వరంగల్

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టేషన్‌ఘన్‌పూర్, జనవరి 22: మండలంలోని రాఘవపూర్ శివారులో హన్మకొండ - హైదరాబాద్ జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం... హైదరాబాద్ పటాన్‌చెరుకు చెందిన బండారి రాజుకుమార్ తన వ్యక్తిగత పనులపై తన స్నేహితుడైన సందీప్‌కుమార్‌తో హోండా ఆక్టివాపై హన్మకొండకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో రాఘవపూర్ శివారు రోహిణి ఆగ్రోటెక్ రైస్‌మిల్లు వద్ద ఎదురుగా వస్తున్న ఇన్నోవా కారును ఢీకొట్టాడు. ప్రమాదంలో ఆక్టివాపై వెళ్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న స్థానిక సీఐ నరేందర్ జాతీయ రహదారిపై పడి ఉన్న ఇద్దరి మృతదేహాలకు పంచానామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ఎంజీ ఎంకు తరలించి జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. కాగా, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నరేందర్ తెలిపారు.
తేనెటీగల దాడిలో ఇద్దరికి గాయాలు
రేగొండ, జనవరి 22: తిర్మలగిరి గ్రామశివారులో తేనెటీగలు దాడి చేయడంతో ఇద్దరికి తీవ్రగాయాలైన సంఘటన సోమవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. తిర్మలగిరి గ్రామనికి చెందిన చిగురుమామిడి రవి తన వ్యవసాయ బావివద్ద పనులు చేస్తుండగా పక్కన ఉన్న చెట్టు మీద తేనెటీగలు ముసిరి రవితోపాటు కూలీపనికి వచ్చిన కాదీం నీలమ్మపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయ. దీంతో స్థానికులు సమాచారం మేరకు 108 సిబ్బంది హుటాహుటిన పరకాల ఆసుపత్రికి తరలించగా ఇద్దరు చికిత్స పొందుతున్నారు. వీరిలో రవి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

రామప్ప ఆలయం..
అభివృద్ధికి ఆమడదూరం
వెంకటాపురం (రామప్ప), జనవరి 22: జయశంకర్ జిల్లా వెంకటాపురం మండలం పాలెంపేట గ్రామశివారులోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామప్ప దేవాలయాన్ని అభివృద్ధి చేసేందుకు నిధులు కరువయ్యాయి. రాష్ట్ర నలుమూలల నుండి వచ్చే పర్యాటకులే కాకుండా దేశ, విదేశాల నుండి నిత్యం వేలాదిమంది భక్తులు రామలింగేశ్వరునికి పూజలు నిర్వహిస్తారు. అయతే, భక్తులకు సౌకర్యాలు సక్రమంగా లేకపోవడంతో పర్యాటకులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఒకపక్క రాష్ట్రప్రభుత్వం పర్యాటక కేంద్రాల అభివృద్ధికి కోట్లాది నిధులు మంజూరు చేస్తుంటే, ములుగు నియోజకవర్గంలో మల్లూర్ జలపాతం, లక్నవరం, పాకాల వంటి పర్యాటక కేంద్రాలే అభివృద్ధి చెందుతున్నాయి. 802 సంవత్సరాలు చరిత్ర కలిగిన కాకతీయ కట్డడాల అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడేలా ఉందని భక్తులు వాపోతున్నారు. ప్రతి రెండు సంవత్సరాలకోసారి జరిగే మేడారం జాతరకు దేశ, విదేశాల నుండి కోట్లాది మంది భక్తులు అమ్మవార్లకు మొక్కులు సమర్పించుకొని తిరుగు ప్రయాణంలో రామప్ప పరిసర ప్రాంతాలను చూసేందుకు వస్తూంటారు. గత మేడారం జాతరకు రామప్ప పరిసర ప్రాంతలలో మరుగుదొడ్లు, క్యూలైన్లు, విద్యుత్, స్నానఘట్టాలు తదితర సౌకర్యలు కల్పించారు. కానీ ఈ మహాజాతరకు ఇప్పటివరకు రామప్ప దేవాలయంలో ఎటువంటి సౌకర్యాలు కల్పించకపోవడంతో తిరుగు ప్రయాణంలో వచ్చే భక్తులు నిరుత్సాహపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం స్పందించి రామప్ప దేవాలయంలో సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.