వరంగల్

నేరరహిత సమాజమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జనవరి 18: నేరరహిత సమాజమే లక్ష్యంగా సకల నేరస్థుల సమగ్ర సర్వేను నిర్వహించడం జరుగుతుందని వరంగల్ పోలీసు కమిషనర్ సుధీర్‌బాబు తెలిపారు. గురువారం తెలంగాణ పోలీసు డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశాల మేరకు నగరంలోని మిల్స్‌కాలనీ పరిథిలోని బీరన్నకుంట, శాకరాజుకుంట తదితర ప్రాంతాలలో నేరస్థుల సర్వేను సిపి సుధీర్‌బాబు ప్రారంభించారు. అనంతరం సిపి పోలీసు అధికారులతో కలిసి సుబేదారి, హన్మకొండ, హసన్‌పర్తి, కమాలాపూర్, మడికొండ పోలీసు స్టేషన్ల పరిథిలోని నేరస్థుల సర్వేను నిర్వహంచారు. ఈ సందర్బంగా ఆయన స్థానిక పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి గతంలో మేజర్ నేరాలకు పాల్పడిన నేరస్థుల ఇంటిని సందర్శించి నేరస్థుల స్థితిగతులను విచారించడంతోపాటు, ప్రస్తుత జీవన విధానంపై ఆరా తీశారు.సిపి మాట్లాడుతూ పాత నేరస్థులు ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇండ్లను గుర్తించి, వాటిని జియోట్యాగింగ్ చేయడం జరగుతుందని తెలిపారు. ముఖ్యంగా పోలీసు కమిషరేట్ పరిథిలో ముఠా హత్యలు, దోపిడీలు, దొంగతనాలు, మావన అక్రమ రవాణా, బెదిరింపులకు పాల్పడిన వివిధ పోలీసు స్టేషన్లలో నమోదైన 24వేలకు పైగా నేరస్థులను గుర్తించడం జరిగిందని వివరించారు. నేరస్థుల నమోదుకు 350 పోలీసు బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. సర్వే ద్వారా సేకరించిన నేరస్థుల సమాచారాన్ని రాష్ట్ర పోలీసు విభాగం రూపొందించిన టి కాప్ యాప్‌కు అనుసంధానం చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. దీని ద్వారా నేరాలను నియంత్రించడం, ప్రజలకు భద్రత కల్పించడం సులభమవుతుందని తెలిపారు. పాత నేరస్థులు తమ జీవితాలకు స్వస్తి చెప్పి సమాజంలో బాధ్యత కలిగిన పౌరులుగా గుర్తించబడాలని అన్నారు. ఈ సర్వేలో సెంట్రల్ జోన్ డిసిపి వెంకట్‌రెడ్డి, ఎసిపిలు ప్రభాకర్, రాజేంద్రప్రసాద్, సత్యనారాయణ, ఇన్సిపెక్టర్లు రవికుమార్, నందిరాంనాయక్, సంపత్‌రావు, కిషన్, సంతోష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.