వరంగల్

శివనామస్మరణతో మారుమోగిన - రామప్ప దేవాలయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటాపురం(రామప్ప), ఫిబ్రవరి 13: మండలంలోని చరిత్ర కలిగిన రామప్పదేవాలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని అధిక సంఖ్యలో భక్తులు రావడంతో రామప్పదేవాలయం మంగళవారం శివనామాస్మరణతో మారుమోగింది. మాహాశివరాత్రిని పురస్కరించుకుని రామప్ప దేవాలయానికి రాష్ట్రంలోని నలుమూల ప్రాంతాల నుండి భక్తులు వచ్చి రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. రామప్ప ప్రాంగణంలో లైన్స్ క్లబ్ అధ్వర్యంలో ఉచిత మంచినీటి శిబిరాన్ని ఏర్పాటు చేయగా స్థానిక ఎస్సై శ్రీకాంత్ ప్రారంభించి వచ్చిన భక్తులకు మంచినీటిని అందించారు.
* రామప్ప సందర్శించిన ఇంటెక్ కన్వీనర్ పాపరావు
శివరాత్రి సందర్భంగా ఇంటెక్ కన్వీనర్ పాపరావు కుటుంబ సమేతంగా హాజరై స్వామివారికి పూజలు నిర్వహించారు. అదే విధంగా ఆలయ చుట్ట ప్రాంతాలు పరిశీలించారు. అదే విధంగా ములగు సివిల్ జడ్జి ఎ కుమారస్వామి సతిసమేతంగా స్వామి వారిని దర్శించుకున్నారు.
రంగరంగ వైభవంగా శివపార్వతుల కల్యాణం
మండలంలోని పాలెంపేట గ్రామ శివారులో గల రామప్ప దేవాలయంలో శివరాత్రి పురస్కరించుకుని ఆలయ మండపంలో మంగళవారం రాత్రి శివపార్వతుల కళ్యాణం ఆలయ పూజారులు హరీష్‌శర్మ, ఉమాశంకర్‌లు కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. శివపార్వతుల కళ్యాణానికి ఆలయ ఈవో శ్రీనివాస్ , దేవాదాయ శాఖ ఇన్స్‌పేక్టర్ బెల్‌సింగ్ , చైర్మన్ సదాశివరెడ్డి ఆధ్వర్యంలో శివపార్వతులకు పట్టు వస్త్రాలు సమర్పించారు.