వరంగల్

కాళేశ్వరంలో గవర్నర్ పూజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహాదేవపూర్, జనవరి 20: జయశంకర్ జిల్లా మహాదేవపూర్ మండలంలోని పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వరస్వామివారి ఆలయంలో గవర్నర్ నరసింహన్ దంపతులు ప్రత్యేకపూజలు నిర్వహించారు. శనివారం గవర్నర్ దంపతులు ఆలయానికి చేరుకోగానే ఆలయ అర్చకులు వేదమంత్రోచ్ఛారణలతో పూర్ణకుంభ స్వాగతం పలికి ఆలయంలోకి అహ్వానించారు. కాళేశ్వర ముక్తేశ్వరస్వామివారి విశిష్టత, ఒకే ప్రాణవటంపై జోడులింగాలు ఉండటం దీని ప్రత్యేకతలను అర్చకులు గవర్నర్‌కు వివరించారు. ప్రత్యేక అభిషేక పూజలు జరిపిన అనంతరం గవర్నర్ దంపతులకు స్వామివారి శేషవస్త్రాలతో సన్మానించి తీర్ధప్రసాదాలు, స్వామివారి చిత్రపటం గవర్నర్ దంపతులకు అందించారు. ఇదిలా ఉండగా, కాళేశ్వర ముక్తేశ్వరస్వామి ఆలయ హుండీ లెక్కింపు శనివారం జరిపారు. రెండు నెలలకుగాను స్వామివారి హుండీ లెక్కింపులో 9.58 లక్షల రూపాయల అదాయం లభించిందని ఆలయ ఇఓ బుర్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. హుండీ లెక్కింపులో పర్యవేక్షకులు బేల్‌సింగ్, అర్చకులు పాల్గొన్నారు.
మాజీ డీజీపీ ప్రత్యేక పూజలు
పవిత్ర పుణ్యక్షేత్రం అయిన కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వరముక్తేశ్వరస్వామివారిని రాష్ట్ర మాజీ డీజీపీ అనురాగ్‌శర్మ దర్శించుకున్నారు. శనివారం ఆయనకు అర్చకులు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వేదపండితుల ఆధ్వర్యంలో అనురాగ్‌శర్మ దంపతులు కాళేశ్వర ముక్తేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదుపరి శుభనందాదేవి ఆలయంలో మాజీ డీజీపీ దంపతులకు వేదాశీర్వచనం చేసి స్వామివారి చిత్రపటాన్ని అందించి తీర్థప్రసాద వితరణ చేశారు. ఆయన వెంట డిఎస్పీ కేఆర్‌కే ప్రసాదరావు, మహాదేవపూర్ సిఐ రమేష్, ఎస్సై శ్రీనివాస్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.