వరంగల్

రుణాల మంజూరులో తీవ్రజాప్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జనవరి 22: ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులకు వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సబ్సిడీలు మంజూరు చేస్తుంటే బ్యాంకర్లు రుణాలు ఇవ్వటంలో జాప్యం చేస్తున్నారంటూ మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్ అసంతృప్తి వ్యక్తం చేసారు. వివిధ పథకాలకు సుమారు 80 శాతం సబ్సిడీగా ప్రభుత్వం వేల కోట్లు మంజూరు చేస్తుంటే మిగిలిన 20 శాతం నిధులు రుణాలుగా ఇవ్వటానికి బ్యాంకులకు అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. సోమవారం రూరల్ జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశంలో వివిధ ప్రభుత్వ పథకాల అమలుతీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ సీతారాంనాయక్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమం కోసం ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తుంటే ఎంపికైన లబ్ధిదారులకు రుణాలు ఇవ్వటంలో జాప్యం చేయటం ఎందుకని ప్రశ్నించారు. బ్యాంకులవారీగా మంజూరయిన యూనిట్లు, ఎన్ని యూనిట్లకు రుణాలు మంజూరు చేసారు. పెండింగ్ యూనిట్లు, ఏ కారణంగా పెండింగులో ఉంచారనే అంశాలపై సవివరమైన నివేదిక ఇవ్వాలని సీతారాం నాయక్ బ్యాంకర్లను ఆదేశించారు. ప్రభుత్వ పథకాలైన ముద్ర, స్టాండప్ ఇండియా పథకాలకు సత్వరం రుణాలు మంజూరు చేయటంలో ప్రత్యేకశ్రద్ధ చూపాలని సూచించారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ ఆర్థిక చేయూత పథకంలో బ్యాంకర్లను భాగస్వామ్యం చేయటం ద్వారా లబ్ధిదారులు సత్వరంగా యూనిట్లు ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంటుందని, తద్వారా లబ్ధిదారులు ఆర్థికంగా బలపడతారని ప్రభుత్వం భావిస్తే, అందుకు భిన్నంగా రుణాల మంజూరులో బ్యాంకర్లు తీవ్రఆలస్యం చేయటాన్ని తప్పుపట్టారు. ఆర్థిక సంవత్సరంలో మంజూరైన యూనిట్లను అదే ఆర్థిక సంవత్సరంలో నెలకొల్పేలా బ్యాంకర్లు శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. లబ్ధిదారుల ఎంపిక, నిధుల విడుదలలో కూడా జాప్యం జరుగుతున్న కారణంగా కూడా యూనిట్ల ఏర్పాటులో జాప్యం జరుగుతోందని చెప్పారు. కాగా, 2018-19 ఆర్థిక సంవత్సరానికి పొటెన్షియల్ లింక్‌డ్ క్రెడిట్ ప్లాన్‌ను సమావేశంలో విడుదల చేసారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి 1736.62 కోట్ల రూపాయలు రుణాలు ప్రతిపాదించగా అందులో 920.12 కోట్ల రూపాయలు పంట రుణాలుగా, 226.44 కోట్లు వ్యవసాయ ఆధారిత, వ్యవసాయ అనుబంధ రంగాలకు టర్మ్ లోన్‌లుగా ఇవ్వాలని ప్రతిపాదించారు. వ్యవసాయరంగ వౌలిక సదుపాయాలకు 46.48 కోట్ల రూపాయలు, చిన్న, మధ్యతరగతి వ్యాపారాలకు 451కోట్లు, హౌసింగ్ పథకాలకు 36 కోట్లు, స్వయం సహాయక సంఘాలకు 24.50 కోట్ల రూపాయలు ఇవ్వాలని ప్రతిపాదించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి హరిసింగ్, లీడ్ జిల్లా మేనేజర్ సాయిప్రసాద్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేఖర్‌రెడ్డి, వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.