వరంగల్

పోలీసు, మీడియా కలిసి ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రంగల్, మార్చి 1: సమాజంలో పోలీసులు, మీడియా అత్యంతకీలకమని బదిలీపై వెలుతున్న వరంగల్ సీపీ సుధీర్‌బాబు అన్నారు. మంగళవారం వరంగల్ నగరంలో ఉమ్మడి వరంగల్ జిల్లా జర్నలిస్టుల అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ వీడ్కోలు సభలో సీపీ సుధీర్‌బాబు మాట్లాడుతూ మీడియా అనేది ఒక గొప్ప వ్యవస్థ అనీ, సమాజంలో జరిగే మంచీ, చెడునూ వెలికితీసేదే మీడియా అన్నారు. విలేఖరులు విధినిర్వహణలో ఎలా ఒత్తిడిని ఎదుర్కొంటారో పోలీసులు కూడా కొన్ని సందర్భాలలో అంతకంటే ఎక్కువగా ఒత్తిడికి గురవుతారని అన్నారు. అయితే ఎవరి వృత్తి ధర్మాన్ని వారు పాటించాలని కోరారు. ఉద్యోగ నిర్ణయాల్లో ఎవరూ కూడా అడ్డురావడం సరైంది కాదన్నారు. వరంగల్ లాంటి చైతన్యవంతమైన జిల్లాలో దాదాపు మూడు సంవత్సరాలు పని చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు అన్నారు. అయితే తాను దత్తత తీసుకున్న హసన్‌పర్తి మండలం పెంబర్తి గ్రామాన్ని అదే విధంగా కొనసాగిస్తానని, తన శక్తి మేరకు ఆగ్రామాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు. తాను విధినిర్వహణలో ఎక్కడికి వెళ్లినా ఓరుగల్లును మాత్రం మరువనన్నారు. ప్రభుత్వ ఉద్యోగి అన్నాక బదిలీ తప్పదని తెలిపారు. ప్రజలు, పోలీసు సిబ్బంది, జర్నలిస్టుల సహకారంతో జిల్లాలో విజయవంతంగా పనిచేసానని గర్వంగా చెపుతున్నానని అన్నారు. తాను ఎక్కడ విధులు నిర్వహించిన వరంగల్ భధ్రకాళి అమ్మవారిని మరువని, వీలుదొరికినప్పుడల్లా ఇక్కడి వస్తానని అన్నారు. సమావేశంలో జర్నలిస్టు సంఘాల నాయకులు బిఆర్ లెనిన్, దొంతు రమేష్, పిన్న శివకుమార్, గడ్డం కేశవమూర్తి, వల్లాల రమణ, సుధాకర్, శ్రీ్ధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
* రాష్ట్ర సివిల్ సప్లయ్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి
నర్సంపేట, మార్చి 13: అన్ని వర్గాల సంక్షేమమే టీఆర్‌ఎస్ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర సివిల్ సప్లయ్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి స్పష్టం చేశారు. నర్సంపేటలో అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు నల్లా భారతి స్వగృహంలో ఎంపీ కవిత జన్మదిన వేడుకలు మంగళవారం టీఆర్‌ఎస్‌కేవీ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా పెద్ది హాజరై ప్రసంగించారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను ఎంపీ కవిత ప్రపంచానికి చాట చెప్పి తెలంగాణ ఖ్యాతిని ఖండాంతరాలకు విస్తరింపజేసిందని చెప్పారు. ప్రధానంగా బతుకమ్మ ఆటపాటను ప్రపంచానికి తెలియజేసి మహిళల కీర్తిని ఇనుమడింపజేసిందని వెల్లడించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. నర్సంపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేయడమే తన ధ్యేయమని చెప్పారు. ఈ క్రమంలో మహిళలకు సబ్సిడీపై కుటీర పరిశ్రమల యూనిట్లను తీసుకవచ్చానని, ఆసక్తి ఉన్న మహిళలు కుటీర పరిశ్రమల స్థాపన కోసం ఈనెలాఖరులోగా దరఖాస్తు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. అనంతరం కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. ఈసందర్భంగా నల్లా భారతి అందించిన వంద చీరలను మహిళలకు పెద్ది పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్ నాగెల్లి వెంకటనారాయణ, వైస్ చైర్మన్ మునిగాల పద్మా వెంకట్‌రెడ్డి, నాయకులు కామగోని శ్రీనివాస్, గోనె యువరాజు, కొల్లూరి లక్ష్మీనారాయణ, పాలడుగుల రమేష్, బత్తిని శిరీష, గొర్రె రాధ, విజయలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.