వరంగల్

కల్యాణానికి పోటెత్తిన్న భక్తజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కురవి, ఫిబ్రవరి 13: శివరాత్రి పర్వదినాన ప్రతి ఏడు నిర్వహించే స్వామి వారి కళ్యాణ శుభగడియలు సమీపిస్తున్న తరుణంలో మంగళవారం పురవీధులు మొత్తం భక్తులతో కిక్కిరిసి పోయాయి. ఆలయ ప్రాంగణంలోనే కాకుండా నాగుమయ్య ఆలయంలో జరిగే కళ్యాణ ప్రాంగణం సుమారు(3ఎకరాలలో) భక్తులు సాయంత్రం వరకే నిండిపోయారు. దర్శనం చేసుకున్న భక్తులు కుటుంబ సమేతంగా నాగుమయ్య ప్రాంగణంలోకి వెళ్లడంతో ఒకింత తొక్కిసలాట జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు తగు చర్యలు తీసుకున్నారు.
* భక్తజనసందోహంలో ఎదుర్కోళ్లు
* ఎదురు దిటీలతో భక్తుల స్వాగతాలు
మంగళవారం రాత్రి 7గంటలకు ఆలయంలో చండీశ్వరుడికి పూజలు నిర్వహించి సేవలపై స్వామి వారు, అమ్మవారు ఎదుర్కోళ్ల కార్యక్రమానికి బయలుదేరి వెళ్లారు. రెండు శావలపై అమ్మవారిని, స్వామివారిని గ్రామ పురవీధులగుండా ఊరేగింపుగా తీసుకుని వెల్లారు. గ్రామపంచాయితీ నుండి గ్రామంలోకి రెండు శావలు విడిపోయి, గ్రామ పొలిమేర అయిన గండు మైసమ్మ వద్ద రెండు శావలు ఎదురవుతాయి. ఎదురు దివిటీలతో స్వామివారికి భక్తులు స్వాగతించి తమ మొక్కులను చెల్లించుకున్నారు. అమ్మవారి వైపు కొద్దిమంది భక్తులు, స్వామి వారి వైపు కొద్ది మంది భక్తులు విడిపోయి కట్న కానుకలు, ఇరువురి గుణగణాల గూర్చి సుమారు గంట సేపు వాదోపవాదాలు చేసుకుంటారు. మేము గొప్ప అంటే...మేము గొప్ప అని అంటారు. అనంతరం స్వామివారి, అమ్మవారి పెద్దమనుషులు ఒక్కటౌతారు. ఈ కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఎసై నాగభూషణం ఆధ్వర్యంలో శావల చుట్టూ రోప్ పార్టీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మహిళలు శావలకు హారుతులు ఇచ్చి తమ భక్తిని చాటుకున్నారు.