క్రైమ్/లీగల్

అంతర్‌రాష్ట్ర దొంగకు బేడీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నక్కలగుట్ట, మార్చి 7: తాళం వేసివున్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న అంతర్‌రాష్ట్ర దొంగను బుధవారం సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన నిందితుడి నుండి సుమారు 15 లక్షల విలువ గల 511 గ్రాముల బంగారు అభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ క్రైం అదనపు డీసీపీ బీ. అశోక్‌కుమార్ వివరాలను వెల్లడించారు. నిందితుడు కొత్తగూడెం, ములకలపల్లి గ్రామానికి చెందిన కేతిరి రాము అలియాస్ కేదారి పార్ధుగా గుర్తించారు. నిందితుడు కేతిరి రాము తన స్వగ్రామానికి పరిసరప్రాంతాల్లో ఉన్న గ్రామాల్లో చిక్కు వెంట్రుకలను అమ్మడం, కొనడం చేసేవాడు. 2007 సంవత్సరంలో నిందితుడి తండ్రి మరణించడంతో నిందితుడు తన స్నేహితుడితో కలసి మద్యంతో పాటు ఇతర జల్సాలకు అలవాటు పడ్డాడు. నిందితుడు తన వృత్తి ద్వారా వచ్చే ఆదాయం తన జల్సాలకు సరిపోకపోవడంతో నిందితుడు చోరీలు చేసేందుకు సిద్ధడ్డాడు. ఇందులో భాగంగా నిందితుడు తొలిసారిగా 2008 లో తన స్నేహితులతో కలిసి విజయవాడ క్రిష్ణలంక, ఖమ్మం, ఇల్లందు పరిసర ప్రాంతాలలో విద్యుత్ ట్రాన్స్‌ఫారంలోని కాపర్ తీగను దొంగిలించి పోలీసులకు దొరికాడు. ఇదే తరహలో మహబూబునగర్ జిల్లాలో చోరీలకు పాల్పడగా పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. నిందితుడు జైలు జీవితం గడిపిన జైలు నుండి విడుదలైన త్వరత తన వృత్తిని కొనసాగిస్తూనే.. ఆదాయం సరిపోకపోవడంతో నిందితుడు తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీ చేసేందుకు నిర్ణయించుకున్నాడు. నిందితుడు చిక్కు వెంట్రుకలు అమ్మే క్రమంలో తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి రాత్రి సమయాల్లో తాళం వేసి ఉన్న ఇళ్ల తాళలు పగులగొట్టి చోరీలకు పాల్పడేవాడని తెలిపారు. నిందితుడు 2017 డిసెంబర్ మాసం నుండి ఇప్పటి వరకు ఎనిమిది చోరీలకు పాల్పడ్డాని. ఇందులో భూపాలపల్లి జిల్లా, ములుగు పోలీస్ స్టేషన్ పరిధిలో 2, వరంగల్ పోలీస్ కమీషరేట్ పరిధిలోని మామూనూర్-2 పర్వతగిరి-2, ఖాజీపేట , ఘన్‌పూర్, పోలీస్‌స్టేషనలలో ఒకటి చొప్పున చోరీకి పాల్పడ్డాడని తెలిపారు. నిందితుడు తాను చోరీ చేసిన సోత్తును అమ్మి జల్సాలు చేద్దామనే అలోచనతో తన వద్ద ఉన్న బంగారం అమ్మేందుకు బుధవారం ఉదయం బిలియన్ మార్కెట్‌కు వచ్చి అనుమానస్పదంగా తిరుగుతుండగా క్రైం ఏసీపీ బి. బాబురావుకు సమాచారం అందడంతో ఆయన అదేశాల మేరకు సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ డేవిడ్‌రాజు తన సిబ్బందితో వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకుని నిందితుడిని తనిఖీ చేయగా, అతని వద్ద బంగారు ఆభరణాలు ఉన్నట్లు గుర్తించి విచారించారు. నిందితుడు చోరీలకు పాల్పడినట్లు పోలీసుల వద్ద అంగీకరించాడు. నిందితుడిని సకాలంలో గుర్తించి చోరీ సొత్తును స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభ కనబరిచిన అదనపు డీసీపీ అశోక్ కుమార్, ఏసీపీ క్రైం బి.బాబురావు, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ డేవిడ్‌రాజు, ఎస్సై బీవీ సుబ్రమణ్యేశ్వరరావు, ఎఎస్సై వీరస్వామి, హెడ్‌కానిస్టేబుళ్ళు శివకుమార్, సుధీర్, జంపయ్య, కానిస్టేబుళ్లు మహేశ్వర్, వంశీలను సీపీ సుధీర్ బాబు అభినందించారు.