వరంగల్

అవకాశవాదులే పార్టీని వీడుతున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనగామ, జనవరి 18: పార్టీలో అన్ని పదవులు అనుభవించిన అవకాశవాదులు మాత్రమే టీడీపీని విడిచి వెళుతున్నప్పటికీ క్యాడర్ అంతా పార్టీవెంటే ఉందని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాష్‌రెడ్డి అన్నారు. జనగామ సూర్యపేట రోడ్డులో గురువారం పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి జిల్లా అధ్యక్షుడు బొట్ల శ్రీనివాస్ అధ్యక్షత వహించగా ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ పార్టీ గ్రామస్థాయి కార్యకర్తలు, అభిమానులు పార్టీని విడిచి వెళ్లడం లేదని అన్నారు. నందమూరి తారక రామారావు నాటిన మొక్క వృక్షమై అనేక సంవత్సరాల పాటు ఇచ్చిన ఫలాలను ప్రజలు అనుభవించారని, అందుకే ప్రజలు పార్టీని అభిమానిస్తున్నారని అన్నారు. కొంతమంది నాయకులు పార్టీకి ద్రోహం చేసి వెళ్లినంత మాత్రాన ఎలాంటి నష్టం లేదని తెలిపారు. క్రమశిక్షణ గల క్యాడర్ కేవలం తెలుగుదేశం పార్టీలో మాత్రమే ఉందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ సహకారం లేనిదే ఏ పార్టీ అధికారంలోకి రాదని అన్నారు. గ్రామస్థాయి నుండి పార్టీని మరింత పటిష్టం చేసేందుకు నాయకులు కృషి చేయాలని కోరారు. రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్‌రావు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఇచ్చిన హామీలను అమలు చేయని సీఎం కేసీఆర్‌కు గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారని అన్నారు. అమరవీరుల త్యాగాల ఫలితంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రాన్ని కుటుంబ స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నారే తప్ప ప్రజల కోసం ఏ మాత్రం పాటుపడడం లేదని విమర్శించారు. ఎన్ని కష్టాలు ఎదురైనా తెలంగాణలో టీడీపీనీ కాపాడుకుంటామని అన్నారు. గ్రామస్థాయి కార్యకర్తలు ఏమాత్రం అధైర్య పడవద్దని, మేము ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని ధైర్యం చెప్పారు. జిల్లా అధ్యక్షుడు బొట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ పార్టీని జిల్లాలో మరింత పటిష్టం చేసేందుకు కృషి చేస్తామని అదిష్ఠానానికి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు ఈగ మల్లేశం, జాటోతు ఇందిర, ఎలికట్టె మహేందర్, జిల్లా నాయకులు బైరుబాబు, ఎస్‌కే. రాజు, బెడిద మైసయ్య, గుర్రం బాలరాజు, చీకట్ల నవీన్, రంగు అంజయ్య, నీలం భిక్షపతి, మండల, పట్టణ అధ్యక్షులు వజ్జ పరశురాములు, సమ్మయ్య, నాయకులు చంద్రశేఖర్, స్టాలిన్, బాబ్‌జీ, దుర్గాప్రసాద్, జీవరత్నం, గొరిగె మల్లయ్యలు పాల్గొన్నారు.