వరంగల్

మేడారం ట్రా‘ఫికర్’పై నజర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జనవరి 20: మేడారం జాతరకు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే ప్రజలకు కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్‌సమస్యలు ఎదురవకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు. ఈనెల 31వ తేదీనుంచి ఫిబ్రవరి మూడవ తేదీవరకు జరిగే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను దృష్టిలో పెట్టుకుని శనివారం పోలీసు కమిషనర్ సుధీర్‌బాబు, వరంగల్ మహానగరపాలక సంస్థ కమిషనర్ శృతిఓఝాతో కలిసి ట్రాఫిక్ సమస్యల నివారణ కోసం చేపట్టవలసిన చర్యలను గుర్తించేందుకు నగరంలోని వివిధ క్షేత్రస్థాయి పర్యటన జరిపారు. హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి జాతరకు వచ్చే వాహనాలను నియంత్రించే విధానం తీరును ఇద్దరు కమిషనర్లు అధికారులను అడిగి తెలుసుకున్నారు. నగరంలో ట్రాఫిక్ సమస్య ఏర్పడితే హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలను ఇతర మార్గాలలో మళ్లించటంపై పోలీసు కమిషనర్, నగరపాలక సంస్థ కమిషనర్ పోలీసు అధికారులను, నగరపాలక సంస్థ అధికారులతో చర్చించారు.
దారి మళ్లింపు కోసం గుర్తించిన మార్గాలలో ప్రమాదకరంగా ఉన్న గుంతలకు వెంటనే మరమ్మతులు చేయాలని, ప్రమాదకరంగా ఉన్న రోడ్డు మలుపుల వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని ఇద్దరు కమిషనర్లు సంబంధిత అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ సమస్య నియంత్రణకు పోలీసు కమిషనరేట్ పరిధిలోని జనగామ జిల్లా పెంబర్తి నుంచి రూరల్ జిల్లా అత్మకూరు పోలీసు స్టేషన్ పరిధి వరకు ట్రాఫిక్ హోల్డింగ్ పాయిట్లు ఏర్పాటుచేయాలని, దీనికోసం అవసరమైన స్థలాలను గుర్తించాలని పోలీసు అధికారులకు కమిషనర్ సూచించారు. ఈ పర్యటనలో డీసీపీలు వెంకటరెడ్డి, వెంకటేశ్వర్లు, ట్రాఫిక్ విభాగం అదనపు డీసీపీ మురళీధర్, ఏసీపీలు జనార్ధన్, శోభన్‌కుమార్, సత్యనారాయణ, సుధీంద్ర, రాజేంద్రప్రసాద్, నగరపాలక సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు.

టెక్స్‌టైల్ పార్క్‌లో ఉద్యోగావకాశాలు కల్పించాలి
* ఎంపీ రాపోలు ఆనందభాస్కర్
రేగొండ, జనవరి 20: పద్మశాలి కులస్థులకు టెక్స్‌టైల్ పార్క్‌లో ఉద్యోగావకాశాలు కల్పించేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్ అన్నారు. శనివారం మండలంలోని రేపాక గ్రామంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శ్రీ భక్త మార్కండేయ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పద్మశాలీ జెండాను అవిష్కరించి భక్త మార్కండేయ చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వరంగల్‌లో నూతనంగా ఏర్పాటు చేస్తున్న టెక్స్‌టైల్ పార్క్‌లో ఎక్కువ శాతం పద్మశాలి కులస్థులకే ఉద్యోగావకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.