వరంగల్

హరహర మహాదేవ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్(కల్చరల్), ఫిబ్రవరి 13: వరంగల్ జిల్లా వాసులు శివనామ స్మరణలో ఓలలాడారు, శైవ క్షేత్రాలలో వేద మంత్రాలు ప్రతిధ్వనించాయి, హరహర మహాదేవా అంటూ ప్రజలు పరమేశ్వరుని సన్నిధిలో పరవశులైయ్యారు, మహాశివరాత్రి వేళ శివనామ స్మరణతో ఆలయాలు మారుమ్రోగాయి. జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. మంగళవారం శివరాత్రిని పురస్కరించుకుని ఆలయాలలో రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు, రుద్రహోమాలతో పాటు శివపార్వతుల కళ్యాణోత్సవాన్ని కనుల పండువగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా హన్మకొండలోని వేయిస్తంబాల ఆలయం, సిద్దేశ్వరాలయం, మడికొండ మెట్టు రామలింగేశ్వరాలయం, బట్టుపల్లి ఫనికల్ రామప్ప దేవాలయం, కాజీపేట శే్వతార్కగణపతి దేవాలయం, వరంగల్ రామలింగేశ్వరాలయం, కోటిలింగేశ్వరాలయం, భద్రేశ్వరాలయాలలో శివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. భక్తులు తెల్లవారుజాము నుండే ఆలయాలకు చేరుకుని ప్రత్యేక శివారాధనలు నిర్వహించుకున్నారు. శివరాత్రి వేళ భోలా శంకరున్ని దర్శించుకుని పరవశించి పోయారు. ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, మృత్యుంజయ పాశుపత హోమాలు, శివపార్వతుల కళ్యాణోత్సవాలతో నగరమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఈ సందర్భంగా హన్మకొండలోని వేయిస్తంబాల రుద్రేశ్వరాలయంలో శివరాత్రిని పురస్కరించుకుని రుద్రేశ్వరుని కళ్యాణొత్సవం నేత్ర పర్వంగా జరిగింది. తెల్లవారుజాము నుండే భక్తులు ఆలయంలో బారులు దీరి రుద్రేశ్వరున్ని దర్శించుకున్నారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితుల వేద మంత్రాల నడుమ నగర పాలకులు, నాయకుల సమక్షంతో వేలాది మంది భక్తులు వీక్షిస్తుండగా రుద్రేశ్వరుని కళ్యాణం వైభవంగా జరిగింది. గణపతి పూజ, పుణ్యాహవచనం, బాసికధారణ, యజ్ఞోపవీత ధారణ, కన్యాదానం, సుముహూర్తం, మంగళసూత్ర ధారణలతో సశాస్ర్తియంగా నిర్వహించారు. ఈ కళ్యాణోత్సవానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే ద్యాసం వినయ్ భాస్కర్ పట్టు వస్త్రాలను అందించగా, ఎమ్మెల్యేతో పాటు స్పీకర్ మధుసూదనాచారి కూడా పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. రుద్రేశ్వర ఆలయంలో టిపిసిసి మెంబర్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, మాజీ టిపిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, తో పాటు అధికారులు పాల్గొన్నారు.అదేవిధంగా మెట్టురామలింగేశ్వర దేవాలయంలో పరమేశ్వరున్ని వరంగల్ ఎంపి పసునూరు దయాకర్, వర్థన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌లు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కాజీపేటలోని శే్వతార్కగణపతి దేవాలయంలో కొలువుదీరిన సంతాన నాగలింగేశ్వరున్ని ఇనగాల వెంకట్రాంరెడ్డి దర్శించుకుని రుద్రాభిషేకాలు నిర్వహించుకున్నారు. శివరాత్రి వేళ నగరంలోని ఆలయాలే కాకుండా పలు కూడళ్లలో కూడా భక్తులు శివ పార్వతుల కళ్యాణోత్సవాలు నిర్వహించారు.