వరంగల్

ప్రకటనలకే పరిమితం ‘ఈనామ్’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేసముద్రం, జనవరి 19: జాతీయ ఎలక్ట్రానిక్ మార్కెటింగ్ విధానాన్ని కేసముద్రం మార్కెట్లో పూర్తిస్థాయిలో అమలు చేయకుండా కేవలం ప్రకటనలకే పరిమితం చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మార్కెట్‌కు వ్యవసాయ ఉత్పత్తులు తెచ్చిన రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు అన్ని రకాల లావాదేవీలు కంప్యూటర్ సిస్టం ద్వారా జరగాల్సి ఉండగా, కేసముద్రం మార్కెట్లో కేవలం టెండర్లు మినహా మిగిలిన విధానాలన్నీ పాత పద్ధతిలో నిర్వహిస్తున్నారు. ఫలితంగా అటు రైతులకు, ఇటు వ్యాపారులకు, మరోవైపు కార్మికులకు ఇబ్బందిగా మారిందనే ఆరోపణలు వస్తున్నాయి. గత ఆగస్టులో ఈనామ్ అమలుకు శ్రీకారం చుట్టిన అధికారులు ఇప్పటి వరకు ఆన్‌లైన్ ద్వారా రైతులకు చెల్లింపులు చేయడంలో తగిన చర్యలు తీసుకోలేక పోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ నెల 4న వ్యవసాయ ఉత్పత్తులు విక్రయించిన గూడూరు మండలం మచ్చర్లకు చెందిన యాకయ్య అనే రైతుకు ఈ నెల 11న ఆన్‌లైన్ ద్వారా చెల్లింపులు జరుపుతున్నట్లు ఆర్భాటంగా అధికారులు ఓ వ్యాపారి క్రెడిట్‌కార్డు నుంచి ఆన్‌లైన్ చెల్లింపులు జరిపి పత్రికలకు ప్రకటనలు ఇచ్చారు. తీరా ఆ మరుసటి రోజు నుంచి సాంకేతిక అడ్డంకుల సాకుతో ట్రేడర్లు చెల్లింపులకు మోకాలడ్డంతో ఆ ఒక్క రైతుకే ఆన్‌లైన్ చెల్లింపు పరిమితమైంది. దీనితో రైతుల నుంచి వ్యవసాయ ఉత్పత్తులు ఖరీదు చేసిన వ్యాపారులు రైతులకు ఆన్‌లైన్ బదులు చెక్కులు ఇస్తుండటంతో నగదు కావడానికి వారం రోజులు పడుతోందంటున్నారు. ఈనామ్‌లో ఏ రోజు తెచ్చిన వ్యవసాయ ఉత్పత్తులకు ఆరోజే ఖరీదులు చేయడంతో పాటు అదే రోజు ఆన్‌లైన్ ద్వారా చెల్లింపులు జరపాల్సి ఉంటుంది. అలాగే దడువాయి, కార్మికులు, మార్కెట్ ఫీజు కూడా అదే తీరులో మినహాయించి వారి..వారి ఖాతాల్లో ఆన్‌లైన్ ద్వారా జమ చేయాల్సి ఉంటుంది. ఇవేవి లేకుండా కేవలం రహస్య టెండర్ల విధానం మినహా మిగిలిన తంతు ఏది కూడా అమలు కావడం లేదు. దీనితో ఈనామ్ విధానం పెట్టి ఏం ప్రయోజనమంటూ అయా వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి మార్కెట్లో పూర్తిస్థాయిలో ఈనామ్ అమలు చేయడమో, లేదంటే పాత పద్ధతిద్వారా సరుకులు ఖరీదు చేయడమా..ఏదో ఒకటి తేల్చాలంటూ కర్షక, కార్మిక, వ్యాపార, రాజకీయ వర్గాలు కోరుతున్నాయి.