వరంగల్

ఇంగ్లాండ్‌లో ఉన్నత విద్యావకాశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్(కల్చరల్), జనవరి 19: భారతీయ విద్యార్థిని, విద్యార్థులకు తమ ఉన్నత విద్యకోసం, పరిశోధనలకోసం ఇంగ్లాండ్‌లో విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని, వాటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని యుకె డిప్యూటీ హైకమిషర్ ఆండ్రూ లెవిన్ అన్నారు. శుక్రవారం కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య సాయన్న అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంగ్లాండ్‌లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు స్టూడెంట్ వీసా సులభంగా లభిస్తుందని, విద్యార్థులు పరిశోధనలు చేసుకునేందుకు ఇది మంచి అవకాశమని అన్నారు. తమ విద్యా అర్హతను బట్టి స్కాలర్‌షిప్‌లు, ఫెల్లోషిప్‌లతో పాటు టీచింగ్ అసోసియేట్‌గా ఉపాధి కూడా పొందవచ్చునని తెలిపారు. పిహెచ్‌డి చేసేందుకు వచ్చేవారు అక్కడ ఒక సంవత్సరం ఎంఎస్ తప్పని సరిగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. భారత దేశం నుండి ముఖ్యంగా తెలంగాణ నుండి అనేక మంది విద్యార్థులు యుకెలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారని, కొత్తగా అక్కడికి వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావని ఆయన తెలిపారు. ఇంగ్లాండ్‌లో భద్రతా విషయంపై విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధనామిస్తూ ఇలాంటి సంఘటనలు ప్రపంచంలో అప్పుడప్పుడు ప్రతీ చోటా జరుగుతుంటాయని, వాటిపై సందేహాలు పెట్టుకోవద్దని ఇంగ్లాండ్‌లో అటువంటివి ఇబ్బందులు ఉండవని హామీ ఇచ్చారు. ఆచార్య సాయన్న మాట్లాడుతూ విదేశాలలో ఉన్న ఉన్నత విద్యా అవకాశాలను వినియోగించుకుని జీవితంలో ఉన్నత స్థానానికి ఎదిగి భారత దేశం గర్వించేలావిద్యను అభ్యసించాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం యూకే డిప్యూటీ హైకమిషర్ ఆండ్రూ లెవిన్‌ను ఉపకులపతితో పాటు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్, మేయర్ నన్నపునేని నరేందర్ తదితరులు ఆయనను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య పురుషోత్తం, విదేశీ సంబంధాల విభాగాల డైరెక్టర్ కిష్ట్ఫర్‌రుబేన్, కమలేశ్వరరావు, కాకతీయ విశ్వవిదాలయ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
భద్రకాళి అమ్మవారిని
దర్శించుకున్న ఆండ్రూ లెవిన్
చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ్భద్రకాళి దేవాలయ క్షేత్రాన్ని ఇంగ్లాండ్ డిప్యూటీ హైకమిషర్ ఆండ్రూ లెవిన్ సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఆలయ అర్చకులు ఆయనను ఆలయ మర్యాదలతో పూర్ణకుంభస్వాగతం పలికారు. ముందుగా గణపతిని దర్శించుకుని అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ మండపంలో వేదపండితులు ఆయనకు వేదాశీర్వచనం చేసి అమ్మవారి శేషవస్త్రాన్ని బహూకరించి, తీర్థప్రసాద వితరణ చేశారు.

సమస్యలపై స్పీకర్‌కు కొప్పుల గ్రామస్థుల మొర
శాయంపేట, జనవరి 19: భూపాలపల్లి నియోజకవర్గంలోని కొప్పుల గ్రామంలో స్పీకర్ మధుసూదనాచారి శుక్రవారం పల్లెప్రగతి నిర్వహించారు. గ్రామంలోని వీధుల మీదుగా పాదయాత్ర చేస్తూ అందరినీ పలకరిస్తూ సమస్యల పరిష్కారం చూపారు. వ్యవసాయం పనులకు వెళ్తున్న కూలీలతో స్పీకర్ కాసేపు మాట్లాడారు. అందులో ఒక మహిళ మాకు రేషన్‌కార్డు లేదని చెప్పగా వెంటనే ఆమెకు రేషన్‌కార్డు మంజూరు చేయాలని తహసీల్ధార్ వెంకట్‌భాస్కర్‌ను అదేశించారు. ఎడ్లబండి ఎక్కి కాసేపు వారితో ప్రయాణం చేశారు. సమస్యల అవగాహన ఉన్న నాయకుడికే అభివృద్ధిపై అవగాహన ఉంటుందని, అందుకే పల్లెప్రగతి నిద్రలు చేస్తున్నట్లు తెలిపారు. చలివాగు నీటిని రెండుపంటలకు అందించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొనారు. కొప్పుల గ్రామంలో 70లక్షలతో సీసీ రోడ్లు, 25 లక్షలతో చెరువుల మరమ్మత్తు పనులను చేయించిన్నట్లు చెప్పారు.. కొప్పుల నుండి పరకాల మూలమలుపు వరకు రోడ్డు, చలివాగుపై వంతెన నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. గత పాలకులు ఈ ప్రాంతంలో తట్టెడు మట్టి కూడా పోయాలేకపోయారని అన్నారు.ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని, నిత్యం ప్రజలలో ఉంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస మండల అధ్యక్షుడు గుర్రం రవీందర్, మాజీ ఎంపీపీ బాసాని చంద్రప్రకాశ్, ఎంపీటీసీలు బక్కి రమేష్, రవి, రమణారెడ్డి పాల్గొన్నారు.