వరంగల్

ఓం నమః శివాయతో ప్రతిధ్వనించిన కాళేశ్వరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహాదేవపూర్, ఫిబ్రవరి 13: దక్షిణ కాశిగా పేరుగాంచిన కాళేశ్వర ముక్తీశ్వర ఆలయంలో మహా శివరాత్రి సందర్భంగా నామ స్మరణతో మార్మోగింది. మహా శివరాత్రి సందర్భంగా మంగళవారం కాళేశ్వరంలోని శుభానందల దేవి, స్వామి వారి కళ్యాణం కమనీయంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంథని ఎమ్మెల్యే పుట్ట మధూకర్ స్వామి వారికి పట్టు వస్త్రాలను, తలంబ్రాలను సమర్పించారు. కాళేశ్వరాలయంలో వేద పండితులు మంత్రోచ్చరణల మధ్య అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. పర్వదినం సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచే గాక మహారాష్ట్ర, చత్తీస్‌ఘ్ఢ్ రాష్ట్రాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. కాళేశ్వరంను మహాశివరాత్రి సందర్భంగా శ్రీశ్రీశ్రీ విద్యా గణేశానంద భారతి, విద్యా గణేశా సంస్థాన్ ముఖ్యులు, మాజీ మంత్రి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు దుద్ధిళ్ళ శ్రీ్ధర్‌బాబు, పెద్దపల్లి కలెక్టర్ దేవసేన, చత్తీస్‌ఘ్ఢ్ బస్తర్ ఐజి వివేకానంద సింగ్, బస్తర్ కలెక్టర్ ఆజయ్ తాంబలీ, డీఐజీ అలిగా అవసే, ఎస్పీ ఎఆర్ ఐరీలు స్వామి వారికి ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. మంగళవారం సాయంత్రం 5:16 నిమిషాలకు ఉత్తరాషాఢ నక్షత్ర యుక్త కర్కాటక లగ్నం యందు శ్రీ ముక్తీశ్వర శుభానందల దేవీల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి ఎమ్మెల్యే పుట్ట మధూకర్ పాల్గొన్నారు. అశేష జనవాహిని తండోప తండాలుగా తరలివచ్చారు. భక్తులు క్యూలైన్లలో కిక్కిరిసి పోయారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వీరబ్రహ్మయ్య, కాటారం డీఎస్పీ కెఆర్‌కె ప్రసాదరావు, ఎంపీపీ వెన్నపురెడ్డి వసంత మోహన్‌రెడ్డి, సింగిల్ విండో సోసైటీ చైర్మన్లు శ్రీపతిబాబు, లక్కిరెడ్డి నర్సింహ రెడ్డి, ఎక్కేటి అనంతరెడ్డి, జడ్పీటీసీలు హసీనాభానో, మందల రాజిరెడ్డి, చల్ల నారాయణ రెడ్డి, తహాశీల్ధారు సాంబమూర్తి, సర్పంచ్ మెంగని మాధవి అశోక్, కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవాలయం కార్యనిర్వాహాణాధికారి బుర్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ధర్మకర్తలు గంట రాంనారాయణ గౌడ్, అడప సమ్మయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ వెన్నంపల్లి మహేష్‌లు పాల్గొన్నారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు రాత్రి పనె్నండు గంటలకు లింగోద్భవ పూజలతో పాటు మహా రుద్రాభిషేకం, చంఢీ యాగం, కాళరాత్రి వాహానం పూజలు నిర్వహించారు.