వరంగల్

తెలంగాణ ఇచ్చింది.. ఆ నలుగురి బాగుకేనా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేసముద్రం, జనవరి 21: రైతుల ఆత్మహత్యలు, విద్యార్ధుల బలిదానాలను చూసి చలించిన సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే.. సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల బాగుకోసమే అన్నట్లు వ్యవహరిస్తూ ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేశారని, వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను మట్టికరిపించేందుకు కాంగ్రెస్ శ్రేణులు కష్టించి పనిచేయాలని కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాంనాయక్ సూచించారు. ఆదివారం కేసముద్రం (స్టే) గ్రామ కాంగ్రెస్ పార్టీ విస్త్రుతస్థాయి సమావేశం గుగులోత్ వీరునాయక్ అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీ ఎం కేసీ ఆర్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా సరిగా అమలు చేయడం లేదన్నారు. పేదల సంక్షేమాన్ని విస్మరించి తన కుటుంబం, ఒ వర్గానికి పెద్దపీట వేస్తున్నాడని ఆరోపించారు. తెలంగాణ కోసం ఏనాడు కూడా ఉద్యమంలో పాల్గొనివారికి సైతం పదవులిచ్చాడని దుయ్యబట్టారు. మహబూబాబాద్ జిల్లాలో పేద గిరిజనులకు తినడానికి తిండిలేక తమ పిల్లలను అమ్ముకునే దుస్థితికి సీ ఎం కేసీ ఆర్ ఏం జవాబు చెబుతారని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ మరోసారి గెలిస్తే ఇక రాష్ట్రంలో పేదల బతుకు మరింత దుర్భరంగా మారుతుందన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి పేదల సంక్షేమానికి పాటుపడుతున్న కాంగ్రెస్ పార్టీని పటిష్ట్టపరిచి వచ్చే ఎన్నికల్లో విజయం వైపు నడిపేందుకు పార్టీ శ్రేణులు పాటుపడాలన్నారు.
మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ మహబూబాబాద్ నియోజకవర్గంలో పార్టీ బలమైన రాజకీయ శక్తులుగా ఉన్న టీడీపీ, కాంగ్రెస్‌లు దాదాపు ఒక్కటిగా మారాయని, టీడీపీలో ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే వారిని కూడా కాంగ్రెస్‌లోకి ఆహ్వానించి వచ్చే ఎన్నికల్లో మానుకోట జిల్లాలో కాంగ్రెస్ పార్టీ విజయం సాదించేలా కృషి చేయాలన్నారు. డీసీసీ అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్‌చెందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం కేజీ టూ పీజీ విద్యతో పాటు అనేక పథకాలు జిల్లాలో ఎక్కడా అమలు చేయలేదని, సీఎం మాటలతో కాలం గడుపుతున్నారని విమర్శించారు.
ఈ సందర్భంగా వివిధ పార్టీల నుంచి దాదాపు 50 మంది కార్యకర్తలు, నాయకులు కాంగ్రెస్‌లో చేరారు. సమావేశంలో నియోజకవర్గ ఇంచార్జీ అనీల్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు దస్రునాయక్, సర్పంచ్ రమ, ఎంపీటీసీ సునిత, నునావత్ రాధ, ఓలం రమేష్, నాగేశ్వర్‌రావు, ఎస్కె మహమూద్, సంతోష తదితరులు పాల్గొన్నారు.