వరంగల్

మోత్కుపల్లికి నైతిక హక్కు లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సంపేట, జనవరి 18: తెలంగాణ రాష్ట్ర సమితిలో తెలంగాణ తెలుగుదేశం పార్టీని విలీనం చేయాలనే నైతిక హక్కు మోత్కుపల్లి నర్సింహులుకు ఎంత మాత్రం లేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి స్పష్టం చేశారు. నర్సంపేటలో గురువారం విలేఖరులు అడిగిన ప్రశ్నకు రేవూరిపై విధంగా బదులిచ్చారు. నిన్నటి వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ దొరల పాలన కొనసాగిస్తున్నారని తీవ్ర విమర్శలు చేసిన మోత్కుపల్లి.. రాత్రికి రాత్రే మారి పార్టీని టీఆర్ ఎస్‌లో విలీనం చేయాలనడం అనైతికమని అన్నారు. దళితుడినే ముఖ్యమంత్రిగా చేస్తానని కేసీఆర్ మాట ఇచ్చి తప్పారని పలు సందర్భాల్లో మోత్కుపల్లి బాహాటంగా విమర్శించారని, అదే విధంగా ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అసలు దళితుడే కాదని చెప్పిన వ్యాఖ్యలు తెలంగాణ సమాజం మర్చిపోలేదన్నారు. రాష్ట్ర మంత్రి వర్గంలో మహిళలకు, దళితులకు స్థానం లేదని అనేక పర్యాయాలు మోత్కుపల్లి నర్సింహులు సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించి, తాజాగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరి కాదని, తక్షణమే టీడీపీ క్యాడర్‌కు మోత్పుపల్లి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లేదని చెప్పడం దారుణమని, తాజా సర్వేల్లో సైతం చంద్రబాబుకు తెలుగుదేశం పార్టీకి పదిహేను నుండి 22 శాతం మద్దతు ఉందని తేలిపోయిందన్నారు. సీఎం కేసీఆర్, మోత్కుపల్లి మధ్య రహస్య చర్చలు జరిగినట్లు అర్థం అవుతుందన్నారు. తెలుగుదేశం పార్టీని ఎవరూ ఎమీ చేయలేరని, కార్యకర్తలే పార్టీకి కొండంత బలంగా ఉన్నారని చెప్పారు.
రేవూరికి చంద్రబాబు ఫోన్..
మోత్కుపల్లి వ్యాఖ్యలపై ఆరా..
టీడీపీ నేత మోత్కుపల్లి వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు రేవూరిని ఫోన్‌లో ఆరా తీసినట్లు తెలిసింది. నర్సంపేట పర్యటనలో ఉన్న రేవూరి ప్రకాశ్‌రెడ్డికి గురువారం ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాలకు ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ చేసి మోత్కుపల్లి నర్సింహులు ఎందుకు ఇలా వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందో అడిగి తెలుసుకున్నారు. గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలను రేవూరి చంద్రబాబుకు వివరించినట్లు సమాచారం.

బాలవికాస సేవలు అనిర్వచనీయం: స్పీకర్
వరంగల్ (కల్చరల్), జనవరి 18: భారతదేశంలోని పేదప్రజలకు గ్రామీణ ప్రాంతాలలో 40 సంవత్సరాలుగా ఎనలేని సేవలు అందిస్తున్న బాలవికాస సంస్థకు ప్రపంచ గుర్తింపురావడం, దాని వ్యవస్థాపకులకు కెనడా ప్రభుత్వం ప్రతిష్టాత్మమైన మెరిటోరియస్ సర్వీస్ డెకోరేషన్ అవార్డును ఇవ్వడం ముదావహమని తెలంగాణ శాసనసభాపతి సిరికొండ మధుసూదనాచారి అన్నారు. గురువారం కాజీపేటలోని బాలవికాస శిక్షణ కేంద్రంలో ఆత్మీయ సన్మాన సమావేశం జరిగింది. సంస్థ డైరెక్టర్ సింగారెడ్డి శౌరిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన మధుసూదనాచారి మాట్లాడుతూ ప్రపంచంలో ఎంతో మంది జన్మించినా చరిత్రలో మిగిలేవారు కొందరే ఉంటారని, మాతృదేశానికి బాలథెరిస్సా జింగ్రాస్, ఆంధ్రె జింగ్రాస్‌ల సేవలు అభినందనీయమని కొనియాడారు. వీరు పేద ప్రజలకు గ్రామీణ ప్రాంతాలలో చేసిన సేవలు అనిర్వచనీయమని, వాటిని భవిష్యత్తు తరాలవారు గుర్తుంచుకుంటారని తెలిపారు.