వరంగల్

నిరంతర విద్యుత్‌ను అందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఫిబ్రవరి 23: వేసవి కాలం మొదలైనందున రోజురోజుకి విద్యుత్ వినియోగం పెరుగుతుందని, అందుకు తగ్గటుగా వినియోగదారులకు నిరంతరమైన మెరుగైన, నాణ్యమైన విద్యుత్ అందించేందుకు కార్యాచరణ ప్రణాలికను రూపొందించుకోవాలని ఎన్‌పిడిసిఎల్ సిఎండి అన్నమనేని గోపాల్‌రావు అధికారులను అదేశించారు. శుక్రవారం హన్మకొండలోని విద్యుత్ భవన్‌లో ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని వరంగల్ రూరల్, నర్సంపేట, ములుగు, మహబూబాబాద్, భూపాలపల్లి, తొర్రూర్ విద్యుత్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని ఐపిడిఎస్, డిడియుజిజెవై.అభివృద్ధి పనుల కొరకు అనుమతులు మంజూరు చేసిన వాటి పురోగతి ఎలా ఉంది అని తెలుసుకుని వాటని త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. 6 నెలల పైబడిన వ్యవసాయ కనెక్షన్ దరఖాస్తులను వెంటనే మంజూరు చేయాలని చెప్పారు. డిమాండ్ రోజురోజుకు పెరుగుతున్న దృశ్య అందుకు తగ్గటుగా వినియోగదారులకు నిరంతరయమైన , మెరుగైన, నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు కార్యచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. రెవెన్యూ కలెక్షన్ ప్రతి నెల 100% వసూలు చేయాలని అన్నారు. సబ్‌స్టేషన్ల మెయింటేనెన్స్ విధిగా నిర్వహించాలని అన్నారు. డిటిఆర్ ఫెయిల్యూర్స్‌పై తమ స్థాయిలో పర్యవేక్షించి విద్యుత్ అంతరాయాలు లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్(పాజెక్స్ట్, ఫైన్నాన్స్, హెచ్ ఆర్‌డి బి. వెంకటేశ్వరరావు, డైరెక్టర్( ఆపరేషన్) నర్సింగ్‌రావు, మోహాన్‌రావు, కిషన్, ఎస్, ఈలు, జి.శివరాం, నరేష్, శ్రీకాంత్, డి ఈరూరల్ విజేందర్‌రెడ్డి, అకౌంట్స్ ఆఫీసర్స్ పాల్గొన్నారు.

అన్‌సాన్‌పల్లి వీఆర్వో సస్పెన్షన్
మల్హర్, ఫిబ్రవరి 23: మండలంలోని అన్‌సాన్‌పల్లి వీఆర్వో బండి వెంకటయ్యను సస్పెండ్ చేశారు. ఈ మేరకు తహశీల్దారు సురేష్ శుక్రవారం విలేఖరులకు తెలిపారు. అన్‌సాన్‌పపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 40లో కొంత మంది పేరిట భూ మార్పిడికి వీఆర్వో బండి వెంకటయ్య పాల్పడినట్లుగా గ్రామస్థులు ఫిర్యాదు చేశారని, దాంతో జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ చేపట్టినట్లు తహశీల్దారు సురేష్ వివరించారు. విచారణ నివేదికను పరిశీలించిన మీదట ప్రభుత్వం వీఆర్వో వెంకటయ్యను సస్పెన్స్‌న్ చేసినట్లు తహశీల్దారు సురేష్ తెలిపారు. అన్‌సాన్‌పల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 40లో 80 ఎకరాలకు పైగా ఉన్న భూమిని అదే గ్రామానికి చెందిన కొంత మంది రాజకీయ నాయకుల పేర్లపై అక్రమంగా భూ మార్పిడికి ప్రయత్నించినట్లు, వారి పేరిట పట్టాదారు పాసుబుక్కులు ఇప్పించేందుకు సిద్ధం చేయడంతో కొందరు వ్యక్తులు వీఆర్వో బండి వెంకటయ్యపై ఫిర్యాదు చేసినట్లు తహశీల్దారు సురేష్ తెలిపారు. ఫిర్యాదును పరిశీలించగా అక్రమాలకు పాల్పడినట్లుగా విచారణలో తేలడంతో వీఆర్వో వెంకటయ్యపై సస్పెన్షన్ వేటు పడినట్లు తహశీల్దారు సురేష్ వివరించారు.