వరంగల్

రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, ఫిబ్రవరి 18: కేంద్ర,రాష్ట్రాల్లో హస్తం హవా కొనసాగుతుందని రెండుచోట్ల కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. మహబూబాబాద్ మండలంలోని కంబాలపల్లి గ్రామంలో ఆదివారం ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌పార్టీ బహిరంగసభలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాందీ ఇచ్చారని కాని తానే సాధించినట్లుగా ప్రచారం చేసుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చారన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిన ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుటుంబాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారని విమర్శించారు. ప్రజా సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గాలికొదిలేసిందని ప్రచార ఆర్భాటమే తప్పా ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదన్నారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీలు ఒక్కటికూడా నెరవేర్చలేదని కల్లబొల్లి కబుర్లతో కాలం గడుపుతున్నారని విమర్శించారు. డబుల్‌బెడ్‌రూం ఇళ్లు ఎక్కడా కనిపించడం లేదని, దళితులకు మూడెకరాల భూమి జాడే లేదని, రుణమాఫీ రైతులకు ప్రయోజనం చేకూర్చలేకపోయిందని అన్నారు. రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయినా ఈ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని రైతులకు బేడిలు వేసే నీచ సంస్కృతిని ప్రవేశపెట్టిందన్నారు. కల్లబోల్లి మాటలకు కాలం చెల్లిందని వచ్చే ఎన్నికల్లో ప్రజలు కేంద్రంలో బిజెపికి, రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తగిన గుణపాఠం చెబుతారని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరింత ధైర్యంతో ముందుకు నడవాలని, ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునేందుకు కృషిచేయాలన్నారు. కంబాలపల్లి గ్రామంలో ఈ సందర్భంగా భారి ఎత్తున వివిధ పార్టీలోంచి కాంగ్రెస్ పార్టీలోకి కార్యకర్తలు, నాయకులు చేరగా దొంతి మాధవరెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మండల కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంద వీరన్న అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు వేంనరేందర్‌రెడ్డి, సీతక్క, జిల్లా కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్‌చందర్‌రెడ్డి, మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్ ఉమామురళీనాయక్, జెడ్పిటీసీ మూలగుండ్ల వెంకన్న, పార్టీ నాయకులు సుచిత్రాబాలునాయక్, నునావత్ రాధా, ప్రసాద్‌నాయక్ పాల్గొన్నారు.