వరంగల్

ప్రజా సమస్యలను పట్టించుకోని మూర్కుడు కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లింగాలఘణపురం, ఫిబ్రవరి 18: అధికారం చేపట్టి నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా ప్రజా సమస్యలను మాత్రం పట్టించుకోకుండా ఒంటెద్దుపోకడ పోతూ మూర్కుడిలా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరిస్తున్నాడని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిచంగా ఈ కర్యాక్రమానికి ఆయన హాజరై మాట్లాడుతూ కేసీఆర్ చెప్పేది ఒకటి.. చేసేది మరొకటని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడని విమర్శించారు. కేసీఆర్ అరచేతిలో వైకుంఠం చూపిస్తూ ప్రజలను మభ్య పెడుతున్నారని ఆయన అన్నారు. ఒకే సారి రుణమాఫీ చేయకపోవడం వలన 3600మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని దీనికి బాధ్యత సీఎం కేసీఆరేనని అన్నారు. నవాబ్‌పేట రిజర్వాయర్‌కు నిధులు కేటాయించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని, ఇప్పుడు వచ్చి నేనేచేశానని చెప్పావు.. ఎందుకు రిజర్వాయర్‌లో గోదావరి నీళ్లని విడుదల చేయలేదని ఆయన ప్రశ్నించారు. అనంతరం వివిధ పార్టీల నుండి 106మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి పొన్నాల లక్ష్మయ్య కండువా కప్పీ పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతజ్ఞలు కూడా చేశారు. అంతకుముందు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలవేసి భారీ ర్యాలీతో సమావేశానికి హాజరయ్యారు.