వరంగల్

ఐదు జిల్లాలు.. ఒక్కరే రెగ్యులర్ కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జనవరి 21: ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో కొత్తగా ఏర్పడిన నాలుగు జిల్లాలకు రెగ్యులర్ కలెక్టర్లు లేకపోవటంతో సమస్యలు పేరుకుపోతున్నాయి. గడచిన 15నెలలుగా పనిచేసిన కలెక్టర్లను బదిలీ చేసిన ప్రభుత్వం కొత్త కలెక్టర్లను నియమించకుండా పక్క జిల్లాల కలెక్టర్లకు ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించింది. కానీ సొంత జిల్లా వ్యవహారాలతోపాటు ఇన్‌చార్జ్‌లుగా ఉన్న జిల్లాలో పాలనావ్యవహారాలు నిర్వహించటం వీరికి తలనొప్పిగా మారింది. నెలరోజుల కిందట ఆసిఫాబాద్ జిల్లాలో ఆదివాసీలు, గిరిజను మధ్య ఏర్పడిన వివాదం నేపథ్యంలో అక్కడి జిల్లా కలెక్టర్‌ను బదిలీ చేసిన ప్రభుత్వం వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌ను ఆసిఫాబాద్‌కు బదిలీ చేసింది. వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలికి ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఆ తరువాత కొన్ని వారాలకే జనగామ, భూపాలపల్లి, మహబూబాబాద్ కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. జనగామ కలెక్టర్ దేవసేనను పెద్దపల్లి కలెక్టర్‌గా బదిలీ చేసిన ప్రభుత్వం ఇక్కడ కొత్త కలెక్టర్‌ను నియమించకుండా యాదాద్రి భువనగిరి కలెక్టర్ అనితా రామచంద్రన్‌కు ఇన్‌చార్జ్ కలెక్టర్‌గా బాధ్యతలు అప్పగించింది. మహబూబాబాద్ కలెక్టర్ ప్రీతిమీనాను బదిలీ చేసి పక్కనే ఉన్న ఖమ్మం కలెక్టర్ సోమేష్‌కుమార్‌ను ఇక్కడి ఇన్‌చార్జ్ కలెక్టర్‌గా నియమించింది. అదే విధంగా భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న ఆకునూరి మురళిని హైదరాబాద్‌కు బదిలీ చేసి మంచిర్యాల జిల్లా కలెక్టర్ కర్ణన్‌కు ఇక్కడ అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం నాలుగు జిల్లాలలో ఇన్‌చార్జ్ కలెక్టర్ల వ్యవస్థ నడుస్తుండటంతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నత్తనడకన నడుస్తున్నాయని కిందిస్థాయి అధికారులు చెబుతున్నారు. సొంత జిల్లా వ్యవహారాలు చక్కబెట్టడంతోనే సరిపోతున్న పొరుగు జిల్లాల కలెక్టర్లకు ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని నాలుగు జిల్లాల ఇన్‌చార్జ్ బాధ్యతలు నిర్వహించటం ఇబ్బందికరంగా బావిస్తున్నారు. రెగ్యులర్ కలెక్టర్లు లేని కారణంగా మరుగుదొడ్ల నిర్మాణం, డబుల్ బెడ్‌రూం ఇళ్లు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ తదితర ముఖ్యమైన అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ లోపిస్తున్నట్లు అధికారులే చెబుతున్నారు. ముఖ్యంగా మరో 10రోజుల్లో మేడారం మహాజాతర ప్రారంభం అవుతుండగా, జాతర పనులు సక్రమంగా జరుగటం లేదని ఆరోపణలు చాలాకాలంగా వినిపిస్తున్న తరుణంలో భూపాలపల్లి కలెక్టర్‌ను బదిలీ చేసి కొత్త కలెక్టర్‌ను నియమించకపోవటంతో జాతర వ్యవహారాలు గందరగోళంగా మారినట్లు వివిధ శాఖల కిందిస్థాయి సిబ్బంది వాపోతున్నారు. స్వచ్ఛ్భారత్ కార్యక్రమం కింద మరుగుదొడ్ల నిర్మాణం నిర్ణీత సమయంలో పూర్తిచేయడానికి, ఉగాది నాటికి మిషన్ భగీరథ పనులు, వేసవి పూర్తయ్యే నాటికి మిషన్ కాకతీయ పనులు పూర్తికావటానికి జిల్లాస్థాయిలో పర్యవేక్షణ అవసరమని, ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తక్షణం కొత్త కలెక్టర్ల వెంటనే నియమించాలని ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రజాప్రతినిధులు, కిందిస్థాయి అధికారులు కోరుతున్నారు.