వరంగల్

గ్రామాల అభివృద్ధే ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శాయంపేట, జనవరి 22: భూపాలపల్లి నియోజకవర్గంలో అన్ని గ్రామాలు అభివృద్ధి చేయటమే ధ్యేయంగా పనిచేస్తున్నానని స్పీకర్ సిరికొండ మధుసూధనాచారి అన్నారు. మండలంలోని జోగంపల్లి శివారు మినీ సమక్క, సారలమ్మ జాతర ప్రాంగణంలో 19 లక్షలతో నిర్మిస్తున్న కమ్యూనిటీ హాల్‌కు సోమవారం స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ సమక్క, సారలమ్మ గద్దెలను దర్శించుకుని పూజలు జరిపారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ చలివాగు ప్రాజెక్టు రిజర్యాయర్‌గా మారుతున్న నేపథ్యంలో ఆహ్లాదకరంగా ఉండే ప్రదేశంలో కమ్యూనిటీ హాల్‌ను నిర్మించడం ద్వారా శుభకార్యాలకు అనువుగా ఉంటుందని అన్నారు. పవిత్రమైన ప్రాంగణంలో కమ్యూనిటీ హాల్ నిర్మించడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమలో ఎంపీపీ బాసాని రమాదేవి, తెరాస మండల అధ్యక్షుడు గుర్రం రవీందర్, సర్పంచులు చంద్రవౌళి, రవీందర్, రమేష్, ఎంపీటీసీలు గుత్తిరమేష్, అశోక్, విజయ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వానికి మంచిపేరు తెండి
* ఉద్యోగులకు ఎమ్మెల్యే ఎర్రబెల్లి పిలుపు
జనగామ, జనవరి 22: ఉద్యోగులు సమర్థవంతంగా ఉన్నతమైన సేవలందించి ప్రభుత్వానికి మంచిపేరు తేవాలని పాలకుర్తి ఎమ్మెల్యే, ఐకేపీ ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు దయాకర్‌రావు కోరారు. ఐకేపీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్‌ను సోమవారం జనగామ డీఆర్‌డీవో కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దయాకర్‌రావు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రజలతో మమేకమయ్యేందుకు ఐకేపీ ఉద్యోగులకే ఎక్కువ అవకాశాలు ఉంటాయని అన్నారు. ప్రధానంగా మహిళలను పొదుపు పట్ల ప్రోత్సహిస్తూ వారి ఆర్థిక అభివృద్ధి కోసం ఈ విభాగం ఎంతగానో ఉపయోగ పడుతుందని అన్నారు. అందుకే ప్రభుత్వానికి పేరు ప్రతిష్టలు రావాలంటే ఐకేపీ పైనే ఆధారపడివుందని అన్నారు. ఉద్యోగులకు శాఖపరమైన సమస్యలు ఉంటే తమ దృష్టికి తేవాలని కోరారు. అనంతరం డీఆర్‌డీవో మేకల జయచంద్రారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు సమన్వయంతో పనిచేస్తూ మంచి ప్రగతి సాధించామని వివరించారు. అదే స్ఫూర్తితో జిల్లాలో ముందుకెళ్లాలని ఉద్యోగులను కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీడీలు సరిత, వసంత, సంపత్‌రావులు, ఐకేపీ జాక్ జిల్లా కన్వీనర్లు ఆనంద్, సంపత్, దేవీశ్వరి, ప్రతినిధులు రాజేంద్రప్రసాద్, సోమయ్య, సారయ్య, సదానందం పాల్గొన్నారు.