వరంగల్

ఓం శివోహం.. ఓం శివోహం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాలకుర్తి, ఫిబ్రవరి 13: మహాశివరాత్రి పర్వదినాన హరిహరులకు నిలయమైనా పాలకుర్తి క్షీరగిరి క్షేత్రంపై జయజయ శంకర.. శివశివ శంకర.. శంభో శంకర నామస్మరణలతో మార్మోగిపోయింది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహాస్వామి ఆలయంలో పరమశివుడు- నరసింహుల దర్శనంకోసం వేలాదిగా భక్తులు తరలిరావడంతో హరిహర క్షేత్రం పోటెత్తింది. మంగళవారం తెల్లవారుజాము నుండే ఉపవాసదీక్షలు చేసే భక్తులు స్వాముల దర్శనం కోసం క్యూలో నిల్చోవడంతో కొండ క్రిందికి భారులు తీరారు. మహాశివరాత్రి రోజునే పరమశివుడు లింగకారుడుగమారి ఆత్మజ్యోతి స్వరూపంలో ఉండే స్వామి దర్శనంతో మారేడు దళాలతో అభిషేకాలు, ఆవునేతితో దీపారాదన చేస్తే బోలాశంకరుడు కరిగిపోయి పుణజన్మ ప్రసాదిస్తాడని భక్తుల విశ్వాసం. తెలుగు రాష్టల్ర నుండే కాకుండ గుజరాత్ నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చి హరిహరులను ప్రసన్నం చేసుకొన్నారు. మహిళలు శివాలయంలోని పార్వతిదేవికి పసుపు, కుంకుమ, పట్టువస్త్రాలు సమర్పించి మాంగల్యాన్ని, పిల్లపాపలను చల్లంగాచూగమని జగన్‌మాతని పూజించారు. ఐదు గుల్లోని కోనేటిలో పూణ్యస్థానాలు చేసి హరిహరుల దర్శనానికి భక్తులు వెళ్ళరు. పాలకుర్తి సీఐ కరుణసాగర్ రెడ్డి, పాలకుర్తి ఎస్సై వెంకటేశ్వర్లుతో పాటు 5గురు ఎస్సైలు, 200 మంది పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు.
* ఎమ్మెల్యే ఎర్రబెల్లి పూజాలు
మహాశివరాత్రి పర్వదినాన పాలకుర్తి శాసనసభ్యులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, జేసీ మాదాటి వనజాదేవి, డీసీపీ మల్లారెడ్డి, ఏసీపీ మధుసూధన్ రెడ్డి, స్టేఘన్‌పూర్ ఆర్‌డీవో ఎల్ రమేష్, డీసీసీ మాజీ చైర్మెన్ జంగ రాఘవరెడ్డి, తహశీల్దార్ భూక్య బన్షీలాల్ స్వాములకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి పాటు పడుతున్నట్లు ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. పర్యాటక అభివృద్ధిలో భాగంగా రూ.10కోట్లతో ఆలయ రూపురేఖలు మారుతయాన్నరు.
*లింగోఉద్భవకాలం...
శివుడు మొట్టమెదటి సారిగ లింగ రూపంలో ఉద్భవించిన కాలన్ని లింగోద్భావకాలం కావడంతో రాత్రి 12-26నిమిషాల నుండి 12-58 వరకు భక్తులు రుద్రభిషేలు నిర్వహించారు.