వరంగల్

విస్తృతంగా కార్డన్‌సెర్చ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్,్ఫబ్రవరి 20: మహబూబాబాద్ జిల్లాకేంద్రంలో సుమారు 150మంది పోలీస్ సిబ్బందితో తెల్లవారుజామున 4.30గంటల నుండి 7.30గంటల వరకు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి ఆదేశాలతో మహబూబాబాద్ డీఎస్పీ నరేష్‌కుమార్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. జిల్లాకేంద్రంలోని సుందరయ్యనగర్, హన్మంతరావునగర్, ఏటిగడ్డతండా ప్రాంతాల్లో ఈ తనిఖీలు నిర్వహించారు. ప్రతి ఇంటిని వదలకుండా తనిఖీలు చేశారు. ఈ కార్డన్‌సెర్చ్ ఆపరేషన్‌లో ఏలాంటి డాక్యుమెంట్లు లేని 21ద్విచక్ర వాహనాలు, 5ఆటోలు, 14టేకు మొద్దులు అనుమతిలేని కిరోసిన్, డీజిల్ 100లీటర్ల అనుమతి లేని మద్యంతోపాటు అంబర్,గుట్కా పాకెట్‌లు, నల్లబెల్లం నిల్వలు పట్టుపడ్డాయి. వీటిని పోలీసులు సీజ్‌చేశారు.
గతంలో దొంగతనాలు చేసి అనుమానితులుగా ఉన్న ఐదుగురిని ఈ సందర్భంగా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో అనేక చట్టవ్యతిరేక కార్యకలాపాలు, అసాంఘిక చర్యలు జరుగుతున్నాయంటూ ప్రజల నుండి వచ్చిన పిర్యాదులను దృష్టిలో ఉంచుకొని ఈ కార్డన్‌సెర్చ్ నిర్వహించడం జరిగిందన్నారు. ప్రజల్లో పోలీస్ డిపార్ట్‌మెంట్ పనితీరు పట్ల విశ్వాసం పెంచడంతోపాటు చట్టవ్యతిరేక కార్యకలాపాల పట్ల పోలీసుల వైఖరి అత్యంత కఠినంగా ఉంటుందనే సందేశాన్ని ఈ కార్డన్‌సెర్చ్ ద్వారా అందించడం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ ఈ ఆపరేషన్ నిర్వహిస్తామని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. చట్టవ్యతిరేక శక్తుల కదలికలు, అసాంఘిక కార్యకలాపాల ఆనవాళ్లు ఎక్కడ కనిపించినా తక్షణమే ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ కోటిరెడ్డి ఈ సందర్భంగా సూచించారు.
ఈ దాడుల్లో ఇద్దరు డీఎస్పీలు, ఏడుగురు సీఐలు, 12మంది ఎస్సైలు, 23మంది ఎఎస్సైలు, 87మంది కానిస్టేబుళ్లు, ఐదుగురు ఒంగార్డులు పాల్గొన్నారు. కార్డాన్‌సెర్చ్ జరిగిన ప్రాంతాన్ని ఎస్పీ సందర్శించి ఆపరేషన్‌లో పాల్గొన్న సిబ్బందిని ప్రశంసించారు. మహబూబాబాద్ జిల్లాలో శాంతియుత పరిస్థితులు కొనసాగించబడేలా ప్రజలు, పోలీసులు సంఘటితంగా పనిచేయాలని అన్నారు. జిల్లావ్యాప్తంగా చట్టవ్యతిరేక శక్తులపై పోలీస్‌శాఖ ఉక్కుపాదం మొపుతుందని అందుకు ప్రజల సహకారం ఉండాలన్నారు. అక్రమ వ్యాపారాలకు అలవాటు పడ్డ వారిని వదిలేదని, తమ కార్యకలాపాలను అలాంటి వ్యక్తులు మానుకోవాలని తెపిరు. ఈ తనిఖీల్లో ఎఆర్ డీఎస్పీ రాంచందర్, టౌన్ సీఐ జబ్బార్‌తోపాటు జిల్లాలో ఉన్న పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ముస్లింలు, ఎస్టీలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి
* టీపీసీసీ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ కత్తి వెంకటస్వామి
నర్సంపేట, ఫిబ్రవరి 20: ముస్లీంలకు 12 శాతం, అదే విధంగా ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని మభ్యపెట్టి మోసం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరెండు వర్గాల ప్రజలకు బాహాటంగా క్షమాపణ చెప్పాలని టీపీసీసీ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ కత్తి వెంకటస్వామి డిమాండ్ చేశారు. నర్సంపేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ప్రొఫెసర్ కత్తి వెంకటస్వామి మాట్లాడారు. ప్రతిపక్షాలు, ముస్లీం, ఎస్టీ సంఘాల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండా వారికి సంబంధించిన రిజర్వేషన్ ఫైల్‌ను కేంద్ర ప్రభుత్వానికి పంపిచారని చెప్పారు. అయితే ఈతరహాలో రిజర్వేషన్ సాధ్యం కాదని, ఫైల్‌ను పరిశీలనకు కూడా తీసుకోకపోవడం చూస్తే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ముస్లీంలు, ఎస్టీలపై ఏ పాటి చిత్తశుద్ది ఉందో అర్ధం అవుతుందన్నారు. అయితే ఎగ్జుక్యూటీవ్ ఉత్తర్వుల ఆధారంగా ముస్లీంలు, ఎస్టీలకు పది శాతం మేర విడివిడిగా రిజర్వేషన్లు పెంచేందుకు వీలుందని, అలా కాకుండా వారిని మభ్యపెట్టేందుకే సీఎం కేసీఆర్ ఇలా వ్యవహరించారని మండిపడ్డారు. ఇదే సమయంలో వారికి సంబంధించిన కోటాను బీసీ రిజర్వేషన్లలో కల్పించేందుకు కేసీఆర్ చూస్తున్నారని, ఇదే జరిగితే టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై బీసీలంతా తిరుగుబాటు చేయక తప్పదని హెచ్చరించారు.
వర్గీకరణ సాధనే లక్ష్యంగా పోరాటం
మాదిగ జేఏసీ నిర్ణయం
వెంకటాపురం (నూగూరు), ఫిబ్రవరి 20: ఎస్సీ వర్గీకరణ సాధనే లక్ష్యంగా మాదిగలు చేస్తున్న ఉద్యమాలను నీరు గార్చే విధంగా పాలక ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని ప్రభుత్వ కుయుక్తులను తిప్పికొట్టి వర్గీకరణ సాధనే లక్ష్యంగా పోరాటాలు చేయాలని మాదిగ జేఏసీ అధ్యక్షుడు యాసం శ్రీను పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ అతిథి గృహం ఆవరణలో జరిగిన సమావేశంలో ఈ నెల 28వ తేదీన చలో హైద్రాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిస్తూ వాల్‌పోస్టర్లను మాదిగ జేఏసీ నాయకులు ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ విద్యార్థి ఉద్యమ నాయకుడు డాక్టర్ పిడమర్తి రవి మాదిగ జేఏసీని ఏర్పాటు చేసి మలిదశ ఉద్యమాన్ని ప్రారంభించారని లక్ష్యాన్ని సాధించే వరకు మాదిగలంతా ఒక్కతాటిపై నిలవాలని పిలుపునిచ్చారు.