వరంగల్

మూడన్నర ఏళ్లలో ఎంతో అభివృద్ధి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేగొండ, జనవరి 21: తెలంగాణలో 70ఏళ్లలో జరగని అభివృద్ధిని మూడున్నర ఏళ్లలో చేశామని రాష్ట్ర శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూధనాచారి అన్నారు. మండలంలోని కక్కర్లపల్లి గ్రామంలో ప్రగతి పల్లెనిద్రలో భాగంగా ఆదివారం తెల్లవారుజామున నిద్ర లేచిన స్పీకర్ గ్రామస్తులు, విద్యార్ధులతో కలిసి చలిమంట కాగారు. విద్యార్థులతో ముచ్చటించిన సందర్భంలో స్పీకర్ లక్షరూపాయలను డిపాజిట్ చేస్తానని, మీరు ఎంచుకున్న లక్ష్యాన్ని ఎవరైతే చేరుకుంటారో వారికి బహుమతిగా అందజేస్తానని తెలిపారు. ప్రభుత్వం అనేక గురుకుల పాఠశాలలు ఏర్పాటుచేసి ఒక్కో విద్యార్థికి 50వేల రూపాయల నుండి 70వేల రూపాయల వరకు ఖర్చు చేస్తోందని తెలిపారు. అనంతరం గ్రామంలో వాడవాడలా తిరుగుతూ గ్రామస్తులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతివాడకు అవసరమయిన పనులను అక్కడికక్కడే సంబదిత అధికారులతో మాట్లాడి మంజూరు చేసారు. గ్రామంలో ప్రతి వాడకు సీసీ రోడ్లు నిర్మించేందుకు, బీసీ కాలనీకి 30లక్షల రూపాయలు, ఎస్సీ కాలనీకి 20లక్షల రూపాయలను వారంరోజుల్లో మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలో 40 డబుల్ బెడ్‌రూం ఇళ్లు మంజూరు చేయించానని, గ్రామస్తుల కోరిక మేరకు అదనంగా మరో 40ఇళ్లను మంజూరు చేయిస్తానని అన్నారు. గ్రామంలో మురుగు కాలువ నిర్మాణానికి 60లక్షల రూపాయలు మంజూరయ్యాయని, త్వరలో పనులు ప్రారంభిస్తారని తెలిపారు. గత పాలకులు ప్రజల ఓట్లతో గెలిచి అవినీతికి పాల్పడుతూ సొంత ఆస్తులు పెంచుకున్నారని ఆరోపించారు. ప్రజలే దేవుళ్లుగా భావించి వారి సంక్షేమం ధ్యేయంగా పనిచేస్తున్నానని అన్నారు. నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అభివృద్ధిలో ముందువరసలో ఉంచుతానని అన్నారు. గ్రామానికి చెందిన విశ్వబ్రాహ్మణులకు కమ్యూనిటీ హాల్ మంజూరు చేయిస్తానని, వ్యక్తిగత రుణాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. 10లక్షలతో నిర్మించే కమ్యూనిటీ హాల్ భవనానికి స్పీకర్ భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు. అనంతరం విశ్వబ్రాహ్మణులు స్పీకర్ మధుసూధనాచారిని శాలువ, పూలమాలలతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఈర్ల సదానందం, టీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మోడం ఉమేష్‌గౌడ్, సర్పంచ్ సూర మహేందర్, ఎంపీటీసీ నూనే వెంకటేశ్వర్లు, విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు దురిశెట్టి రాజు, ఉపాధ్యక్షుడు మంచోజు శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.