగ్రంపహాడ్ సమక్క-సారలమ్మ జాతరపైన తెరాస ప్రభుత్వానికి చిన్నచూపు ఎందుకు? అని కాంగ్రెస్ పరకాల ఇన్‌చార్జి ఇనగాల వెంకట్రాంరెడ్డి ప్రశ్నించారు. బుధవారం జాతరను సందర్శించిన ఇనగాల.. అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం జాతర ప్రాంగణంలో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం అగ్రంపహాడ్ జాతరకు నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేసిందని గుర్తిచేశారు. నియోజకవర్గ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తన సొంత పనులపై ఆసక్తి చూపి జాతర అభివృద్ధిని మరిచారని విమర్శించారు. 10 లక్షల మంది హాజరయ్యే జాతరకు సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా విఫలం అయ్యారని అన్నారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులు తమకు 45 రోజుల పనిదినాలు కల్పించడం లేదని ఇనగాలకు ఫిర్యాదు చేశారు. జాతర కోసం భూములు ఇచ్చిన మనె్నం ఆదిరెడ్డి, రాజిరెడ్డిలకు డబ్బులు చెల్లించడం లేదని ఇనగాలకు ఫిర్యాదు చేయడంతో వారి సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. జాతరలో పారిశుద్ధ్యం ఆర్‌డబ్ల్యుస్ నిధులపై లెక్కలను చూపాలని ఆయన డిమాండ్ చేశారు. తెరాస నాయకులు రైతుల సమస్యలు పట్టించుకోకుండా ప్రభుత్వం వేసిన చేతిపంపులను పంట పొలాలకు వాడుకుంటూ మిగిలిన రైతులకు అన్యాయం చేస్తురని ఆరోపించారు. వచ్చే జాతరను కాంగ్రెస్ ప్రభుత్వంలోనే నిర్వహించ బడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ లేతాకుల సంజీవరెడ్డి, మండల అధ్యక్షుడు కమలాపురం రమేష్, నాగరాజు, సామ్యెల్, సాంబయ్య, పైడి తదితరులు పాల్గొన్నారు.