వరంగల్

మార్చి 10లోపు పూర్తి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఫిబ్రవరి 20: జిల్లాలో ఉన్న అన్ని గ్రామాలలో మార్చి 10వరకు వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేసి (ఒడిఎఫ్) మలవిసర్జన రహత గ్రామాలుగా ప్రకటించాలని జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ యం. హరిత అన్నారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో సంబందిత అధికారులతో ఓడిఎఫ్‌పై డిఆర్‌డి ఓ శేఖర్‌రెడ్డి అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఇంచార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి రోజు గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్స్, కార్యదర్శులు సందర్శించి మరుగుదొడ్ల నిర్మాణ పనుల పురోగతిపై పర్యవేక్షించాలని అన్నారు. పనుల పురోగతిలో లేని గ్రామాల అధికారులను పనులు ఎందుకు ఆలస్యం జరుగుతందని అడిగి తెలుసుకున్నారు. పనుల పురోగతి లేని గ్రామ అధికారులను ఈ సందర్భంగా మందలించారు. ప్రతి మంగళవారం మరుగుదొడ్ల నిర్మాణ పనుల పురోగతిపై సమీక్షా ఉంటుందని తప్పక అధికారులు హాజరు కావాలని తెలిపారు. నిధులు ఉన్నా పనులు ఆలస్యం చేయడం సరికాదని అన్నారు. ఇచ్చిన గడువులోపు పనులు పూర్తి చేసి రావాలని మళ్లి సాకులు చెపితే ఉపేక్షించేది లేదని అధికారులను ఆదేశించారు.
వంద శాతం పన్నులు
జిల్లాలో వంద శాతం పన్నులు వసూలు చేయాలని ఈ మేరకు పంచాయితీ సెంక్రటరీలకు లక్ష్యాలను విధించాలని జిల్లా కలెక్టర్ యం.హరిత డిపిఓను ఆదేశించారు. జిల్లాలో ఇప్పటి వరకు 39శాతం పన్నులు వసూలు అయ్యాయని ఆమె తెలిపారు. వర్ధన్నపేట, నల్లబెల్లి, నెక్కొండ మండలాలను మెటిరియల్ కొనుగోలు కొరకు 20 లక్షలు, ఖానాపూర్ మండలానికి 10 లక్షల నిధులు మంజూరి చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడివోలు ప్రత్యేక అధికారులు డిపిఓ శ్రీనివాస్ రెడ్డి, డిఎఫ్‌ఓ పురుషోత్తం, ఎస్సీ, ఎస్టీ, బిసి సంక్షేమ అధికారులు సురేష్, ఫనికుమార్, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ హరిప్రసాద్, ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సి ఐ కంరచంద్, ఇవో పి ఆర్‌డిలు కార్యదర్శలు తదితర సంబందిత అధికారులు పాల్గొన్నారు.

ఉద్యోగ క్యాలండర్‌ను ప్రకటించాలి
నిరుద్యోగులకు రూ.5వేల భృతి కల్పించాలి *ఏఐఎఫ్‌డీవై జాతీయ అధ్యక్షుడు అశోక్
నర్సంపేట, ఫిబ్రవరి 20: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.60లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని, తక్షణమే ఉద్యోగ క్యాలండర్‌ను ప్రకటించాలని ఏఐఎఫ్‌డీవై జాతీయ అధ్యక్షుడు మద్దికాయల అశోక్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నర్సంపేటలోని ఓంకార్ విజ్ఞాన కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అశోక్ మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాల ప్రాతిపదికపై ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టిన కేసీఆర్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన చేయడం లేదని, ప్రజల ఆశలపై నీళ్లు చల్లిందన్నారు. ఇప్పటి వరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ ద్వారా కేవలం ఆరువేల ఉద్యోగాలతో పాటు మరో 11వేల పోలీసులు కొలువును మాత్రమే భర్తీ చేసిందని చెప్పారు. తొలి అసెంబ్లీలో రాష్ట్రంలో లక్షా ఏడు వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ తనమాటనే అమలు చేయకపోవడం దారుణమని అన్నారు. ఉపాధ్యాయులు, అధ్యాపకుల ఖాళీలతో పాటు విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్ల పోస్టులను సైతం భర్తీ చేయకపోవడం శోచనీయమని వాపోయారు. మరో వైపు ఇప్పటికే మూతపడ్డ నిజాం షుగర్ ఫ్యాక్టరీ, ఏపీ రేయాన్, ఐడీపీఎల్, డీబీఆర్ తదితర ఫ్యాక్టరీలను పునరుద్దరించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం సరి కాదన్నారు. మరో వైపు యువత డ్రగ్స్ మత్తులో తూలి తమ జీవితాలను కోల్పోలుతున్నా పట్టించుకోవడం లేదని, ఇప్పటి వరకు డ్రగ్స్ కేసులో తీసుకున్న చర్యలు శూన్యమని చెప్పారు. అదే విధంగా నయిం కేసును ప్రభుత్వం ఎటూ తేల్చకపోవడం దారుణమని అన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి కాషాయికరణపై ఉన్న శ్రద్ద ప్రజలపై ఏమాత్రం లేకుండా పోయిందన్నారు. దేశంలో, రాష్ట్రంలో యువత అభివృద్దికి సమగ్ర యువజన విధానాన్ని రూపొందించి అమలు చేయాలని కోరారు. ప్రతి నిరుద్యోగికి నెలకు 5వేల రూపాయల జీవన భృతి చెల్లించి జీవన భద్రత కల్పించాలని అన్నారు.