వరంగల్

సమన్వయంతో జాతరను విజయవంతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు, జనవరి 17: ప్రభుత్వ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకొవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు అన్నారు. బుధవారం అగ్రంపహాడ్ సమక్కసారలమ్మ జాతరను సందర్శంచి అమ్మవార్లకు పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం జాతర ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సిపి సుధీర్‌బాబు మాట్లాడుతూ అధికారులు ఒక జట్టుగా బాధ్యతా యుతంగా పనిచేసి జాతరను విజయవంతం చేయాలని అన్నారు. ఈ జాతరలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తును, ట్రాఫిక్ చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తూ భక్తులకు సేవలు అందిస్తామని చెప్పారు. జాతరకు 40 బస్సులు కాశీబుగ్గనుండి అక్కింపేట వరకు నడుపుతామని లోకల్ డిపో డీఎం తెలిపారు. జాతరకు ఐదు సెక్టార్లుగా విభజించి పారిశుద్ధ్యం పనులను చేపట్టామని ఈవోపిఆర్డీ వెంకటేశ్వర్లు తెలిపారు. 12 మంది డాక్టర్లతో మెడికల్ క్యాంప్‌లు ఏర్పాటుచేసి వైద్య సేవలు అందిస్తామని వీటితో పాటు 108,104 వాహనాలను ఏర్పాటు చేస్తున్నమని డాక్టర్ రేష్మా తెలిపారు. ఏసీపీ సుధీంద్ర మాట్లాడుతూ జాతరలో 16 సిసి కెమెరాలను ఏర్పాటు చేసి పహరా కాస్తామని పేర్కొన్నారు. ప్రమాదకర చెరువులు, బావులను, గుర్తించి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేస్తామని, జాతరలో 500 మంది పోలీసులు ఎప్పటికప్పుడు విధులు నిర్వహిస్తారని తెలిపారు. ఈ సమావేశంలో డీసీపీ వెంకటేశ్వర్లు, ఆర్డీవో మహేందర్‌జీ, ఈవో ధనుంజయ్ శర్మ, ఎంపీడీవో నర్మద, తహశీల్దార్ వెంకన్న పాల్గొన్నారు.

ప్రజాస్వామ్య విలువలను మంటగలిపిన స్పీకర్
* రాజకీయ సభలకు హాజరై ప్రభుత్వాన్ని పొగుడుతారా..!
* స్పీకర్ కుర్చీ నుండి మధుసూదనాచారి దిగిపోవాలి * టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే రేవూరి డిమాండ్
నర్సంపేట, జనవరి 17: రాజకీయ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన సభకు హాజరై, వ్యక్తులను పొగుడుతూ ప్రజాస్వామ్య విలువలను స్పీకర్ మధుసూదనాచారి మంటగలిపారని, తక్షణమే స్పీకర్ కుర్చీ నుండి దిగిపోవాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. దుగ్గొండి మండల కేంద్రంలో బుధవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో రేవూరి ప్రకాశ్‌రెడ్డి మాట్లాడారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న స్పీకర్ మధుసూదనాచారి పల్లె ప్రగతి అనే ఓ రాజకీయ పార్టీ సమావేశానికి హాజరై ఒక ప్రభుత్వాన్ని పొగుడుతూ.. వ్యక్తుల్ని పొగుడుతూ మాట్లాడటం ప్రజాస్వామ్య వ్యవస్థను ఖూనీ చేయడమేనని అన్నారు. శాసనసభ ఔన్నత్యాన్ని దిగజార్చి తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను అప్రతిష్ట పాలు చేసిన స్పీకర్ వెంటనే పదవి నుండి దిగిపోవాలని డిమాండ్ చేశారు. కోర్టు ఆదేశాలు ధిక్కరించి పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ ప్రజలు తలదించుకునే విధంగా రాజీనామా చేసిన తలసాని శ్రీనివాస్‌యాదవ్ రాజీనామాను పట్టించుకోకపోవడం అత్యంత హేయమైన చర్య అని అన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మాభిమానాన్ని, ప్రజాస్వామ్య విలువలను మంటగలిపిన స్పీకర్ మధుసూదనాచారి తెలంగాణ సమాజానికి వెంటనే వివరణ ఇవ్వాలని అన్నారు. స్పీకర్ పదవి రాజ్యాంగబద్ధమైందని, ఈ పదవిలో ఉన్న స్పీకర్ మధుసూదనాచారి ఓ రాజకీయ పార్టీ జెండాలు ఉన్న సభలు, సమావేశాలకు హాజరు కావడంపై ప్రజలంతా గమనించాలని విజ్ఞప్తి చేశారు. ఈకార్యక్రమంలో టీఎన్‌ఎస్‌ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షుడు జాటోతు సంతోష్‌నాయక్, టీడీపీ దుగ్గొండి మండల నాయకులు రాము, సుదర్శన్, బోగి సాంబయ్య, బుచ్చిరెడ్డి, సంపత్, సతీష్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.