వరంగల్

రైతుల పట్ల చిత్తశుద్ధిలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పర్వతగిరి, ఫిబ్రవరి 20: సర్కారుకు రైతుల పట్ల చిత్త శుద్ధి లేదని కాంగ్రెస్ రూరల్ కిసాన్ సెల్ అధ్యక్షుడు బొంపల్లి దేవేందర్‌రావు అన్నారు. మంగళవారం పర్వతగిరి మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైతు ఆత్మహత్యలపై హోమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాటిన తీరు భాదకరమని అన్నారు. రైతు ఆత్మహత్యలన్ని నిజమైనవి కావని, కూలీలు, మేస్ర్తిలు ఆత్మహత్యలు చేసుకున్న ప్రభుత్వ పరిహారం కోసం రైతుల ఖాతలో వేస్తున్నారని ఆయన అనడం విడ్డూరం అన్నారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరరాక వాతవరణ పరిస్థితులు అనుకులించక, ఎరువులకు, పంటపోలాలకు మందులకు పెట్టుబడి పెట్టాలేక ఆత్మహత్యలు చేసుకున్న వారిని బూటకపు ఆత్మహత్యలుగా చిత్రీకరించడం ప్రభుత్వం రైతు వ్యతిరేఖ తీరుకు నిదర్శనని అన్నారు.

రాయపర్తిని అభివృద్ధి చేస్తా
పేదల సొంతింటి కల డబుల్ బెడ్‌రూం ఇళ్లు *ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు
రాయపర్తి, ఫిబ్రవరి 20: మండలంలోని అన్ని గ్రామాలను ఆరు నెలలోగా అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మంగళవారం మండలంలోని పెరకవేడు, గట్టీకల్, మైలారం, కాట్రపల్లి, కోలన్‌పల్లి గ్రామాలలోని డబుల్‌బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలకు, గ్రామాలలోని అంతర్గత రోడ్ల నిర్మాణాలకు ఎమ్మెల్యే శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాలలో సిసి రోడ్లు, బీటి రోడ్లను వేసేందుకు పక్క ప్రణాళికలను తయారు చేశామని అన్నారు. ఆరు నెలలలోనే గ్రామాల రూపురేఖలను మార్చేస్తానని తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ అండతో నియోజకవర్గానికి అధిక నిధులు తీసుకవచ్చి అభివృద్ధి పరుస్తానని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి అయితే ఈ ప్రాంత ప్రజల కష్టాలు తొలిగిపోతాయని అన్నారు. ఆ ప్రాజెక్టు ద్వారా మండలంలోని అన్ని గ్రామాల చెరువులకు నీళ్లు తీసుకవచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశామలం చేస్తానని అన్నారు. రైతుల కళ్లలో ఆనందం చూడాలన్నదే ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ధ్యేయం అని అన్నారు. పేదోడికి సొంతింటి కల సాకారం చేయాలన్నదే లక్ష్యాంగా డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలను చేపడుతున్నామని ఆయన తెలిపారు. ఈ ఇళ్లను మూడు నెలలో పూర్తి చేసి ఇళ్లులేని అర్హులైన పేదవారికే ఇళ్లను అందిస్తామని, డబుల్‌బెడ్ రూం ఇళ్ల ఎంపికలో పారదర్శకంగా ఉటుందని అన్నారు. కళ్యాణ లక్ష్మి పథకం ఆడపిల్ల తల్లి దండ్రులకు వరంలాంటిదని ఈ పథకం ద్వారా పెళ్లిల్లు చేసే తల్లి దండ్రులు ధైర్యంగా పెళ్లిల్లు చేస్తున్నారని అన్నారు. సంక్షేమ పథకాలు అందిరికి అందేలా అధికారులు చొరవ చూపాలని అన్నారు.