వరంగల్

టీడీపీ హయాంలోనే అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సంపేట, మార్చి 13: నర్సంపేట నియోజకవర్గం టీడీపీ హయాంలోనే అభివృద్ది చెందిందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు రోడ్లు, తాగునీరు, సాగునీరు, విద్యుత్ అందించిన ఘనత టీడీపీదేనని చెప్పారు. చెన్నారావుపేట మండలంలోని కోనాపురం, ఉప్పరపల్లి, గురిజాల, జీజీ ఆర్ పల్లె, లింగాపురం గ్రామాల్లో పల్లె పల్లెకు తెలుగుదేశం సమీక్షా సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయా గ్రామాల్లో కార్యకర్తలనుద్దేశించి రేవూరి ప్రసంగించారు. తెలంగాణ వాదాన్ని ఢిల్లీలో గట్టిగా వినిపించింది టీడీపీ పార్టీయేనని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వానికి ఆనాడు చంద్రబాబు నాయుడు మొట్టమొదటి లేఖ రాశారని చెప్పారు. ఇదే సమయంలో తెలంగాణ కోసం ప్రప్రథమంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసింది తానేనని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల ప్రాతిపదికపై ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా పాలన చేయడం లేదని విమర్శించారు. పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే తెలంగాణ రాష్ట్ర ఫలాలను మాత్రం నలుగురు సభ్యులున్న కేసీఆర్ కుటుంబం మాత్రమే అనుభవిస్తుందని మండిపడ్డారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించకుండా రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా అన్ని వర్గాల ప్రజలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు. మద్దతు ధర కోసం ఆందోళన చేసిన రైతాంగాన్ని ఈ ప్రభుత్వం బేడీలు వేసి జైలుకు పంపించిందన్నారు. రైతాంగాన్ని ఆదుకునేందుకు వెయ్యి కోట్లు ఇవ్వని సీఎం కేసీఆర్ ఆంధ్రా కాంట్రాక్టర్ అయిన మెగా కన్‌స్ట్రక్షన్ కృష్ణారెడ్డికి ఇప్పటికే 48వేల కోట్ల రూపాయలను ఇచ్చారని ధ్వజమెత్తారు. అశోక్‌నగర్ ఢీప్లొరైడ్ ప్రాజెక్టుకు మూడు నుండి నాలుగు కోట్ల రూపాయలను వెచ్చిస్తే నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు వస్తుందని, అయితే ఎక్కడో ఉన్న పాలేరు నుండి 15వందల కోట్ల రూపాయలను కేటాయించి ప్రత్యేక పైప్‌లైన్ వేసి నీరు ఇచ్చేందుకు పూనుకోవడం సరైంది కాదన్నారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అభివృద్ది పనుల ముసుగులో ప్రజాధనాన్ని కాజేస్తున్నరని ఆరోపించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేఖ విధానాలు, ఎమ్మెల్యే దొంతి అభివృద్ది ముసుగులో ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని, ప్రజలంతా గమనించాల్సిందిగా పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో తాను మరో మారు ఎమ్మెల్యే కావడవం ఖాయమని, రాష్ట్రంలోనే నర్సంపేట నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని వివరించారు. ఈకార్యక్రమంలో టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జాటోతు సంతోష్‌నాయక్, బలుగూరి నరేందర్‌రెడ్డి, జనగం స్వామి, మండల నాయకులు రాంచంద్రారెడ్డి, నర్సింగారావు, మామిండ్ల మోహన్‌రెడ్డి, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

పరకాల నియోజకవర్గానికి నెలాఖరుకి శుద్ధమైన తాగునీరు
* వరంగల్ రూరల్ కలెక్టర్ హరిత
వరంగల్, మార్చి 13: పరకాల నియోజకవర్గానికి ఈ నెల 30వ తేదిలోగా శుద్ధమైన తాగు నీరు అందించడమే లక్ష్యంతో పనులు ముమ్మరం చేయాలని రూరల్ జిల్లా కలెక్టర్ ఎం.హరిత అన్నారు. మంగళవారం మిషన్ భగీరథ పనులపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సింగరాజుపల్లిలో ఇన్‌టెక్‌వెల్, పంప్‌సెట్లు, పైప్‌లైన్, సంప్, జిఎల్బీర్, ఓహెచ్‌బిఆర్ కంపోనెంట్ పనులు పూర్తి అయ్యాయని, నీటిని విడుదల చేసి అక్కడి నుండి హాబీటేషన్స్‌కు వెళ్లే పైప్‌లైన్ టెస్టింగ్ పనులు జరుగుతున్నాయని అధికారులు కలెక్టర్‌కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరిత మాట్లాడుతూ ఈ నెల 30వ తేదీలోగా టెస్టింగ్ పూర్తి చేసుకొని పరకాల నియోజకవర్గంలోని 155 హ్యాబిటేషన్స్‌కు తాగు నీరు అందించాలని అన్నారు. ప్రస్తుతం టెస్టింగ్‌కు 4 బృందాలు ఉన్నాయని, మరిన్ని బృందాలను పెంచాలని సూచించారు. సింగరాజుపల్లి నుండి పరకాల పట్టణానికి, పరకాల, ఆత్మకూరు, దామెరా, మండలాలకు ఒక లైన్, అదే విధంగా గీసుగొండ, సంగెం, మండలాలకు ఒక లైన్ ఇలా మూడు ప్రత్యేక లైన్లు ఉన్నందున ఇప్పటకే పరకాల పట్టణం పైప్ లైన్ పూర్తియైనందున మిగిలిన రెండు లైన్ల టెస్టింగ్ పనులు సమాంతరంగా పూర్తి చేయాలని తెలిపారు. నర్సంపేట, 472 హ్యాబిటేషన్స్ ఉన్నాయని ఏప్రిల్‌లో టెస్టింగ్ పూర్తి చేస్తామని అధికారులు తెలపగా నర్సంపేట ప్రాంతంలో హ్యాబిటేషన్స్ మధ్య దూరం ఎక్కువ ఉంటుందని టెస్టింగ్ వేగవంతంగా పూర్తి అయ్యాలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. వర్ధన్నపేట, పర్వతగిరి మండలాలకు ఎప్పటికి టెస్టింగ్ పూర్తి అవుతుందో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. హ్యాబిటేషన్ నుండి ప్రతి ఇంటికి నల్లా ద్వారా నీరందించేందుకు ఇంట్రా విలేజ్ పనులు ఏ మేరకు వచ్చాయని ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులను ఆరా తీశారు. పరకాల నియోజవర్గంలో హ్యాబిటేషన్ వరకు నీరందించే పనులు పూర్తి కావస్తున్న నేపథ్యంలో ప్రధాన్యతగా పరిగణంచి ఇంట్రా విలేజ్ పనులు పూర్తి చేయాలని తెలిపారు. సమావేశంలో మిషన్ భగీరథ ఎస్‌ఈ బంగారయ్య, ఆర్‌డబ్ల్యుఎస్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

పరకాల మాస్టర్ ప్లాన్ డ్రాప్‌పై సమావేశం
పరకాల, మార్చి 13: పరకాల నగర పంచాయతీ సమావేశం మందిరంలో మంగళవారం పరకాల మాస్టర్ ప్లాన్ డ్రాప్‌పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆర్‌డిడిటీసీపి రవిందర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వివిధ శాఖ అధికారులతో, కమిషనర్ జోనా, చైర్‌పర్సన్ మార్త రాజభద్రయ్య, కౌన్సిలర్లతో సమీక్ష నిర్వహించి వారి నుండి సలహాలు, సూచనలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో కౌన్సిల్ సభ్యులు మడికొండ సంపత్, చిదురాల దేవేందర్, కందుకూరి వేణుగోపాలమూర్తి, బండి రవి, జూనియర్ అసిస్టెంట్ వెంకట్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు, మెప్మా సిబ్బంది జవాన్ రాజు తదితరులు పాల్గొన్నారు.