వరంగల్

పార్టీ పటిష్టతకు కృషిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వడ్డేపల్లి, జనవరి 17: తెలుగుదేశం పార్టీ పేద, బడుగు, బలహీన వర్గాల పార్టీ అని, పార్టీ పటిష్ఠత కోసం కార్యకర్తలు కృషి చేయాలని తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు గరికపాటి మోహన్‌రావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బుధవారం వర్ధన్నపేట నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం హన్మకొండలోని ఎన్‌టి ఆర్ ప్రాంగణంలో కుమార స్వామి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మోహన్‌రావు మాట్లాడుతూ కార్యకర్తల శ్రేయస్సు కోసం పార్టీ ఎన్నో రకాలుగా ఆదుకుంటూ, అండగా నిలుస్తుందని తెలిపారు. టిడిపిలో రాజకీయ ఓనమాలు నేర్చుకుని శాసనసభ, పార్లమెంట్ స్థాయికి ఎదిగిన ఎందరో నాయకులు పార్టీని వీడినా కూడా నష్టమేమి జరగలేదని అన్నారు. నియోజక వర్గంలో పార్టీని నమ్ముకొని కార్యకర్తలు మొక్కవోని ధైర్యంతో పార్టీ పటిష్ఠత కోసం శ్రమిస్తున్నారని అభినందించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈగ మల్లేశం మాట్లాడుతూ రాష్ట్ర పార్టీ చేపట్టిన పల్లెపల్లెకు తెలుగుదేశం కార్యక్రమాన్ని కార్యకర్తలు దిగ్విజయంగా నిర్వహించాలని కోరారు. తెరాస పార్టీ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసగించిందని విమర్శించారు. రాష్ట్రంలో తెరాస ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లిందని భావించిన కేసీఆర్, స్థానిక సంస్థ ఎన్నికలలో పరోక్ష పద్దతి అని మరో కొత్త నాటకానికి తెరతీసారని మండి పడ్డారు. నేడు జరిగే ఎన్‌టి ఆర్ 22వ వర్ధంతిని గ్రామ గ్రామాన నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అశోక్, రవీందర్, బాబు, సంపత్ యాదవ్, గంగాధరరావు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

కేయూ బంద్ విజయవంతం

కేయూ క్యాంపస్, జనవరి 17: కాకతీయ విశ్వవిద్యాలయం కుప్టా ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలో భాగంగా బుధవారం నిర్వహించిన బంద్ విజయవంతం అయింది, బుధవారం మొదటి రోజు బందులో భాగంగా యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజి, యూనివర్సిటీ ఉమెన్స్ కాలేజి, పిజీ కాలేజి, ఖమ్మం పిజి కాలేజి, మహబుబాబాద్ పిజి కాలేజి, భూపాలపల్లి పిజి కాలేజిలలో పార్ట్ టైం అధ్యాపకులు తరగతులను బహిష్కరించి గేట్లకు తాళాలు వేసి బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా కుప్టా అధ్యక్షులు, కార్యదర్శులు తిరుపతిరాజ్, ప్రభాకర్ మాట్లాడుతూ కెయు బంద్‌కు సహకరించిన ఉద్యోగ విద్యార్ధి సంఘాలకు కృతజ్ఞతలు తెలిపారు. గత వారం రోజుల మందే బంద్‌కు పిలుపునిచ్చినప్పటికీ పట్టించుకొని కెయు అధికారులు బంద్ రోజు పరీక్షలను వాయిదా వేయకుండా పార్ట్ టైం అధ్యాపకుల సమస్యలు తీర్చకుండ నిమ్మకునిరేత్తిన్నట్లు వ్యవహారించడం సిగ్గు చేటు అని ఆరోపించారు. ఇప్పటికైన అధికారులు చిత్తశుద్దీతో పార్ట్ టైం అధ్యాపకుల సమ్యసలను వెంటనే పరిష్కారించాలని లేని యెడల 19వ తేదిన జరిగే పరీక్షలను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ బంద్‌లో కెయు లోని వివిధ కళాశాలలో పనిచేస్తున్న పార్ట్ టైం అధ్యాపకులు, కాంట్రాక్ట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మేడారంలో జనజాతరపెద్ద
ఎత్తున తరలివచ్చిన భక్తులు * తల్లులను దర్శించుకున్న అశేష భక్తజనం

గోవిందరావుపేట, జనవరి 17: మరికొన్ని రోజులలో మేడారం మహాజాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో భక్తజనం పెద్ద ఎత్తున బుధవారం మేడారంకు తరలివచ్చారు. మేడారం జాతర ప్రారంభానికి రెండు వారాల ముందు వచ్చే బుధవారం మండమెలిగే కార్యక్రమాన్ని పూజారులు అత్యంత భక్తిశ్రద్దలతో నిర్వహిస్తున్న నేపథ్యంలో మేడారం జాతరకు బుధవారం పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. వివిధ ప్రాంతాల నుండి భక్తులు తరలిరావడంతో మేడారం పరిసర ప్రాంతాలన్ని భక్తజనంతో కిక్కిరిసి పోయాయి. పస్రా నుండి మేడారం వరకు దారిపొడవున అడవులలో భక్తులు సేదతీరి కనిపించారు. పిల్లాపాపలతో తమ మొక్కుబడులను చెల్లించుకున్నారు.
తల్లులలకు ప్రీతి కరమైన బంగారం (బెల్లం)ను తల్లుల గద్దెలకు చేర్చిన భక్తులు తమ వెంట తీసుకువచ్చిన ఒడి బియ్యాన్ని, కానుకలను హుండిలో వేసారు. సమ్మక్క-సారలమ్మ తల్లుల దర్శనం కోసం భక్తులు సుమారు రెండు గంటలపాటు క్యూలైన్లో వేచి ఉండాల్సి వచ్చింది. భక్తులు జంపన్నవాగుకు చేరుకొని చిరుజల్లు స్నానాలు చేసి పూనీతులయ్యారు. అక్కడి నుండి గద్దెలకు చేరుకొని తమ మొక్కులను చెల్లించుకున్నారు. ఈ నేపద్యంలో జంపన్నవాగు స్నానఘట్టాలు భక్తుల కోలాహాలంతో నిండిపోయాయి. మేడారం పరిసర ప్రాంతాలన్ని బుధవారం భక్తజనంతో నిండిపోవడంతో మేడారం భక్తజనంతో కళకళలాడింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పోలీసులు అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

శాయంపేట, జనవరి 17: రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను పవర్‌లూం, చేనేత కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని మాజీ జడ్పీ చైర్మన్ సమ్మారావు అన్నారు. మండల కేంద్రంలోని శ్రీ మార్కండేయ ఆలయ ప్రాగణంలో పవర్‌లూం కార్మికులతో సాంబరి సమ్మరావు, వీవర్స్ డెవల్‌మెంట్ ఫౌండేషన్ అధ్యక్షుడు దాసు సురేష్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు రాష్ట్రప్రభుత్వం పవర్‌లూం కార్మికులకు అందిస్తున్న ఉచిత ఇన్సూరెన్స్ కార్యక్రమం అమలులో అధికారులు పూర్తిస్థాయిలో సహకరించడం లేదని వాపోయారు. ఇతర ప్రదేశాల నుండి తిరిగివచ్చిన పవర్‌లూం కార్మికులకు పలుసమస్యలు సృష్టిస్తున్నట్లు ఆరోపించారు. కాకతీయ టెక్స్‌టైల్ పార్కు నిర్మాణం కావడానికి చాలా సమయం పడుతుందని, దీనిని దృష్టిలో పెట్టుకుని వలస కార్మికులకు ఐదువేల రూపాయలు జీవనభృతిని అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పవర్‌లూం కార్మికులకు అందిస్తున్న ఉచిత ఇన్సూరెన్స్ సదుపాయం చేనేత కార్మికులకు కూడా వర్తింపజేయాలని, వారికి హెల్త్‌కార్డులు అందజేయాలని కోరారు. ఈ సమావేశంలో సంఘం చైర్మన్ మామిడి శంకరలింగం, సర్పంచ్ వాల్పదాసు చంద్రవౌళి, బాసాని సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

శరభ.. శరభ
వైభవోపేతంగా త్రిశూల స్నానఘట్టం వేడుకలు * నేడు అగ్నిగుండం
* బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా వీరభద్రుని పల్లెరం
భీమదేవరపల్లి, జనవరి 17: సుప్రసిద్ధమైన కొత్తకొండ వీరభద్రుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి సన్నిధిలో త్రిశూలస్నాన ఘట్టవేడుకలు వేలాదిమంది భక్తులను అమితంగా ఆకట్టుకున్నాయి. బుధవారం స్వామి వారి సన్నిధిలో యాజ్ఞికులు తాటికొండ వినయ్‌శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి ప్రాతఃకాల సమయాన గణపతిపూజ, నిత్యవిధి, నిత్యౌపాసన నిర్వహించారు. తదుపరి అష్ట్భైరవార్చన నిర్వహించి, యాగశాలలోనవాహ్నికం, పూర్ణాహుతి, కలశ ఉద్వాసన, ప్రధాన కలశ సహిత ఉపకలశయుక్తంగా త్రిశూలేశ్వరునితో ఆలయ ప్రదక్షిణం నిర్వహించారు. అనంతరం ఆలయంలోకి ప్రవేశించి మహాకుంభాభిషేకం చేయడంతో పాటు పూర్ణాహుతి జరిపారు. రుద్రశూలలు, వీరఖడ్గాలు వేసుకుంటూ భంగీ మఠంకు చెందిన పరమేశ్వరయ్యతో పాటు కొత్తకొండకు చెందిన గుమ్లాపురం మహేశ్‌లు వీరఖడ్గాలు వేసుకుంటూ, ప్రభలతో స్వామివారిని కొలిచారు. భద్రకాళీ అమ్మవార్లు ఉత్సవ మూర్తులను పల్లకిలో పవిత్ర పుష్కరిణికి తీసుకువెళ్లారు. పల్లకీని మోసేందుకు భక్తులు ఉత్సాహం చూపారు. పుష్కరిణి వద్ద పుష్కరవిధి నిర్వహణ, త్రిశూలేశ్వరునికి స్నాన ఘట్టవేడుకలను ఆలయ కార్యనిర్వహణాధికారి హరిప్రకాశ్‌రావు, ఆలయ చైర్మన్ మార్పాటి మహేందర్‌రెడ్డిలు, ఆలయ సిబ్బంది హంసారెడ్డి, ఆలయ అర్చకుల బృందం తాటికొండ వీరభద్రయ్య, తాటికొండ వినయ్‌శర్మ, మొగిలిపాలెం రాంబాబు, రాజయ్య, శ్రీకాంత్, శివకుమార్, శరత్‌చంద్ర, రమేశ్, మాడిశెట్టి కుమారస్వామి, జడ్పీటీసీ రాంచందర్‌నాయక్, సేవా కమిటీ సభ్యులు రాగం రజినిరమేశ్, కొండ్ర రజనాచారి తదితరులు ఘనంగా నిర్వహించారు.
ప్రత్యేక ఆకర్షణగా వీరభద్రుని పల్లెరం
బ్రహ్మోత్సవాత్లో ప్రత్యేక ఆకర్షణగా వీరభద్రుని పల్లెరం ఘనంగా నిర్వహించారు. కర్నూలు జిల్లా రాయచోటీలోని వీరభద్రస్వామి వారి ఆలయం నుండి ప్రత్యేకంగా రుద్రకలశాలు తెప్పించినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి హరిప్రకాశ్‌రావు, ఆలయ చైర్మన్ మార్పాటి మహేందర్‌రెడ్డిలు తెలిపారు. వీరభద్రుని ఉత్సవాల్లో బుధవారం నిర్వహించిన త్రిశూల స్నాన ఘట్టవేడుకలలో యాజ్ఞికులు స్వామి వారిని కొలుస్తూ భుజంపై రుద్రశూలలతో చప్పుళ్లకు అణుగుణంగా నృత్యం చేస్తూ భక్తులను ఆకట్టుకున్నారు. ఉత్సవాలకు రద్దీ ఏమాత్రం తగ్గకపోవడంతో ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపూర్, వేలేరు మండలాలకు చెందిన పోలీస్‌లు, ముల్కనూర్ ఎస్సై డ్యాగల రమేశ్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. వీరితో పాటు ముల్కనూర్ ఎకెవిఆర్ కళాశాలకు చెందిన విద్యార్థులు ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ అధికారి భూపతి శ్రీకాంత్, శ్రీ్ధర్ల కుమారస్వామి ఆధ్వర్యంలో భక్తులకు సేవలందించారు.
నేడు అగ్నిగుండాలు
బ్రహ్మోత్పవాల్లో భాగంగా స్వామి వారి సన్నిధిలో వేకువజామున అగ్నిగుండాల ఉత్సవాలు నిర్వహించేందుకు తగు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో, చైర్మన్ తెలిపారు. భక్తుల కోసం ప్రత్యేకంగా బారికేడ్లు ఏర్పాటు చేసినట్లు ఉత్సవాలకు భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉన్నందున పోలీస్ యంత్రాంగంకు ముందస్తు సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. వేకువఝామున నిర్వహించే ఉత్సవాలకు అగ్నిగుండం మీదుగా నడిచేందుకు భక్తులు అధిక సంఖ్యలో ముందుకు వస్తున్నప్పటికీ ఆలయం అనుమతించిన వారే అగ్నిగుండం మీదుగా నడుస్తారని తెలిపారు. భక్తులు అగ్నిగుండాల ఉత్సవాన్ని విజయవంతం చేసేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సాయంత్రం వీరభద్రుని గ్రామపర్యటనతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని పేర్కొన్నారు.

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌కు దరఖాస్తుల ఆహ్వానం

మహబూబాబాద్, జనవరి 17: 2018-19 విద్యాసంవత్సరంలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (రామంతాపూర్, బేగంపేట)లో 1వ తరగతి ప్రవేశం కోసం అర్హులైన గిరిజన విద్యార్థులను నుండి దరఖాస్తులు అహ్వానిస్తున్నట్లు జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ సంతోష్‌కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా అభివృద్ధి అధికారి కార్యాలయం నుండి ఉచితంగా దరఖాస్తు ఫారాలు పొంది ఈ నెల 21వ తేదీలోగా సంబంధిత కార్యాలయంలో సమర్పించాలన్నారు. 23వ తేదీ ఉదయం 11 గంటలకు కలెక్టరేట్‌లో లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేస్తారన్నారు. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు తేది 23-01-2018 నుండి 31-05-2018 మధ్య కాలంలో జన్మించిన వారు మాత్రమే అర్హులని, తల్లిదండ్రుల వార్షిక ఆదాయం అర్బన్ వారికి రూ. 2,00,000, రూరల్ వారికి రూ. 1,50,000లకు మించరాదన్నారు. నివాస ధ్రువీకరణ పత్రం సంబంధిత తహశీల్దారు కార్యాలయం నుండి, జనన ధ్రువీకరణ పత్రం మున్సిపల్ నుండి, ఆదాయ ధ్రువీకరణ పత్రం మీసేవ ద్వారా పొంది ఉండాలన్నారు. ఆధార్‌కార్డు కలిగి ఉండి సంబంధిత ధ్రువీకరణ పత్రాలకు జతచేసి గెజిటెడ్ అధికారి సంతకం, వారు చదువుతున్న స్కూల్ నుండి బోనోఫైడ్ జతచేసి దరఖాస్తు అందజేయాలన్నారు. గిరిజన సంక్షేమ శాఖ నుండి లాటరీ పద్ధతి ద్వారా ఎంపికైన వారికి మాత్రమే స్కాలర్‌షిప్ ఇవ్వబడునని, ఎవరైనా విద్యార్థులు ప్రత్యక్షంగా హైద్రాబాద్ పబ్లిక్ స్కూల్‌లో అడ్మిషన్ పొందితే.. వారికి స్కాలర్‌షిప్ ఇచ్చేది లేదని పేర్కొన్నారు.

సత్ప్రవర్తనతో భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలి
*జనగామ ఏసీపీ బాపురెడ్డి
జనగామ, జనవరి 17: విద్యార్థులు సత్ప్రవర్తనతో మెలుగుతూ భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలని జనగామ ఏసీపీ వెన్నపురెడ్డి బాపురెడ్డి కోరారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు పట్టణంలోని వివిధ వార్డుల్లో 7రోజుల పాటు సేవా శిబిరం నిర్వహించి బుధవారం ముగింపు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ నగర్‌లో ఏర్పాటుచేసిన సభకు కళాశాల ప్రిన్సిపాల్ బైరు శ్రీనివాస్ అధ్యక్షత వహించగా ఏసీపీ బాపురెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. 7రోజుల పాటు విద్యార్థులు పలు వార్డుల్లో పారిశుధ్య కార్యక్రమాలే కాక మొక్కలు నాటి తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలవడం అభినందనీయమన్నారు. సమాజంలో సేవ కార్యక్రమాల ద్వారానే మంచి పేరు ప్రతిష్టలు సంపాదించేందుకు అవకాశం ఉంటుందన్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి మాట్లాడుతూ పట్టుదలతో చదివి జీవిత లక్ష్యాన్ని సాధించాలని కోరారు. తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చాలని అన్నారు.
14మంది సీఐలకు పోస్టింగులు
* ఉత్తర్వులు జారీచేసిన పోలీసు కమిషనర్

వరంగల్, జనవరి 17: వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని 14మంది ఇన్‌స్పెక్టర్లకు పోస్టింగులు ఇస్తూ పోలీసు కమిషనర్ సుధీర్‌బాబు బుధవారం ఉత్తర్వులు జారీ చేసారు. ఇటీవలే వరంగల్ రేంజ్ పరిధిలో పనిచేస్తున్న పలువురు ఎస్సైలకు ఇన్‌స్పెక్టర్లుగా ప్రమోషన్లు ఇస్తూ ఉత్తర్వులు జారీచేసిన నార్త్‌జోన్ ఐజి నాగిరెడ్డి ప్రమోషన్లు పొందిన 14 మంది ఇన్‌స్పెక్టర్లను వరంగల్ పోలీసు కమిషనరేట్‌కు అటాచ్ చేసారు. అటాచ్డ్ డ్యూటీలో ఉన్న ఇన్‌స్పెక్టర్లకు కొత్త సిఐలకు కొత్త పోస్టింగులు ఇస్తూ కమిషనర్ ఆదేశాలు జారీచేసారు. అటాచ్డ్ డ్యూటీలో ఉన్న బి.శ్రీనివాస్‌ను సెంట్రల్ క్రైమ్ స్టేషన్-2 ఇన్‌స్పెక్టర్‌గా, డి.రవిరాజును సెంట్రల్ క్రైమ్ స్టేషన్-3 ఇన్‌స్పెక్టర్‌గా నియమించారు. అటాచ్డ్ డ్యూటీలో ఉన్న వెంకట్‌రాంను పోలీస్ కంట్రోల్ రూంకు బదిలీ చేసారు. అటాచ్డ్ డ్యూటీలో ఉన్న సాదుల్లాబాబాను శాయంపేట ఇన్‌స్పెక్టర్‌గా, డి.విశే్వశ్వర్‌ను కొత్తగా ఏర్పాటుచేసిన సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్‌గా నియమించారు. అటాచ్డ్ డ్యూటీలో ఉన్న ఎండి హన్నన్‌ను హన్మకొండ ట్రాఫిక్-2 ఇన్‌స్పెక్టర్‌గా, దయాకర్‌ను కమిషనరేట్ స్పెషల్ బ్రాంచ్-1 ఇన్‌స్పెక్టర్‌గా బదిలీ చేసారు. అటాచ్డ్ డ్యూటీలో ఉన్న ఇన్‌స్పెక్టర్లు బి.కుమారస్వామి, డి.మల్లేష్‌ను కమిషనరేట్ క్రైం రికార్డు బ్యూరోకు బదిలీ చేసారు. అటాచ్డ్ డ్యూటీలో ఉన్న శ్రీనివాసరాజును నర్మెట్ట ఇన్‌స్పెక్టర్‌గా, టి.రవికుమార్‌ను ఎల్కతుర్తి ఇన్‌స్పెక్టర్‌గా, జి.మహేందర్‌రెడ్డిని ఐటి అండ్ టాస్క్ఫోర్స్ ఇన్‌స్పెక్టర్‌గా నియమించారు. అటాచ్డ్ డ్యూటీలో ఉన్న ఇన్‌స్పెక్టర్ డి.రమణమూర్తిని కమిషనరేట్ పోలీసు ట్రైనింగ్ సెంటర్‌కు బదిలీచేసారు.