వరంగల్

కోరిన కోర్కెలు తీర్చే ఇలవేల్పు బుగులు వెంకటేశ్వరుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టేషన్‌ఘన్‌పూర్, ఫిబ్రవరి 20: భక్త జనులకు ఇలవేల్పు అయిన శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి కోరిన కోర్కెలు తీర్చుటలో ప్రతి ఒక్కరికి ఆరాధ్య దైవంగా చిల్పూర్ గుట్టలో నెలచిన దేవుడే ప్రధానమని స్ధానికులు భావిస్తున్నారు. నేటి నుండి (్ఫబ్రవరి 21న) ప్రారంభం కానున్న చిల్పూర్ శ్రీ బుగులు వెంకటేశ్వరుడి బ్రహోత్సవాలు 27వరకు కొనసాగుతాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఫాల్గుణ శుద్ధ దశమి ఆదివారం (25)న స్వామి వారి కళ్యాణ మహోత్సవం జరుగనుంది. ప్రతి సంవత్సరం జరుపుకునే ఉత్సవాలకు జిల్లానుండే కాక ఇతర ప్రాంతాలనుండి భక్తులు అధిక సంఖ్యలో హాజరై వారి మొక్కులను తీర్చుకుంటారు. ప్రతి ఏటా వెంకటేశ్వర స్వామి భక్తుల సందడితో మంగళ ప్రదమైన వేద వేదాంగ మంత్రోచ్ఛరణలతో ఆరాధన గేయాలతో తెలంగాణ ప్రాంతపు ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా శ్రీబుగులు వేంకటేశ్వర స్వామి దేవస్ధానం విలసిల్లుచున్నది. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ కేంద్రానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న చిల్పూర్ మండల కేంద్రంలో కొలువై ఉన్న బుగులు వెంకటేశ్వర స్వామి దేవాలయం జిల్లాలో ఉన్న దర్శనీయ క్షేత్రాలల్లొ ఒకటిగా చెప్పుకోవచ్చు. స్వామివారి కళ్యాణ మహోత్సవానికి భక్త జనులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆలయ ప్రధాన అర్చకులు సౌమిత్రి రంగాచార్యులు, బ్రాహ్మణపల్లి నాగభూషణశర్మలు, చైర్మెన్ మూల నాగరాజు, కార్యనిర్వాహణ అధికారి చెరుకు జయశంకర్‌లు కోరారు.
స్థల పురాణం
పురాణాల కధనం ప్రకారం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి, పద్మావతి తో వివాహం చేసుకోడానికి చేసిన అప్పును తీర్చలేక చిల్పూర్ బుగులు గుట్ట పై భయంతో తలదాచుకున్నట్లు చెపుతుంటారు. భయంతో వచ్చి ఇక్కడ ఆవరించిన ఆ దేవుడు బుగులు వెంకన్నగా ప్రసిద్ధి గాంచారు. గ్రామస్ధులు గుట్టపైకి ఎక్కి చూడగా గుహలో పాదాలు మోపిన ఆనవాళ్ళు కనిపించగా వాటిని చేతులతో తాకి భక్తులు తన్మయం చెందినట్లు కథధలు కథలుగా చెపుతుంటారు. ఎంతో ఎత్తులో వెలిసిన భగవంతుడు భక్తులందరికి ఆనువుగా ఉండేవిధంగా గుట్ట కింది భాగంలో ఆలయ నిర్మాణాన్ని నిర్మించారు. అప్పటినుండి భక్తులు వెంకటేశ్వరున్ని దర్శించి తరిస్తుంటారు. తిరుపతి వెళ్ళి శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకునే స్ధోమత లేని నిరుపేదలు దర్శించుకునే విధంగా చిల్పూర్‌లో వెంకటేశ్వరుడు వెలిశాడని ఇక్కడి భక్తుల నమ్మకం. క్రమ క్రమంగా భక్తుల రాకపోకలు పెరిగాయి. వెంకటేశ్వరుడే స్వయంగా తలదాచుకున్న ఆ కొండ గుహను చూసి తరించడానికి భక్తులు వివిధ ప్రాంతాలనుండి తరలివస్తుంటారు.

*దేవస్ధాన అభివృద్ధి
దేవస్ధాన అభివృద్ధికి 54 ఏళ్ళ కృషి అనంతరం 1994 లో మాజి సమితి అధ్యక్షుడు కేశిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి రూ. 1లక్ష 60 వేల విరాళం సేకరించి చిల్వూర్ దేవస్ధానాన్ని అభివృద్ధి పరిచేందుకు తనవంతు కృషి చేశారు. దేవస్ధాన చైర్మన్ సట్ల రాజయ్య ఆధ్వర్యంలో అప్పటి మంత్రి కడియం శ్రీహరి రూ. 8 లక్షలను ప్రభుత్వ గ్రాంట్‌ను ఆలయ నిర్మాణానికి మంజూరి చేశారు. ఆ డబ్బులతో మహా మండపం, ఉప ఆలయాలు ఆంజనేయస్వామి ఆలయం నిర్మించి 1999 ఫిబ్రవరి 7 న శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమాన్ నారాయణ చిన్నజీయర్ స్వామి చేతుల మీదుగా విగ్రహా ప్రతిష్టాపన చేశారు. జాతీయ రహదారి పైన ఉన్న చిన్నపెండ్యాల గ్రామం వద్ద స్వాగత తోరణాన్ని నిర్మించి ఆలయ ప్రాధాన్యతను మరింత పెంపోందించారు. నేటి నుండి జరిగే బ్రహ్మోత్సవాల వరకు భక్తులకు మరిన్ని సదుపాయాలను కల్పించాలనే ఉద్దేశంతో పలువురు దాతలు విరాళాలు ప్రకటించారు. ధర్మసాగర్ మండలం పీచర గ్రామానికి చెందిన దీకొండ లక్ష్మినారాయణ రూ. 25 లక్షలతో రాజగోపురం, ప్రాకార మండపం, సాలాహార నిర్మాణాలు పూర్తిచేశారు. అలగోజు సదానందం(కాకతీయ విశ్వవిద్యాలయ మాజీ రిజిస్ట్రార్) దాదాపు రూ. 2లక్షలతో రెండు గదులతో వసతి గృహాన్ని నిర్మించారు. అదేవిధంగా చిలగాని భిక్షపతి రూ. 2లక్షలతో మరో వసతి గృహ నిర్మాణాన్ని చేపట్టారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే డా. తాటికొండ రాజయ్య చొరవతో మంజూరీ చేయించిన టీటీడీ నిధులతో కాలక్షేప మండపాన్ని నిర్మిస్తున్నారు.

గోదావరి జలాలతో.. రైతుల కాళ్లు కడుగుతా
*రాష్ట్ర సివిల్ సప్లయ్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి

నర్సంపేట, ఫిబ్రవరి 20: గోదావరి జలాలను నర్సంపేట నియోజకవర్గానికి తీసుకవచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయనున్నట్లు రాష్ట్ర సివిల్ సప్లయ్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి చెప్పారు. నర్సంపేటలో టీఆర్‌ఎస్ నియోజకవర్గ నాయకుడు రాయిడి రవీందర్ రెడ్డి స్వగృహంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడారు. నర్సంపేట నియోజకవర్గాన్ని ఇప్పటికే ఇరిగేషన్ సర్క్యూట్‌గా తీర్చిదిద్దామని చెప్పారు. దేవాదుల పైప్‌లైన్ ద్వారా గోదావరి జలాలను రంగయ్య చెరువు, పాఖాల చెరువులకు మళ్లించి రెండు పంటలకు సాగునీరు అందించనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే పైప్‌లైన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. మే చివరి నాటికి ఎర్ర రంగయ్య చెరువు పనులను పూర్తి చేస్తామని అన్నారు. వచ్చే ఖరీఫ్ నాటికి గోదావరి జలాలను తీసుకవచ్చి రైళుల కాళ్లు కడుగుతానని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేసేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ఇటీవల తాను 371 హ్యాబిటేషన్లలో చేపట్టిన పల్లె ప్రగతిలో హామీ ఇచ్చిన అభివృద్ది పనులను ఆరునూరైనా అమలు చేసి తీరుతానని చెప్పారు. త్వరలోనే పల్లె ప్రగతి పనులకు అధికారిక అనుమతులు తీసుకరానున్నట్లు తెలిపారు. కాగా అభివృద్దిని చూసి ఓర్వలేకనే ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిలు టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలకు దిగుతున్నారని అన్నారు. ఎవరి హయంలో ఏం అభివృద్ది జరిగిందో ప్రజలంతా గమనిస్తున్నారని స్పష్టం చేశారు. ఇదే సమయంలో ప్రజలంతా టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి అండగా ఉన్నారని వివరించారు.