వరంగల్

ప్రజల అకాంక్షలను హరిస్తున్న ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వడ్డేపల్లి, జనవరి 21:ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంకోసం గత కొన్ని ఏళ్లనుండి ప్రజలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యమాలు, పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు స్వేచ్ఛాయుతంగా జీవించే హక్కుగాని, వారి హక్కుల గురించి మాట్లాడకుండా అంక్షాలను విధిస్తూ పాలకులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు ప్రభుత్వంపై మండిపడ్డారు. ఆదివారం తెలంగాణ ప్రజా ఫ్రంట్ అధ్వర్యంలో వరంగల్ డిక్లరేషన్‌కు 20ఏళ్లు నిండిన సందర్భంగా నగరంలో బహిరంగ సభ ఏర్పాటుకు మధ్యాహ్నం నుండి సాయత్రం నాలుగుగంటల వరకు పోలీసుల నిర్భందం మద్య హన్మకొండ హంటర్‌రోడ్‌లోని అభిరాం గార్డెన్‌లో తెలంగాణ ప్రజాఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు నలమాస కృష్ణ అధ్యక్షతన బహిరంగ సభ జరిగింది. ముందుగా పోలీసుల అనుమతితో హంటర్‌రోడ్డులోని విష్ణుప్రియ గార్డెన్‌లో జరగవలసిన బహిరంగ సభ పోలీసులు నిరాకరించడంతో సాయత్రం ఐదుగంటలకు అభిరాం గార్డెన్‌లో పోలీసుల అంక్షలతో జరిగింది. ఈ సందర్భంగా వరవరరావు మాట్లాడుతూ ప్రజాసామ్య దేశంలో ప్రజలు స్వేచ్చగా తమ హక్కులను పొందేందుకు నిరసనలు, పోరాటాలు, ఉద్యమాలు చేసుకునే హక్కు ఉందని తెలిపారు. కానీ ఉద్యమాల, పోరాటాల స్పూర్తితో ఎంతోమంది అమరుల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నియంతపాలన కొనసాగుతు రాజ్యంగంలోని హక్కులను కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలకు జరుగుతున్న కష్టనష్టాల నుండి విముక్తి పొందేందుకు 1987నుండి 1997వరకు వివిధ ప్రదేశాలలో మహాసభల ద్వారా చివరికి వరంగల్ అఖిలభారత ప్రజా ప్రతిఘటన అధ్వర్యంలో వరంగల్ డిక్లరేషన్‌ను ప్రకటించామని, దాని పర్యావసనమే తెలంగాణ రాష్టస్రమితి అవిర్భావమని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలైన దళితులకు మూడు ఎకరాల భూమి, ఇంటికో ఉద్యోగం, కేజీ నుండి పీజీ వరకు ఉచిత నిర్భందవిద్య, ఆదివాసీలకు భూమిహక్కు చట్టాలు, గిరిజనలకు రిజర్వేషన్లు తదితర హామీలు నేటికి మూడు సంవత్సరాలు గడిచిన కూడా ఏ ఒక్కహామీ కూడా నేరవేర్చలేదని విమర్శించారు. సమావేశంలో అచార్య మనోరంజన్ మహంతి, అచార్య హరగోపాల్, అచార్య సుజాత, డాక్టర్ ఖాసీం మాట్లాడుతూ గత 20ఏళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో పోలీసుల నిర్భందం మద్య జరిగిన వరంగల్ డిక్లరేషన్‌కు, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుపుకుంటున్న డిక్లరేషన్‌కు తేడా ఏమీలేదని అవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగంలో ప్రతిపాధించిన హక్కులను ఉల్లంఘిస్తూ నియంతృత్వ పరిపాలనను ముఖ్యమంత్రి కొనసాగిస్తున్నారని, పేదల కష్టాలను విస్మరిస్తూ ప్రపంచ పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో వైద్య, విద్యరంగాలను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ అర్థికవనరులను దోచుకుంటున్నారని విమర్శించారు. ప్రాజెక్టుల పేరిట అటవీ భూములపై ఆదివాసీలకు ఉన్న హక్కులను హరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నరని ఆరోపించారు. ప్రజాస్వామిక తెలంగాణ సాధించేందుకు ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, విద్యార్ధులు ఒకే వేదిక నుండి మలిదశ ఉద్యమానికి సిద్దం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం 133అంశాలతో వరంగల్ డిక్లరేషన్ పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సమావేశంలో టీపీఎఫ్ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి, ఉపాధ్యక్షులు రమణచారి, నాయకులు రమేష్, వివిధ ప్రజాసంఘాలు నాయకులు పాల్గొన్నారు.

రామప్పలో భక్తుల సందడి
వెంకటాపురం(రామప్ప), జనవరి 21: వెంకటాపురం మండలం పాలంపేటలోని రామప్ప దేవాలయానికి ఆదివారం భారీగా భక్తులు తరలిరావటంతో కోలాహలం నెలకొంది. మేడారం జాతర సందర్భంగా జాతరకు ముందే భక్తులు సమక్క, సారక్కను దర్శించుకుని తిరుగు పయనంలో రామలింగేశ్వరస్వామి దర్శనం కోసం రామప్ప దేవాలయానికి వస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయంలోని రామలింగేశ్వరస్వామికి ఆలయ పూజరులు హరీష్‌శర్మ, ఉమశంకర్ ప్రత్యేకపూజలు నిర్వహించి భక్తులకు హారతి, తీర్థప్రసాదాలు అందచేసారు. ఆలయానికి వచ్చిన భక్తులు రామప్ప ఆలయంలోని కాకతీయ కట్టడాలను చూసి ఆనందం, ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అనంతరం రామప్ప సరస్సులో బోటుషికారు చేస్తూ పరిసర ప్రాంతాలను తిలకించారు.