వరంగల్

హజ్‌యాత్ర సబ్సిడీ రద్దుపై పునరాలోచించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్,జనవరి 17: కేంద్రప్రభుత్వం ముస్లీం మైనార్టీల హజ్‌యాత్రకు ఇస్తున్న సబ్సిడీని రద్దుచేస్తున్నట్లు ప్రకటించిన దానిపై పునరాలోచన చేయాలని సీపీఐ మున్సిపల్ ఫ్లొర్ లీడర్ బి.అజయ్, పట్టణ కార్యదర్శి పెరుగు కుమార్, ఇన్సాఫ్ నేతలు ఎండి దస్తగిరి, షంషీర్‌లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2012పేర ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతున్న కేంద్రం అదే సుప్రీం కోర్టు 2022వరకు దశలవారీగా చర్యలు తీసుకోవాలని కూడా చెప్పిందని దాన్ని ఎలా విస్మరించారని ప్రశ్నించారు. దీని వల్ల దేశంలో ప్రతియెటా సుమారు 2లక్షల మందికి, రాష్ట్రంలో 5వేల మందికి రద్దు ప్రభావం చూపుతుందని, ముఖ్యంగా నిరుపేద ముస్లీంలు ఈ యాత్రకు నోచుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. వెంటనే కేంద్రప్రభుత్వం పునరాలోచించి తగిన న్యాయం చేయాలన్నారు. కాగా పట్టణంలో కలెక్టరేట్ రోడ్డు వెడేల్పులో భాగంగా తనకు ఎలాంటి న్యాయం జరుగకుండా ఇల్లు కోల్పోవలసి వచ్చిందని మనోవేదనతో ఎలగం సూరయ్య అనే వ్యక్తి మరణించాడని మృతుని కుటుంబానికి తగిన న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇలాంటి దుస్థితి మరెవరికి రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు

* వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఉమ్మడి జిల్లాలో గిరిజన యూనివర్సిటీ, వెటర్నరీ కళాశాల ప్రారంభం

వరంగల్, జనవరి 17: రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్రం ఇచ్చిన హామీల మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లాకు మంజూరైన గిరిజన విశ్వవిద్యాలయం, వెటర్నరీ కళాశాలను వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రారంభించేందుకు గ్రీన్‌సిగ్నల్ లభించింది. ఈ మేరకు ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి బుధవారం సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేసారు. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు భూపాలపల్లి జిల్లా ములుగు మండలం జాకారం సమీపంలోని 169ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించేందుకు ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసి భూసేకరణ కూడా జరిపింది. పక్కనే ఉన్న మరో 213ఎకరాల అటవీశాఖ భూములను కూడా సంబంధిత శాఖ అధికారులు సర్వే జరిపి గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకోసం అప్పగించేందుకు చర్యలు మొదలయ్యాయి. యూనివర్సిటీకి అవసరమైన భూముల సేకరణ సమాచారాన్ని కేంద్ర మానవవనరుల శాఖకు లేఖ ద్వారా సమాచారం పంపాలని ఉపముఖ్యమంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. మూడురోజుల కిందట ఢిల్లీలో కేంద్ర మానవవనరులశాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ఆధ్వర్యంలో జరిగిన సెంట్రల్ అడ్వయజరీ బోర్డు సమావేశంలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు ఏర్పాటు విషయాన్ని ఉపముఖ్యమంత్రి కడియం కేంద్రమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. గిరిజన విశ్వవిద్యాలయం పనులు ఎప్పటికపుడు పర్యవేక్షించేందుకు ఒక ప్రత్యేకాధికారిని నియమించాలని నిర్ణయించారు. కాగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు మంజూరైన వెటర్నరీ కళాశాలను కూడా వరంగల్ అర్బన్ జిల్లా మామునూరు వద్ద వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రారంభించేందుకు నిర్ణయించారు. 2016లో వెటర్నరీ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం ఆరుకోట్ల రూపాయల పరిపాలనా అనుమతులు మంజూరు చేయగా, గత ఏడాది భవనాల నిర్మాణం, వౌళిక వసతుల ఏర్పాటుకు 109కోట్ల రూపాయలు మంజూరు చేసింది. వెటర్నరీ కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం పూర్తవగా నిర్మాణం పనులు జరుగుతున్నాయి. వచ్చే విద్యాసంవత్సరం నాటికి భవనాల నిర్మాణం ఒక కొలిక్కి తీసుకువచ్చి తరగతులు ప్రారంభించేలా చూడాలని ఉపముఖ్యమంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు.