వరంగల్

ప్రపంచంలోనే భారీ ప్రాజెక్టు కాళేశ్వరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూపాలపల్లి, ఫిబ్రవరి 23: తెలంగాణ రాష్ట్రంలో నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అతి పెద్ద భారీ సాగునీటి ప్రాజెక్టు అని రాష్ట్ర శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. శుక్రవారం శాసన మండలి సభ్యులతో కలిసి కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా గోదావరి నదిపై మేడిగడ్డ వద్ద నిర్మిస్తున్న బ్యారేజీ నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ నల్ల వెంకటేశ్వర్లు ఛాయా చిత్ర పదర్శన ద్వారా ఎమ్మెల్సీలకు ప్రాజెక్టు నిర్మాణ పద్దతిని, ఎంత వరకు నిర్మాణం అయింది, నిర్మాణం పూర్తయితే రైతులకు కలిగే మేలును వివరించారు. అనంతరం శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ మాట్లాడుతూ చైనా దేశం తర్వాత అతి తక్కువ సమయంలో ఇంత భారీ ప్రాజెక్టును, ప్రపంచ స్థాయి నాణ్యతతో నిర్మించడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే సాధ్యమైందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిందే సంవత్సరం పొడవునా మేడిగడ్డ నుండి ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీరు ఉన్నంత వరకు గోదావరిలో నీరు ఉండి, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల వరకు కూడా రైతులకు సాగునీరు అందించేందుకు అనువుగా ఉంటుందని చెప్పారు. అదే విధంగా అన్నారం బ్యారేజీ, మేడిగడ్డ బ్యారేజీ, సుందిళ్ల బ్యారేజీ, ఎల్లంపల్లి ప్రాజెక్టుల వల్ల ఈ ప్రాంతం పర్యాటక పరంగా చాలా అభివృద్ది చెంది ప్రజలకు మంచి ఉపాధి కలుగుతుందని తెలిపారు. ఇంత అద్భుతంగా ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూ ప్రాజెక్టును శరవేగంగా నిర్మిస్తున్న తట్ట మోసే కూలీ నుండి చీఫ్ ఇంజనీర్ వరకు అందరిని అభినంధిస్తూ బంగారు తెలంగాణకు ఈ ప్రాజెక్టు ఒక కడపలా నిలుస్తుందన్నారు. ఈకార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, స్థానిక ఎమ్మెల్యే పుట్ట మధు, ఎమ్మెల్సీలు రాంచందర్‌రావు, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, బోడకుంటి వెంకటేశ్వర్లు, పాతూరి సుధాకర్‌రెడ్డి, పూల రవీందర్, కాటేపల్లి జనార్ధన్‌రెడ్డి, పురాణం సతీష్‌కుమార్, నారదాసు లక్ష్మణ్‌రావు, బానుప్రసాద్, భూపతిరెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, వి.్భపాల్‌రెడ్డి, ఎం ఎస్.ప్రభాకర్‌రావు, సయ్యద్ అనీముల్ హసన్ జాఫ్రీ, కసిరెడ్డి నారాయణరెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణ, వి.గంగాధర్‌గౌడ్, మహ్మద్ ఫరీదుద్దిన్, కొంపెల్లి యాదవరెడ్డి, సబావత్ రాములునాయక్, శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ఎస్పీ ఆర్.్భస్కరన్, జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.