వరంగల్

క్రీడా సమాజాన్ని నిర్మించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గూడూరు, జనవరి 20: క్రీడా సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ శక్తి వంచన లేకుండా కృషి చేయాలని మహబూబాబాద్ జాయింట్ కలెక్టర్ దామోదర్ రెడ్డి కోరారు. గూడూరు మండలంలోని అయోధ్యాపురంలో యువ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో స్వర్గీయ బీరవెళ్లి పుల్లారెడ్డి స్మారకార్థం డివిజన్ స్థాయి క్రికెట్ క్రీడోత్సవాలను శనివారం జేసీ దామోదర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత క్రీడల పట్ల విద్యార్థులు, యువతలో ఆసక్తి పెరిగిందని చెప్పారు. క్రీడలు శరీర దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయని చెప్పారు. చదువుకే పరిమితం కాకుండా ఆటపాటల్లో సైతం రాణించాలని కోరారు. క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించిన ఎంతోమంది క్రీడాకారులు ఉన్నత స్థానంలో నిలిచారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోనే మహబూబాబాద్ జిల్లా క్రీడల్లో ముందంజలో ఉందన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో స్టేడియం నిర్మాణానికి కృషి చేస్తున్నామని వెల్లడించారు. స్టేడియం నిర్మాణం అయితే క్రీడాకారులకు ఎంతగానో ఉపయోగం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర, జిల్లా నాయకులు తక్కళ్లపల్లి రవీందర్‌రావు, బీరవెళ్లి భరత్‌కుమార్ రెడ్డి, ఎంపీపీ చిల్పూరి వెంకన్న, సర్పంచ్ గుగులోతు తులసీరాంనాయక్, బీరవెళ్లి వేణుగోపాల్‌రెడ్డి, ఈదునూరి వెంకన్న పాల్గొన్నారు.