వరంగల్

పట్టణాల అభివృద్ధికే జివో 51

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, మార్చి 13: రాష్ట్రంలోని అర్బన్ లోకల్ బాడిస్ గల 74 జిల్లా పట్టణ కేంద్రాలను పట్టణాభివృద్ధి శాఖ ద్వారా ప్రజల ఆశయాలకు అనుగుణంగా సమగ్రంగా అభివృద్ధి చేయడం జరుగుతుందని, అందు నిమిత్తం ప్రభుత్వం జిఓ నెం 51ని రూపొందించటం జరిగిందని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయా జిల్లా , పట్టణకేంద్రాలలో చేపట్టాల్సిన ఇన్నోవేషన్ పనులను సూచిస్తూ అందుకు సంబందించిన ప్రతిపాదనలను త్వరితగతిన ప్రభుత్వానికి పపించాల్సిందిగా జిల్లా కలెక్టర్లను మంత్రి కోరారు. రానున్న రోజులలో 145 మున్సిపాలిటీలు లోకల్ బాడిస్‌గా గుర్తింపు పొందనున్నాయని, 33 నుండి 34 లక్షల మంది జనాభా సుమారు తెలంగాణలో 45 శాతం జనాభా ఈ మున్సిపాలిటీలలో భాగస్వామ్యులు కానున్నారని తెలిపారు. ఈ క్రమంలో నూతన ధృక్ఫధంతో ప్రజల అభిరుచికి అనుగుణంగా అభివృద్ధి పనులకు రూపకల్పన చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రతి జిల్లా కేంద్రాన్ని విజిబుల్ ఇంపాక్ట్ వుండే విధంగా ప్రజలకు ప్రయోజనం కలిగే విధంగా వౌళిక సదుపాయాలతో పాటు జంక్షన్ల అభివృద్ధి, పబ్లిక్ పార్క్‌లు, గ్రేవ్ యార్డ్‌లు, ఓపెన్ ఆడిటోరియం నిర్మాణం, లేక్ బ్యూటిఫికేషన్, గ్రీనరీ, అదే విధంగా శాస్ర్తియ పద్దతిలో బస్ బేల నిర్మాణం వంటి పనులను సృజనాత్మకతతో చేపట్టి పట్టణాలను సుందరంగా ఆకర్షనీయంగా తీర్చిదిద్దాలన్నారు. ఈ పనులను టియఫ్ ఐడిసి ద్వారా పర్యవేక్షించడం జరుగుతుందని ఈ పనులకు స్థానిక మున్సిపాలిటీలకు ఎలాంటి సంబంధం ఉండదన్నారు. ఈ పనులను క్షేత్రస్ధాయిలో సమర్ధవంతంగా అమలు చేయడానికిగాను మున్సిపాలిటీల సంఖ్యను బట్టి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డిఆర్‌వో వంటి ఉన్నతాధికారులు ఒక్కొ మున్సిపాటీకి స్పెషల్ ఆఫీసర్లుగా బాధ్యతలు నిర్వర్తించాలని, తద్వారా పనులు వేగవంతంగా జరిగి ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయని మంత్రి పేర్కొన్నారు.
పట్టణ సమీపంలో ప్రభుత్వ స్థలం ఉన్నట్లయితే బ్లాక్ ప్లాంటేషన్ చేపట్టి అందులో వాకింగ్ ట్రాక్ ఆహ్లదకరమయిన వాతవరణాన్ని కల్పించాలన్నారు. అధికారులు పనుల ప్రతిపాదనలు రూపొందించే ముందు పబ్లిక్ హెల్త్ , స్థానిక మున్సిపల్ అధికారులతోకో ఆర్టీనేట్ చేసుకోవడంతో పాటు స్థానిక ఎంపి, ఎమ్మెల్యేల అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకోవాలన్నారు. వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ హరిత మాట్లాడుతూ జిల్లా పరిధిలో నర్సంపేట, పరకాల మున్సిపాలిటీలు ఉన్నాయని వాటిని సమగ్రంగా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయుటకు స్థానిక ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో ప్రతి పాదనలు రూపొందించి ప్రభుత్వానికి సమర్పిస్తామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ కమీషనర్ గౌతమ్, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.