వరంగల్

ఘనంగా ఆయుష్య హోమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్(కల్చరల్), జనవరి 19: కాజీపేటలో స్వయంభూగా ప్రకాశిస్తూ భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న శే్వతార్కగణపతి దేవాలయ క్షేత్రంలో చతుర్దశాహ్నిక దీక్షతో నిర్వహిస్తున్న ఆశ్రమనివాస పూజలలో భాగంగా 11వ రోజు ఆయుష్య హోమాన్ని ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఆలయ వ్యవస్థాపకులు ఐనవోలు అనంత మల్లయ్య సిద్ధాంతి నేతృత్వంలో వేదపండితులు సందీప్‌సుధన్వాచారి, శశాంక్‌శర్మలు గణపతి హోమం, రుద్ర హోమాలు నిర్వహించి భక్తులు ఆయుష్యాభివృద్ధులతో ఉండాలని, అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి ఆరోగ్యం కలగాలని కోరుతూ ఆయుష్యహోమ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆలయ కార్యనిర్వాహకులు సాయికృష్ణశర్మ తెలిపారు. అనంతరం అనంతమల్లయ్య, శారద దంపతులు మాతా పితృల పాద పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా త్రిగుళ్ల శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో భక్తులు సామూహికంగా ప్రకృతి స్వరూపమైన గణపతి రూపానికి పంచామృతాభిషేకం నిర్వహించుకున్నారు. అభిషేకానంతరం ఐనవోలు మహతిశర్మ ఆలపించిన భక్తిగీతాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానిలో యల్లభట్ల రవీందర్ శర్మ, ఐనవోలు నరహరిశర్మ, ఐనవోలు ప్రవీణ్ కుమార్ శర్మ క్రాంతికుమార్ శర్మ, శంకర్‌శర్మ, రావుల విద్యాసాగర్, సుదా రాంమోహన్, చొక్కారపు శ్రీనివాస్, గందె అచ్యుత్ గుప్త తదితరులు పాల్గొన్నారు.